MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Pedicure Designs: టాప్ 10 ట్రెండింగ్ పెడిక్యూర్ లుక్స్‌.. ఎంత బాగున్నాయో!

Pedicure Designs: టాప్ 10 ట్రెండింగ్ పెడిక్యూర్ లుక్స్‌.. ఎంత బాగున్నాయో!

Pedicure Designs:పెడిక్యూర్ అంటే ఇప్పుడు కేవలం గోళ్లను శుభ్రం చేసుకుని, నెయిల్ పాలిష్ వేసుకోవడం మాత్రమే కాదు. రకరకాల రంగులు, డిజైన్లు, మెరిసే ఫినిషింగ్‌లతో ఇదొక కొత్త ట్రెండ్‌గా మారింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 పెడిక్యూర్ లుక్స్ మీకోసం…

3 Min read
Author : Kavitha G
Published : Sep 09 2026, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
ట్రెండింగ్ పెడిక్యూర్ డిజైన్స్
Image Credit : pinterest

ట్రెండింగ్ పెడిక్యూర్ డిజైన్స్

ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు పాదాల అందంపై శ్రద్ధ పెడుతున్నారు. ముఖ్యంగా పండగలు, పెళ్లిళ్లు లేదా పార్టీలకు వెళ్లేటప్పుడు, అందమైన చెప్పులతో పాటు కాలిగోళ్లు కూడా అందంగా కనిపించాలని పెడిక్యూర్ చేయించుకోవడం కామన్ అయిపోయింది. అయితే, పెడిక్యూర్ ఇప్పుడు కేవలం గోళ్లను శుభ్రం చేసి పాలిష్ వేయడానికే పరిమితం కాలేదు. సింపుల్ అండ్ ఎలగెంట్ లుక్ నుంచి, కళ్లు చెదిరే గ్లిట్టర్ ఫినిష్ వరకు ఎన్నో రకాల పెడిక్యూర్ స్టైల్స్ అమ్మాయిలను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న టాప్ 10 పెడిక్యూర్ డిజైన్లను ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
బర్గండీ కలర్
Image Credit : pinterest

బర్గండీ కలర్

ముదురు ఎరుపు లేదా బర్గండీ కలర్ నెయిల్ పాలిష్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. మెరుపు లేని ఈ మ్యాట్ ఫినిష్, కాలిగోళ్లకు చాలా అందమైన, క్లాసీ లుక్‌ను ఇస్తుంది. పార్టీ వేర్‌కే కాదు, రోజూ వేసుకునే క్యాజువల్ డ్రెస్సులతో కూడా ఈ రంగు చాలా బాగుంటుంది.

Related Articles

Related image1
Gold Necklace: 6 గ్రాముల్లోపు వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి!
Related image2
Bangle Designs: నేటితరం అమ్మాయిల కోసం మోడ్రన్ లుక్ ఇచ్చే గాజులు!
311
చాక్లెట్ బ్రౌన్ కలర్
Image Credit : pinterest

చాక్లెట్ బ్రౌన్ కలర్

చాక్లెట్ లాంటి ముదురు బ్రౌన్ రంగు నెయిల్ పాలిష్ మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చింది. ముఖ్యంగా, హై-క్లాస్ జెల్ ఫినిష్ ఇస్తే గోళ్లు మరింత మెరుస్తూ, అందంగా, రిచ్‌గా కనిపిస్తాయి. సింపుల్‌గా ఉంటూనే స్టైలిష్ గా కనిపించాలి అనుకునే అమ్మాయిలకు ఇది బెస్ట్ ఛాయిస్.

411
డార్క్ పర్పుల్
Image Credit : pinterest

డార్క్ పర్పుల్

పర్పుల్ రంగు ఇష్టపడేవాళ్లు రెగ్యులర్ లైట్ పర్పుల్ బదులు, ఎరుపు కలిసిన ఈ ముదురు ఊదా రంగును ఎంచుకోవచ్చు. ఈ రంగు గోళ్లకు చాలా అందమైన లుక్ ఇస్తుంది. రెగ్యులర్ నెయిల్ పాలిష్ రంగుల కంటే కాస్త భిన్నంగా ఉండి, స్టైలిష్‌గా కనిపిస్తుంది. పార్టీలు, పెళ్లిళ్ల లాంటి ఫంక్షన్లకు ఈ రంగు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. గ్లాసీ ఫినిష్ ఇస్తే గోళ్లు మరింత మెరుస్తూ, స్టైలిష్‌గా కనిపిస్తాయి.

511
బర్ట్న్ ఆరెంజ్
Image Credit : pinterest

బర్ట్న్ ఆరెంజ్

ఎరుపు, ఆరెంజ్, బ్రౌన్ రంగుల మధ్య ఉండే ఈ బర్న్ట్ ఆరెంజ్ షేడ్, అన్ని స్కిన్ టోన్‌ల వారికి నప్పుతుంది. ముఖ్యంగా హై-క్లాస్ జెల్ ఫినిష్ ఇస్తే, కాలిగోళ్లు మెరుస్తూ, రిచ్ లుక్‌ను ఇస్తాయి. రెగ్యులర్‌గా వాడే ఎరుపు, పింక్ రంగుల నుంచి కాస్త భిన్నంగా, కొత్త రంగు ట్రై చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

611
కాపర్ క్రోమ్
Image Credit : pinterest

కాపర్ క్రోమ్

రోజ్ గోల్డ్, బ్రాంజ్ రంగుల మధ్య ఉండే ఈ కాపర్ క్రోమ్ షేడ్, మెటాలిక్‌లా మెరుస్తూ చాలా అందంగా ఉంటుంది. ఇతర రంగుల్లా మరీ ప్రకాశవంతంగా కాకుండా, కాంతి పడినప్పుడు గోళ్లపై అందంగా మెరుస్తుంది. ఎలాంటి డిజైన్ లేకపోయినా, ఈ కాపర్ రంగు గోళ్లకు నగలు వేసుకున్న లుక్‌ను ఇస్తుంది.

711
స్మోకీ ఆలివ్ కలర్
Image Credit : pinterest

స్మోకీ ఆలివ్ కలర్

స్మోకీ ఆలివ్ అంటే గ్రే, ఆలివ్ గ్రీన్ రంగులు కలిసిన ఒక నేచురల్ కలర్. రెగ్యులర్ గ్రీన్ కలర్‌లా కాకుండా, కాస్త డార్క్‌గా, మబ్బుగా ఉంటుంది. గ్రే కలర్ కలిసిన ఈ న్యూట్రల్ నెయిల్ పాలిష్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. చాలా రకాల డ్రెస్సులతో ఈజీగా మ్యాచ్ అవుతుంది కాబట్టి, రోజూ వేసుకోవడానికి ఇది మంచి ఛాయిస్.

811
క్యాట్ ఐ నెయిల్ పాలిష్
Image Credit : pinterest

క్యాట్ ఐ నెయిల్ పాలిష్

వెల్వేట్ క్లాత్ లా సాఫ్ట్ మెరుపుతో ఉండే క్యాట్-ఐ నెయిల్ పాలిష్ మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చింది. ఈ నెయిల్ పాలిష్‌లోని మాగ్నెటిక్ పార్టికల్స్ వల్ల, గోళ్లపై లైట్ పడినప్పుడు గీతలు కదులుతున్నట్లు అందంగా, మెరుస్తూ కనిపిస్తాయి. ముఖ్యంగా డార్క్ రెడ్, పర్పుల్, బ్రౌన్, గ్రీన్ లాంటి డార్క్ కలర్స్‌ను బేస్ కోట్‌గా వేసి క్యాట్-ఐ ఫినిష్ ఇస్తే చాలా బాగుంటుంది.

911
ఎస్ప్రెస్సో గ్లేజ్
Image Credit : pinterest

ఎస్ప్రెస్సో గ్లేజ్

ఎస్ప్రెస్సో గ్లేజ్ అనేది ముదురు బ్రౌన్ రంగులో ఉండే పెడిక్యూర్ స్టైల్. ఇది నలుపు, చాక్లెట్ బ్రౌన్ రంగుల మధ్య ఉండే షేడ్ కాబట్టి, గోళ్లకు చాలా అందమైన, నీట్ లుక్‌ను ఇస్తుంది. దీనికి హై-షైన్ జెల్ ఫినిష్ ఇస్తే గోళ్లు మెరుస్తూ, రిచ్‌గా కనిపిస్తాయి. ఎక్కువ డిజైన్ లేకుండా క్లాసీ లుక్ కావాలంటే, ఎస్ప్రెస్సో గ్లేజ్ మంచి ఎంపిక.

1011
ఫాల్ ఫ్రెంచ్
Image Credit : pinterest

ఫాల్ ఫ్రెంచ్

సాధారణంగా ఫ్రెంచ్ పెడిక్యూర్‌లో గోరు చివర్లో తెలుపు రంగు వేస్తారు. కానీ, ఈ కొత్త ట్రెండ్‌లో దానికి బదులుగా ఆకుపచ్చ, ఊదా లాంటి రంగులను గోరు చివర్లో సన్నని గీతలా వేస్తున్నారు. గోరు బేస్‌లో మిల్కీ వైట్ వంటి కలర్స్ ఉండటం వల్ల, గోళ్లు శుభ్రంగా, అందంగా కనిపిస్తాయి. చివర్లో ఉండే డార్క్ కలర్ అదనపు స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది.

1111
సిల్వర్ కలర్
Image Credit : pinterest

సిల్వర్ కలర్

కాపర్, బ్రాంజ్ లాంటి మెటాలిక్ రంగులతో పాటు, సిల్వర్ కలర్ కూడా ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. అద్దంలా మెరిసే ఈ సిల్వర్ ఫినిష్, కాలిగోళ్లకు కూల్ అండ్ స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. ఎక్కువ డిజైన్ లేకుండానే గోళ్లు రిచ్‌గా కనిపించాలనుకునే వాళ్లు ఈ రంగును ట్రై చేయొచ్చు. ముఖ్యంగా ఫంక్షన్లు, పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు ఈ పెడిక్యూర్ కాలిగోళ్లకు చాలా అందమైన లుక్‌ను ఇస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
ఫ్యాషన్
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Locket: 2 గ్రాముల్లోనే చైన్ కి అదిరిపోయే గోల్డ్ లాకెట్స్
Recommended image2
Instant Idli: పప్పు నానబెట్టక్కర్లేదు.. పిండి రుబ్బక్కర్లేదు.. నిమిషాల్లో ఇడ్లీ రెడీ!
Recommended image3
AC Rain Cover: మీ AC పాడవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న వస్తువును ట్రై చేయండి.. ధర కూడా తక్కువే!
Related Stories
Recommended image1
Gold Necklace: 6 గ్రాముల్లోపు వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి!
Recommended image2
Bangle Designs: నేటితరం అమ్మాయిల కోసం మోడ్రన్ లుక్ ఇచ్చే గాజులు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved