MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • US Apartment Rules: అమెరికాలో రోడ్డుపై ఈ పని చేస్తే చిక్కుల్లో పడ్డట్లే

US Apartment Rules: అమెరికాలో రోడ్డుపై ఈ పని చేస్తే చిక్కుల్లో పడ్డట్లే

US Apartment Rules: ఇండియాలో ఇళ్లు కడిగి నీళ్లు రోడ్డు మీద పారేస్తాం. కానీ అమెరికాలో అలా వేస్తే కుదరదు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే రూల్స్ బ్రేక్ చేసినట్టే. ఫైన్లు కూడా వేస్తారంట. ఆ రూల్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 22 2026, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అమెరికాలో నీళ్లు రోడ్డుపై వేస్తే ఏమవుతుందో తెలుసా?
Image Credit : AI

అమెరికాలో నీళ్లు రోడ్డుపై వేస్తే ఏమవుతుందో తెలుసా?

ఇండియాలో ఇళ్లు కడిగి నీళ్లు రోడ్డు మీద పారేస్తాం. కానీ అమెరికాలో అలా వేస్తే కుదరదు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే రూల్స్ బ్రేక్ చేసినట్టే. ఫైన్లు కూడా వేస్తారంట. ఆ రూల్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.మన దగ్గర బాత్రూమ్ కడగాలన్నా, బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోయాలన్నా బకెట్లతో నీళ్లు గుమ్మరించేస్తాం. కిందకి నీళ్లు వెళ్తున్నాయా లేదా అని పెద్దగా పట్టించుకోం. కానీ, అమెరికాలో ఇలా చేస్తే మాత్రం భారీగా ఫైన్ కట్టాల్సిందే. అక్కడి అపార్ట్‌మెంట్లు, కాండోల్లో (Condos) ఉండే హౌసింగ్ అసోసియేషన్లు నీటి వాడకం, ఇరుగుపొరుగు వారి ఇబ్బందుల విషయంలో చాలా కఠినమైన రూల్స్ ఫాలో అవుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బాల్కనీలో నీళ్లు పడితే చిక్కే
Image Credit : Gemini AI

బాల్కనీలో నీళ్లు పడితే చిక్కే

అమెరికాలో బహుళ అంతస్తుల భవనాల్లో బాల్కనీల్లో మొక్కలు పెంచుకోవడం కామనే. అయితే, ఆ మొక్కలకు నీళ్లు పోసినప్పుడు లేదా బాల్కనీ కడిగినప్పుడు ఒక్క చుక్క నీరు కూడా కింద పడకూడదు. మీరు పోసిన నీళ్లు కింద ఉన్న వాళ్ల బాల్కనీలో పడినా, వాళ్ల మీద పడినా వెంటనే మేనేజ్‌మెంట్‌కు కంప్లైంట్ చేస్తారు. దీంతో మీకు భారీ జరిమానా పడటం ఖాయం.

34
బట్టలు ఆరేయడం కూడా కష్టమే
Image Credit : x

బట్టలు ఆరేయడం కూడా కష్టమే

మన ఇళ్లలో లాగా అమెరికాలో నేలపై బకెట్లతో నీళ్లు పోసి కడగలేం. ఎందుకంటే, అక్కడి ఇళ్లలో ఎక్కువగా చెక్క ఫ్లోరింగ్ (Wooden Flooring) ఉంటుంది. నీళ్లు నిలిచినా, కిందకు లీక్ అయినా ఫ్లోరింగ్ పాడైపోతుంది. అంతేకాదు, కింద ఉన్న వాళ్ల ఇంటికి కూడా డ్యామేజ్ జరుగుతుంది. అందుకే అక్కడ తడి లేదా పొడి గుడ్డతో మాత్రమే ఇల్లు తుడుస్తారు. ఈ రూల్ బ్రేక్ చేస్తే ఇల్లు ఖాళీ చేయాల్సిందే. అలాగే, పక్కింటి వాళ్లకు ఇబ్బంది కలిగేలా బట్టలు కూడా బయట ఆరేయకూడదు.

44
ప్రైవసీకి పెద్ద పీట
Image Credit : Chatgpt

ప్రైవసీకి పెద్ద పీట

అమెరికన్ లైఫ్‌స్టైల్‌లో ఇతరుల ప్రైవసీకి, ప్రశాంతతకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పైన ఉన్నవాళ్లు గట్టిగా నడిచినా, నేలపై నీళ్లు పోసి కడిగినా కింద ఉన్నవాళ్ల ప్రశాంతత దెబ్బతింటుంది. దీన్ని కంట్రోల్ చేయడానికే అక్కడి అసోసియేషన్లు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే.. మన స్వేచ్ఛ ఇతరుల ప్రశాంతతను చెడగొట్టకూడదనేదే ఈ రూల్స్ వెనక ఉన్న అసలు ఉద్దేశం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Honey: తేనే తయారుచేసే వింతైన చీమలు ఇవిగో.. వీటి తేనే ఖరీదు తెలిస్తే షాకవుతారు
Recommended image2
Public Transport: మెట్రో, బస్సు ఎక్కేముందు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
Recommended image3
Peaceful Beaches: సూర్యలంక మాత్రమే కాదు.. ఏపీలో ఎవరికీ తెలియని ఈ ప్రశాంతమైన బీచ్‌లను చూశారా?
Related Stories
Recommended image1
Stubborn Pimples: 7 డేస్ ఛాలెంజ్..జీవితంలో మొటిమలు, యాక్నే రాదు.
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved