MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • దేవుడి గదిలో మట్టి కుండ, రాతి ఉప్పు పెట్టి చూడండి... కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో మార్పులు

దేవుడి గదిలో మట్టి కుండ, రాతి ఉప్పు పెట్టి చూడండి... కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో మార్పులు

ఇంట్లోని దేవుడి గదిలో కల్లుప్పు, ఎర్రటి వస్త్రంతో ఉన్న చిన్న మట్టి కుండను చాలా మంది పెడుతూ ఉంటారు. ఇలా ఎందుకు పెట్టారు అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద కారణమే ఉంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 17 2026, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
దేవుడి గదిలో మట్టికుండ, రాతి ఉప్పు ఎందుకు?
Image Credit : roopa0410 Instagram

దేవుడి గదిలో మట్టికుండ, రాతి ఉప్పు ఎందుకు?

దేవుడి గదిలో మట్టికుండ, రాతి ఉప్పు, ఎర్రటి వస్త్రంలో నాణాలు వంటివి పెట్టడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. కొంతమందికి ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవదు. అనవసర ఖర్చులు విపరీతగా పెరుగుతాయి. ఆ సమస్యలు తీరడానికి స్వామీజీలు చెప్పిన పవర్‌ఫుల్ వాస్తు పరిహారమే ఇది. ఇందులో వాడే ప్రతి వస్తువుకూ పంచభూతాలతో సంబంధం ఉంది.

మట్టి కుండ: ఇది 'భూమి తత్వాన్ని' ఆకర్షించి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.

కల్లుప్పు: లక్ష్మీదేవి స్వరూపమైన కల్లుప్పు.. ఇంటికి పట్టిన చెడు దృష్టిని, నెగెటివ్ ఎనర్జీని తరిమికొడుతుంది.

ఎర్రటి వస్త్రం & నాణేలు: ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. నాణేలు డబ్బును ఆకర్షిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పరిహారానికి కావాల్సిన వస్తువులు
Image Credit : roopa0410 Instagram

పరిహారానికి కావాల్సిన వస్తువులు

ఒక చిన్న మట్టి కుండ
పసుపు, కుంకుమ, గంధం
జవ్వాది పౌడర్ (పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది)
కల్లుప్పు (దొడ్డు ఉప్పు)
ఒక చిన్న ఎర్రటి వస్త్రం
11 నాణేలు (కాయిన్స్)
5 లవంగాలు

33
తయారు చేసే విధానం
Image Credit : roopa0410 Instagram

తయారు చేసే విధానం

కుండ తయారీ: మట్టి కుండను శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. పసుపు, గంధం కలిపి కుండ బయట పూయండి. 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి.

లోపల వేయాల్సినవి: కుండలో కొద్దిగా పసుపు, కుంకుమ, సువాసన ఇచ్చే జవ్వాది పౌడర్ వేయండి. ఆ తర్వాత పావు వంతు కల్లుప్పు నింపండి.

11 నాణేల రహస్యం: ఒక చిన్న ఎర్రటి వస్త్రంలో 11 నాణేలు పెట్టి మూట కట్టండి. దాన్ని కుండలోని కల్లుప్పు మధ్యలో పెట్టండి.

లవంగాల వాడకం: ఆ మూటపై మళ్లీ కొద్దిగా కల్లుప్పు వేసి కప్పేయండి. దాని పైన 5 లవంగాలు పెట్టండి.

పూజ: ఈ కుండను దేవుడి గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసి ధూప దీపాలతో భక్తిగా పూజ చేయండి.

ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది. శుభ ఫలితాలు వస్తాయి. ప్రతి పౌర్ణమికి కుండలో ఉన్న కల్లుప్పు, 5 లవంగాలను మాత్రమే మార్చండి (పాత ఉప్పును నీళ్లలో కరిగించి బయట పారబోయండి). ఎర్రటి వస్త్రంలో ఉన్న 11 నాణేలను మాత్రం అలాగే ఉంచండి.

మీకు ప్రతి నెలా జీతం రాగానే, ఆ డబ్బును ముందుగా ఈ కుండపై పెట్టి లక్ష్మీదేవికి దండం పెట్టుకోండి. కనీసం అరగంట పాటు ఆ డబ్బును కుండపైనే ఉంచి, ఆ తర్వాత తీసి వాడుకోండి. ఇలా చేయడం వల్ల డబ్బు వృథా కాదు. అనవసర ఖర్చులు తగ్గి సంపద పెరుగుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Train: రైలు ఎక్కడం కాదు... సరదాగా మీరే రైలు నడపొచ్చు.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడో తెలుసా?
Recommended image2
Tan Removal: ఎండకు ముఖం టాన్ పట్టేస్తుందా? ఈ ఈజీ టిప్ తో మొత్తం క్లీన్
Recommended image3
Gold Bracelet: ఎలాంటి డ్రెస్సుతో అయినా సూపర్ లుక్ ఇచ్చే బ్రేస్లెట్స్!
Related Stories
Recommended image1
Modi Food: ప్రధాని మోదీ ప్రతిరోజూ ఇష్టంగా తినే అయిదు ఆహారాలు ఇవే
Recommended image2
America: అమెరికాలో ఇళ్ల ముందు కరెంటు స్తంభాలు, వైర్లు ఎందుకు కనిపించవు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved