MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Heart Attack Symptoms: గుండెపోటు వచ్చే ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే!

Heart Attack Symptoms: గుండెపోటు వచ్చే ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే!

Heart Attack Symptoms: గుండెపోటు.. ఎప్పుడు, ఎవరికీ, ఎలా వస్తుందో ముందుగా చెప్పడం కష్టం. అయితే గుండెపోటు రావడానికి ముందు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఈ చిన్న సంకేతాలే అత్యవసర వైద్యం అవసరం అని సూచించవచ్చు. మరి గుండెపోటు లక్షణాలేంటో తెలుసుకుందామా..

2 Min read
Author : Kavitha G
Published : Sep 21 2026, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గుండెపోటు వచ్చేముందు కనిపించే లక్షణాలు
Image Credit : Getty

గుండెపోటు వచ్చేముందు కనిపించే లక్షణాలు

గుండెపోటు అనేది అకస్మాత్తుగా సంభవించే ప్రాణాంతక పరిస్థితి. గుండెకు రక్తాన్ని, ఆక్సిజన్‌ను అందించే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడినప్పుడు గుండె కండరాలకు నష్టం కలగడం మొదలవుతుంది. అయితే గుండెపోటు ఒక్కసారిగా తీవ్రమైన నొప్పితోనే మొదలవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ప్రతి సందర్భంలోనూ అలా ఉండదు. కొందరిలో లక్షణాలు ఒక్కసారిగా తీవ్రంగా కనిపిస్తే, మరికొందరిలో ముందు స్వల్పంగా ప్రారంభమై క్రమంగా పెరగవచ్చు. మరి గుండెపోటు ముందు కనిపించే లక్షణాలేంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఛాతీ నొప్పి
Image Credit : Getty

ఛాతీ నొప్పి

గుండెపోటు లక్షణాల్లో ఛాతీ నొప్పి అత్యంత సాధారణమైంది. గుండెపోటు బాధితులపై జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం 68 శాతం మందికి గుండెపోటు రావడానికి ముందే ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఛాతీలో బరువుగా అనిపించడం కూడా గుండెపోటుకు సంకేతమే. శారీరక శ్రమ చేసినప్పుడు ఎక్కువగా ఇలా జరుగుతుంది.

36
గుండె వేగంగా కొట్టుకోవడం
Image Credit : Getty

గుండె వేగంగా కొట్టుకోవడం

ఒక అధ్యయనం ప్రకారం గుండెపోటు ప్రారంభ లక్షణాలు కనిపించిన వారిలో 42 శాతం మందికి గుండె దడ వచ్చినట్లు తెలుస్తోంది. గుండె చాలా వేగంగా లేదా బలంగా కొట్టుకున్నప్పుడు ఇలా అనిపిస్తుంది. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం కూడా గుండె జబ్బులకు సంకేతం కావచ్చు. నడుస్తున్నప్పుడు, శారీరక శ్రమ చేస్తున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించవచ్చు. ఊపిరితిత్తులకు తగినంత గాలి అందడం లేదనే భావన కలుగుతుంది.

46
తల తిరగడం
Image Credit : Getty

తల తిరగడం

కొన్నిసార్లు తలతిరగడం లేదా తల తేలికైనట్లు అనిపించవచ్చు. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయకపోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. దానివల్లే తలతిరిగినట్లు అనిపిస్తుంది. ఛాతీలో మంట రావడం కూడా గుండెపోటుకు మరో లక్షణం కావచ్చు. ఇది సేమ్ గ్యాస్ వల్ల వచ్చే మంట లాగే అనిపిస్తుంది. కానీ తరచుగా ఛాతీ నొప్పి లేదా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

56
కడుపులో అసౌకర్యం
Image Credit : Getty

కడుపులో అసౌకర్యం

కడుపు నొప్పి, అసౌకర్యం, వికారం, వాంతులు కూడా గుండె జబ్బులు లేదా గుండెపోటుకు లక్షణాలు కావచ్చు. ముఖ్యంగా వికారం రావడానికి వేరే స్పష్టమైన కారణం ఏదీ లేనప్పుడు ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఆందోళన(యాంగ్జైటీ) కూడా గుండె జబ్బులు ఉన్నవారిలో తరచుగా కనిపిస్తుంది. ఇది వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది.

66
సరిగ్గా నిద్ర పట్టకపోవడం
Image Credit : Gemini AI

సరిగ్గా నిద్ర పట్టకపోవడం

రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడానికి మానసిక ఒత్తిడి లేదా పడుకునే ముందు కెఫిన్ ఉన్న డ్రింక్స్ తాగడం లాంటివి కారణం కావచ్చు. కానీ, ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా నిద్రలేమి సమస్యలు వస్తుంటే అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. అలాగే విపరీతమైన అలసట అనిపించడం మరో ముఖ్యమైన లక్షణం. ఈ తీవ్రమైన అలసట ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యకు సూచిక కావచ్చు. మీకు ఎప్పుడూ అలసటగా అనిపిస్తూ, దానికి కారణం తెలియకపోతే వెంటనే ఒక డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు
Recommended image2
Banana: రాత్రిపూట అరటి పండు తింటే ఏమౌతుంది? నిజంగా బరువు పెరుగుతారా?
Recommended image3
Kitchen Hacks: ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి నిల్వ చేయకూడదా? చేస్తే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Parenting: కూతురు ప్రతి విషయం షేర్ చేసుకోవాలంటే పేరెంట్స్ చేయాల్సిన 5 పనులు ఇవే!
Recommended image2
Movie Costumes: సినిమాల్లో వాడే ఖరీదైన కాస్ట్యూమ్స్‌ను షూటింగ్ తర్వాత ఏం చేస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved