MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Sprouted Green Gram: 30 రోజులపాటు మొలకెత్తిన పెసలు తింటే ఏమవుతుందో తెలుసా?

Sprouted Green Gram: 30 రోజులపాటు మొలకెత్తిన పెసలు తింటే ఏమవుతుందో తెలుసా?

Sprouted Green Gram: ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఫుడ్స్‌ నే తినాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో సులభంగా దొరికే పెసలతో కూడా మంచి పోషకాలు పొందవచ్చు. ముఖ్యంగా మొలకెత్తిన పెసలు.. 30 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే శరీరంలో ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 22 2026, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొలకెత్తిన పెసలు తినడం వల్ల కలిగే లాభాలు
Image Credit : our own

మొలకెత్తిన పెసలు తినడం వల్ల కలిగే లాభాలు

మన రోజువారీ ఆహారంలో చిన్న చిన్న మార్పులు కూడా ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో మొలకెత్తిన పెసలకు ప్రత్యేక స్థానం ఉంది. 30 రోజుల పాటు మొలకెత్తిన పెసలు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పోషకాల గని
Image Credit : our own

పోషకాల గని

మొలకెత్తిన పెసల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెసలను మొలకెత్తించడం వల్ల వాటిలోని కొన్ని పోషకాలు శరీరానికి సులభంగా అందే అవకాశం ఉంటుంది. కాబట్టి మొలకెత్తిన పెసలను రోజువారీ సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

35
జీర్ణక్రియకు మేలు
Image Credit : Getty

జీర్ణక్రియకు మేలు

30 రోజుల పాటు మొలకెత్తిన పెసలు తింటే జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. వీటిలో ఉండే ఫైబర్ పేగుల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్నవారికి మొలకెత్తిన పెసలు తినడం ఉపయుక్తంగా ఉంటుంది. అయితే అందరి శరీరం ఒకేలా స్పందించదు. మొదటిసారే ఎక్కువగా తింటే కొందరికి గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలగవచ్చు. కాబట్టి ఫస్ట్ కొద్దిగా తీసుకుని, శరీరం ఎలా స్పందిస్తుందో గమనించడం మంచిది.

45
కడుపు నిండిన భావన
Image Credit : our own

కడుపు నిండిన భావన

మొలకెత్తిన పెసల్లోని ప్రోటీన్, ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దీంతో తరచుగా ఏదో ఒకటి తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి మొలకెత్తిన పెసలను ఆరోగ్యకరమైన స్నాక్‌గా చెప్పవచ్చు. అలాగే మొలకెత్తిన పెసల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది.

మొలకెత్తిన పెసల్లో ఉండే ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలు శరీరంలోని వివిధ సాధారణ జీవక్రియలకు అవసరం. ముఖ్యంగా ఐరన్ ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి మొలకెత్తిన పెసలు మంచి ఆహారం అని చెప్పొచ్చు. అలాగే పెసళ్లలోని ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

55
సరైన పద్ధతిలో తయారు చేయడం
Image Credit : stockPhoto

సరైన పద్ధతిలో తయారు చేయడం

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పెసళ్లను మొలకెత్తించే టైంలో తేమతో కూడిన వాతావరణం ఉండటం వల్ల కొన్ని బ్యాక్టీరియాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి శుభ్రమైన నీరు, శుభ్రమైన పాత్రలు ఉపయోగించడం, సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం ముఖ్యం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tulsi Plant: చిన్న తులసి మొక్క గుబురుగా పెరగాలా? ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి
Recommended image2
Haram Designs: 4 తులాల్లో వచ్చే గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి
Recommended image3
Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
Heart Attack Symptoms: గుండెపోటు వచ్చే ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే!
Recommended image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. అమ్మాయిలు ఇష్టపడేది ఇలాంటి అబ్బాయిలనే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved