MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Mutton: మటన్ కొంటున్నారా? తాజా, లేతగా ఉన్న మటన్ ఎంచుకోవడానికి బెస్ట్ చిట్కాలు

Mutton: మటన్ కొంటున్నారా? తాజా, లేతగా ఉన్న మటన్ ఎంచుకోవడానికి బెస్ట్ చిట్కాలు

Mutton: మార్కెట్లో ఎప్పుడు మటన్ కొన్నా కూడా.... ముదురుగా మారిపోతోందా? కొన్ని సింపుల్ చిట్కాల ఫాలో అయితే... మీకు ఎలాంటి అవగాహన లేకపోయినా ప్రతిసారీ తాజా మటన్ కొనచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 16 2026, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మటన్ కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..
Image Credit : Chatgpt

మటన్ కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..

వీకెండ్ వస్తే చాలు దాదాపు అందరూ కమ్మగా నాన్ వెజ్ తినాలని అనుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ అంటే ఎక్కువ మందికి వెంటనే మటన్ గుర్తుకు వస్తుంది. కానీ, చాలా మందికి మంచి మటన్ కొనుగోలు చేయడం పెద్ద సవాలు. మంచిగా, ఫ్రెష్ గా ఉండే మటన్ ఎంచుకోవడం మీకు రావడం లేదా? అయితే.. ఈ సింపుల్ విషయాలు గుర్తుంచుకుంటే...మీరు కొనే మటన్ ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తాజా మటన్ గుర్తించడానికి చిట్కాలు...
Image Credit : Getty

తాజా మటన్ గుర్తించడానికి చిట్కాలు...

రంగు పరీక్ష: తాజా మటన్ ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన ముదురు ఎరుపు రంగులో, తేమగా కనిపిస్తుంది. రంగు వెలిసిపోయినట్లు, బూడిద లేదా నలుపు రంగులోకి మారినట్లు ఉంటే ఆ మాంసాన్ని తీసుకోకండి. అది చాలా సేపు బయట ఉంచడం వల్ల పాడైపోయి ఉండవచ్చు.

వాసన పరీక్ష : తాజా మటన్‌కు తేలికపాటి సహజమైన మాంసం వాసన మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఘాటైన, పుల్లటి లేదా అమోనియా లాంటి ఘాటు వాసన వస్తుంటే ఆ మటన్ పాడైపోయిందని అర్థం.

తాకి చూడండి : మటన్‌ను వేలితో తేలికగా నొక్కి చూడండి. నొక్కినప్పుడు అది మళ్లీ పాత స్థితికి వస్తే అది తాజా మటన్. ఒకవేళ నొక్కిన లోతు అలాగే ఉండిపోయినా, లేదా ముక్కలు జిగటగా, మెత్తగా ఉన్నా అది పాతబడిన మాంసం అని గుర్తుంచుకోండి.

ఎముకల పరిమాణం : మటన్ త్వరగా ఉడికి, లేతగా ఉండాలంటే చిన్న మేక లేదా గొర్రె మాంసం ఎంచుకోవాలి. దీనిని గుర్తించడానికి ఎముకలను చూడండి. చిన్నగా, గుండ్రంగా ఉన్న ఎముకలు ఉంటే అది లేత మటన్. లావుగా, పెద్ద ఎముకలు ఉంటే అది ముదురు మటన్ అని గుర్తించాలి.

కొవ్వు రంగు : కూర రుచిగా ఉండటానికి కొవ్వు సహాయపడుతుంది, కానీ అది తాజాగా ఉండాలి. మటన్‌కు ఉన్న కొవ్వు తెల్లగా లేదా తెల్లటి వెన్న రంగులో ఉండాలి. కొవ్వు పసుపు రంగులోకి మారితే అది ముదురు అని గుర్తించాలి.

33
మాంసం కొనుగోలు చేసేటప్పుడు పాటించాల్సిన హెల్త్‌కేర్ టిప్స్:
Image Credit : Gemini AI

మాంసం కొనుగోలు చేసేటప్పుడు పాటించాల్సిన హెల్త్‌కేర్ టిప్స్:

స్కిన్‌లెస్ వాడటం మంచిది: మాంసం చర్మంలో సాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్కిన్‌లెస్ మటన్ లేదా చికెన్ ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది.

FSSAI మార్క్ చూడండి: సూపర్ మార్కెట్లలో ప్యాక్ చేసిన మాంసం కొనేటప్పుడు FSSAI ప్రామాణిక ముద్ర ఉందో లేదో సరిచూసుకోండి.

ప్యాకేజింగ్: వాక్యూమ్ ప్యాక్ చేసిన మాంసంలో బ్యాక్టీరియా పెరగదు. ఒకవేళ ప్యాకింగ్ కవర్లు చినిగి ఉన్నా లేదా రంధ్రాలు ఉన్నా ఆ ప్యాకెట్లను తీసుకోకూడదు.

నమ్మకమైన షాప్ ఎంచుకోండి: కెమికల్స్, ఇంజెక్షన్లు ఇవ్వని సహజమైన వాతావరణంలో పెరిగిన జంతువుల మాంసాన్ని విక్రయించే నమ్మకమైన వ్యాపారుల వద్ద మాత్రమే మటన్ కొనండి.

వంటకాల రుచి మనం ఎంచుకునే పదార్థాల నాణ్యత పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మటన్ కొనేటప్పుడు ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంట్లో వండే మటన్ కర్రీ లేదా బిర్యానీ రెస్టారెంట్ కంటే అద్భుతంగా కుదురుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: పెరుగు పులియకుండా 3 రోజులు తాజాగా ఉంచడం ఎలా?
Recommended image2
Tablet: ట్యాబ్లెట్ వేసుకొనేటప్పుడు ఎన్ని నీళ్లు తాగాలి? ఈ తప్పులు మాత్రం చేయకండి..!
Recommended image3
Black Beads Chain: 3 గ్రాముల బంగారంలో వచ్చే నల్లపూసల చైన్స్.. ఇవిగో!
Related Stories
Recommended image1
Curd: పెరుగు నీళ్లు లేకుండా గడ్డలా తోడుకోవాలా? ఈ ఒక్క ఆకు వేస్తే చాలు, అమ్మమ్మల నాటి చిట్కా
Recommended image2
Kasuri Methi: కూరలో కసూరీ మేథీ ఎందుకు వేయాలి? ఎలా వేస్తే కూరకు రుచి పెరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved