MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Water Bottles: స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా? ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

Water Bottles: స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా? ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

Water Bottles: మీరు మీ ఇంట్లో స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా? ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, వాటిని సరిగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అసలు.. స్టీల్ వాటర్ బాటిల్స్ ని ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 19 2026, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Steel Water Bottle
Image Credit : amazon website

Steel Water Bottle

ఆఫీసు, కాలేజీ లేదా ట్రావెలింగ్‌కి వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లను వాడటం ఈ రోజుల్లో ఒక మంచి అలవాటుగా మారింది. చల్లటి నీళ్లు చల్లగా, వేడి టీ లేదా కాఫీ వేడిగా ఉండటానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అయితే చాలామంది రోజూ వీటిలో నీళ్లు మాత్రమే తాగుతున్నాం కదా అని కేవలం పైపైన నీళ్లతో కడిగేసి వదిలేస్తుంటారు. బాటిల్ అడుగుభాగంలో, క్యాప్ రబ్బర్ గ్యాస్కెట్ల వద్ద కంటికి కనిపించని జిడ్డు, నాచు, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. సరిగ్గా శుభ్రం చేయని బాటిళ్ల వల్ల కడుపునొప్పి, ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. మీ స్టీల్ బాటిల్‌ను నిత్యం కొత్తదానిలా, పరిశుభ్రంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
స్టీల్ బాటిల్ శుభ్రం చేసే విధానం..
Image Credit : amazon website

స్టీల్ బాటిల్ శుభ్రం చేసే విధానం..

1. బేకింగ్ సోడా :

ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను బాటిల్‌లో వేసి, అందులో గోరువెచ్చని నీటిని నింపాలి. దీనిని ఒక 2 నుండి 3 గంటలు లేదా రాత్రంతా అలాగే ఉంచి, ఉదయాన్నే బాటిల్ బ్రష్‌తో రుద్ది కడిగితే లోపల ఉన్న మొండి మరకలు, దుర్వాసన పూర్తిగా మాయమవుతాయి.

2. వెనిగర్, గోరువెచ్చని నీరు :

వెనిగర్ ఒక సహజ సిద్ధమైన క్రిమిసంహారిణి. బాటిల్‌లో సగం భాగం తెలుపు వెనిగర్, మిగతా సగం గోరువెచ్చని నీరు పోయాలి. ఒక 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత సబ్బు నీళ్లతో శుభ్రంగా కడిగితే బ్యాక్టీరియా నశించి, బాటిల్ ఫ్రెష్‌గా మారుతుంది.

3. నిమ్మరసం, ఉప్పు :

బాటిల్‌లో రెండు చెంచాల నిమ్మరసం, ఒక చెంచా రాళ్ల ఉప్పు, కొన్ని మంచు ముక్కలు వేసి బాగా ఊపాలి . నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్, ఉప్పు లోని బరకతనం బాటిల్ అడుగున ఉన్న మురికిని తొలగిస్తాయి. బాటిల్ శుభ్రంగా మారుతుంది.

4. బియ్యం, సబ్బు నీళ్ల హ్యాక్ :

బాటిల్ అడుగువరకు చేతులు లేదా బ్రష్ వెళ్లనప్పుడు... కొద్దిగా బియ్యం, గోరువెచ్చని నీరు, రెండు చుక్కల డిష్ వాష్ లిక్విడ్ బాటిల్‌లో వేయాలి. మూత పెట్టి బాగా గట్టిగా ఊపితే, బియ్యం గింజలు స్క్రబ్బర్‌లా పనిచేసి లోపల ఉన్న జిడ్డును పూర్తిగా వదిలిస్తాయి.

33
5. బాటిల్ క్యాప్, రబ్బర్ గ్యాస్కెట్ క్లీనింగ్ :
Image Credit : Gemini

5. బాటిల్ క్యాప్, రబ్బర్ గ్యాస్కెట్ క్లీనింగ్ :

ఎక్కువ బ్యాక్టీరియా చేరుకునేది బాటిల్ మూత , దానికి ఉండే రబ్బర్ గ్యాస్కెట్ దగ్గరే పేరుకుపోతుంది. ప్రతివారం ఈ రబ్బర్ రింగ్‌ను జాగ్రత్తగా బయటకు తీసి, పాత టూత్ బ్రష్ , సబ్బు నీళ్లతో క్లీన్ చేయాలి. లేదంటే అక్కడ నల్లటి బూజు పడుతుంది.

6. గాలికి ఆరబెట్టడం చాలా ముఖ్యం :

బాటిల్‌ను శుభ్రం చేసిన వెంటనే మూత పెట్టేయకూడదు. బాటిల్‌ను తిరగేసి తేమ లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. తడి ఉన్నప్పుడే మూత పెడితే మళ్లీ బూజు పట్టేసి దుర్వాసన వస్తుంది.

చేయకూడని తప్పులు : స్టీల్ స్క్రబ్బర్లు వాడకండి: బాటిల్ లోపల లేదా బయట గీతలు, పడకుండా ఉండటానికి స్టీల్ పీచు కాకుండా స్పంజ్ లేదా సాఫ్ట్ బాటిల్ బ్రష్ మాత్రమే వాడండి. అంతేకాదు, ఘాటైన కెమికల్స్ వాడకూడదు. ఇవి స్టీల్ గిన్నె పొరను దెబ్బతీస్తాయి. అయితే.. స్టీల్ బాటిళ్లను డిష్ వాటర్ లో మాత్రం పెట్టకూడదు. పెడితే.. వాటి హీట్ రోగ నిరోధక శక్తి దెబ్బ తీస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Train: రైలు ఎక్కడం కాదు... సరదాగా మీరే రైలు నడపొచ్చు.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడో తెలుసా?
Recommended image2
Tan Removal: ఎండకు ముఖం టాన్ పట్టేస్తుందా? ఈ ఈజీ టిప్ తో మొత్తం క్లీన్
Recommended image3
Gold Bracelet: ఎలాంటి డ్రెస్సుతో అయినా సూపర్ లుక్ ఇచ్చే బ్రేస్లెట్స్!
Related Stories
Recommended image1
Mutton: మటన్ కొంటున్నారా? తాజా, లేతగా ఉన్న మటన్ ఎంచుకోవడానికి బెస్ట్ చిట్కాలు
Recommended image2
Cooking Hacks: శనగలు, రాజ్మా నానపెట్టడం మర్చిపోయారా? అయినా మెత్తగా ఉడకపెట్టే ట్రిక్ ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved