MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • America: అమెరికాలో ఇళ్ల ముందు కరెంటు స్తంభాలు, వైర్లు ఎందుకు కనిపించవు?

America: అమెరికాలో ఇళ్ల ముందు కరెంటు స్తంభాలు, వైర్లు ఎందుకు కనిపించవు?

America: అమెరికాలో ఇళ్లను చూస్తే చాలా అందంగా ఉంటాయి. ఇంటి ముందు మొక్కలు తప్ప కరెంటు స్తంభాలు కానీ, వేలాడే వైర్లు కనిపించవు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా? అక్కడ ఇళ్లకి కరెంటు ఎలా అందుతుంది?

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 17 2026, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అమెరికాలో కరెంటు స్తంభాలు ఎందుకు ఉండవు?
Image Credit : Gemini AI

అమెరికాలో కరెంటు స్తంభాలు ఎందుకు ఉండవు?

మనదేశంలో రోడ్ల మీద, ఇళ్ల ముందు చూస్తే కరెంటు స్తంభాలు, అల్లుకున్న కరెంటు వైర్లు కనిపిస్తాయి. కానీ అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం ఇళ్ల ముందు ఒక్క కరెంటు స్తంభం కానీ, వేలాడే వైరు కానీ కనిపించదు. ఇళ్లు ఎంతో అందంగా ఉంటాయి. మరి అమెరికాలోని ఇళ్లకు కరెంటు ఎలా అందుతుంది?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎందుకు కనిపించవంటే..
Image Credit : Swa By The Way Instagram

ఎందుకు కనిపించవంటే..

అమెరికాలో కొత్త కాలనీ కట్టే ముందే ఒక పక్కా ప్లాన్ ఫాలో అవుతారు. ఇళ్లు కట్టకముందే కరెంటు, గ్యాస్ పైప్‌లైన్, ఇంటర్నెట్ (ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్), తాగునీటి పైపులను భూమి లోపల (అండర్ గ్రౌండ్) సిస్టమాటిక్‌గా వేస్తారు. ప్రతి ఇంటికి కావాల్సిన కనెక్షన్లు అన్నీ భూమి లోపలి నుంచే ఇస్తారు. అందుకే బయట ఎలాంటి వైర్లు, స్తంభాలు కనిపించవు. అంతా అక్కడ అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయి.

ఇళ్లు, రోడ్ల అందం చెడిపోకూడదనేదనే ఇలా అక్కడ ప్లాన్ చేశారు. స్తంభాలు, చిక్కుబడిన వైర్లు ఉంటే ఆ ప్రాంతం అందవిహీనంగా మారుతుంది. ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్ వల్ల మొత్తం ఏరియా చాలా నీట్‌గా, అందంగా కనిపిస్తుంది.

33
విపత్తుల నుంచి రక్షణ కోసం
Image Credit : Swa By The Way Instagram

విపత్తుల నుంచి రక్షణ కోసం

అమెరికాలో మంచు తుఫాన్లు, హరికేన్లు, భారీ ఈదురు గాలులు తరచూ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు రోడ్డు పక్కన ఉన్న స్తంభాలు విరిగిపడితే కరెంటు పోవడమే కాకుండా, భారీగా ఆస్తి నష్టం జరుగుతుంది. అదే అండర్ గ్రౌండ్ వైరింగ్ ఉంటే ప్రకృతి విపత్తులు వచ్చినా కరెంటు సప్లైకి ఎలాంటి ఢోకా ఉండదు.

అలాగే బయట వైర్లు లేకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్, కరెంటు షాక్ కొట్టడం వంటివి కూడా జరగవు. వాహనాలు వెళ్లి స్తంభాలను ఢీకొట్టే ప్రమాదాలు జరగవు. ముఖ్యంగా చిన్న పిల్లలకు, పెంపుడు జంతువులకు ఇది చాలా సేఫ్. అయితే ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఏర్పాటుకి ఖర్చు ఎక్కువే అవుతుంది. కానీ ప్రజలకు చాలా సురక్షితం, మెయింటెనెన్స్ కూడా ఈజీ.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రోడ్లు స్ట్రెయిట్ గా వేస్తే దూరం తగ్గుతుందిగా.. మరి వంకరటింకరగా, మలుపులు తిప్పుతూ ఎందుకు వేస్తారు?
Recommended image2
మేఘాలను తాకే అనుభూతి కావాలా? ఏపీలోని ‘వంజంగి మేఘాల కొండ’ల మీదకు వెళ్లండి
Recommended image3
Snakes : పాములు రోజుకు ఎంత నీరు తాగుతాయి? వాటి దాహం ఎలా తీరుతుంది?
Related Stories
Recommended image1
Potatoes: బంగాళాదుంపలు ఉడికించే నీటిలో వీటిని కలిపి చూడండి.. కూర ఎంత రుచిగా వస్తుందో
Recommended image2
Coins in River: నదుల్లో నాణేలు వేయడం వెనుక అసలు నిజం ఇది.. ఇకనైనా వేయడం ఆపండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved