MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Idli History : ఇడ్లీ ఇండియన్ టిఫిన్ కాదా..! ఏ దేశం నుండి వచ్చిందో తెలుసా?

Idli History : ఇడ్లీ ఇండియన్ టిఫిన్ కాదా..! ఏ దేశం నుండి వచ్చిందో తెలుసా?

సౌత్ ఇండియాలో ఫేమస్ బ్రేక్‌ఫాస్ట్ ఏదంటే టక్కున ఇడ్లీ పేరు వినిపిస్తుంది. వేడివేడి ఇడ్లీని కొబ్బరి లేదా పల్లీ చట్నీ, సాంబార్ తో తింటే... ఆహా.. ఆ రుచికి ప్రతిఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. అయితే ఈ ఇడ్లీ ఇండియాది కాదట… మరి ఎక్కడిదో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 22 2026, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇడ్లీ... ఇండోనేషియా నుంచి ఇండియాకు వచ్చిందా?
Image Credit : AI generate image

ఇడ్లీ... ఇండోనేషియా నుంచి ఇండియాకు వచ్చిందా?

ఇడ్లి… భారతీయులకు ఇష్టమైన అల్పాహారం. మరీముఖ్యంగా దక్షిణాది ప్రజలకు ఉదయం లేవగానే ఇడ్లీ కడుపులో పడకుంటే రోజు స్టార్ట్ అవదంటే అతిశయోక్తి కాదేమో… అంతలా ఇష్టపడుతుంటారు. టిపిన్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్ లోనే కాదు ఇళ్లలోనూ దీన్ని ఎక్కువగా వుండుకుంటారు… అంటే ఇడ్లీ ఫ్యామిలీ ఫుడ్ అన్నమాట. ఈజీ ప్రాసెస్, త్వరగా వండుకోవచ్చు… అందుకే ఎక్కువగా చేస్తుంటారు. తెలుగు ప్రజలు కూడా ఇడ్లీని చాలా ఇష్టపడతారు… ప్లేట్లకు ప్లేట్లు లొట్టలేసుకుంటూ తింటారు.

ఇండియన్స్ కి ఎంతో ఇష్టమైన ఈ ఇడ్లీని మనందరం లోకల్ ఫుడ్ గా భావిస్తాం… కానీ అసలు నిజం ఇది కాదట. ఇడ్లీ విదేశాాల నుండి ఇండియాకు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఫుడ్ పరిశోధకులు కే.టీ. ఆచార్య ప్రకారం… ఇడ్లీకి అసలు మూలం ఇండోనేషియాలో ఉండి ఉండొచ్చు. అక్కడ 'కెడ్లీ' (Kedli) అనే పేరుతో ఆవిరి మీద ఉడికించే బియ్యం వంటకం ఒకటి ఉంటుంది. ఆగ్నేయ ఆసియా నుంచి ఇండియాకు వచ్చిన వ్యాపారుల ద్వారా ఈ వంట పద్ధతి మన దేశానికి వచ్చిందని చారిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత మనవాళ్లు దీనికి కొన్ని మార్పులు చేశారు… అదే ఇప్పుడున్న ఇడ్లీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కెడ్లీ కాస్త ఇడ్లీగా ఎలా మారింది?
Image Credit : AI generate image

కెడ్లీ కాస్త ఇడ్లీగా ఎలా మారింది?

ఇండోనేషియా నుంచి వచ్చిన కెడ్లీ వంటకం ఇండియాలో అలాగే ఉండిపోలేదు. మనవాళ్లు స్థానిక దినుసులు, పులియబెట్టే విధానాలతో కెడ్లీకి కొత్త రూపం, మరింత టేస్ట్ యాడ్ చేసి ఇడ్లీగా మార్చారు. ఇప్పుడు మనం వాడుతున్న బియ్యం, మినప పప్పు కాంబినేషన్ కాలక్రమేణా డెవలప్ అయిందే.

ప్రాచీన గ్రంథాల్లోనూ ఇడ్లీ ప్రస్తావన

కన్నడ ప్రాచీన గ్రంథం 'వడ్డారాధనె' లో కూడా 'ఇద్దలిగె' అనే పేరుతో ఇడ్లీ ప్రస్తావన ఉంది. సంస్కృత గ్రంథమైన 'శివతత్త్వ చింతామణి' లో కూడా ఇద్దలిక (ఇడ్లీ) ప్రస్తావన ఉంది. ఇంకా అనేక భారతీయ గ్రంథాల్లో కూడా ఆవిరి మీద ఉడికించే ఇలాంటి వంటకాల ప్రస్తావన ఉంది. అయితే అప్పటి 'ఇద్దలిగె' అచ్చం ఇప్పటి ఇడ్లీలాగే ఉండేదని కచ్చితంగా చెప్పలేం. కాలక్రమేణా మారుతూ ఇడ్లీ ఇప్పటి రూపాన్ని సంతరించుకుని ఉంటుంది.

35
అరబ్ వ్యాపారుల ప్రభావం కూడా ఉందా?
Image Credit : magnific

అరబ్ వ్యాపారుల ప్రభావం కూడా ఉందా?

ఇడ్లీ చరిత్రలో అరబ్ వ్యాపారుల పాత్ర కూడా ఉందని మరో వాదన ఉంది. ఇండియాకు వచ్చిన అరబ్ వ్యాపారుల ఆహారపు అలవాట్లు ముఖ్యంగా పులియబెట్టే టెక్నిక్స్ మన వంటల మీద ప్రభావం చూపించాయి. ఇండియా, ఆగ్నేయ ఆసియా మధ్య ఉన్న పాత వ్యాపార సంబంధాల వల్లే ఈ వంట పద్ధతులు ఒకరి నుంచి ఒకరికి పాకాయి.

సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ

కాలక్రమేణా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లాంటి దక్షిణ భారత ప్రాంతాల్లో ఇడ్లీకి స్థానిక రుచులను అద్దారు. అలా ఇడ్లీకి సాంబార్, కొబ్బరి లేదా పల్లీ చట్నీ, టమాటా చట్నీ, రకరకాల పొడులు జతచేసే అలవాటు మొదలైంది. ఒక పాత వంటకం మన స్థానిక సంస్కృతితో కలిసిపోయి నేటి సౌత్ ఇండియన్ ఇడ్లీగా మారిపోయింది.

45
ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా ఫుల్ పాపులర్
Image Credit : Getty

ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా ఫుల్ పాపులర్

ఇడ్లీకి ఇంత క్రేజ్ రావడానికి కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్యమూ ఓ కారణమే. బియ్యం, మినప్పప్పుతో చేసే ఈ ఇడ్లీని ఆవిరి మీద ఉడికిస్తారు. పిండిని పులియబెట్టడం వల్ల ఇడ్లీకి మెత్తటి, స్పాంజ్ లాంటి ఆకృతి వస్తుంది. ఇలా పులియబెట్టడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సులభంగా అందుతాయి. సాంబార్, కూరగాయల చట్నీలతో తింటే ఇది మరింత బలాన్ని ఇస్తుంది. అందుకే చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు, ఆరోగ్యవంతుల నుండి అనారోగ్యంతో బాధపడేవారి వరకు ప్రతిఒక్కరు ఇడ్లీని తింటారు.

55
అంతరిక్షంలోకి వెళ్లిన 'స్పేస్ ఇడ్లీ'!
Image Credit : Getty

అంతరిక్షంలోకి వెళ్లిన 'స్పేస్ ఇడ్లీ'!

ఇడ్లీ ప్రయాణం భూమి మీదే ఆగిపోలేదు అంతరిక్షానికి చేరింది. డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (DFRL) అంతరిక్ష ప్రయాణాల కోసం ప్రత్యేకంగా 'స్పేస్ ఇడ్లీ'ని తయారు చేసింది. దీన్ని బట్టి చూస్తే ఇడ్లీ కేవలం మన ఇంట్లో తినే బ్రేక్‌ఫాస్ట్‌గానే కాకుండా, భారతీయ ఆహార సంస్కృతికి ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా ఎదిగిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎక్కడి నుండి వచ్చినా ఇడ్లీ మనదే అనే భావన ప్రజల్లో ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆహారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River : 'విజయవాడ దు:ఖధాయిని' వాగు ఏది? ఇది నదిలోనో, సముద్రంలోనో కలవకుండానే మాయం అవుతుంది, ఎలాగో తెలుసా?
Recommended image2
DMart: అన్నీ వస్తువులు దొరికే డీమార్ట్‌లో చీరలు మాత్రం ఎందుకు అమ్మరు? అసలు నిజం ఇదే
Recommended image3
Online Jobs: ఆన్‌లైన్ ఉద్యోగాలు నిజమో కాదో ఎలా గుర్తించాలి? ఇవి తెలిస్తే అస్సలు మోసపోరు!
Related Stories
Recommended image1
Soft Idli: మెత్తటి, దూదిలాంటి ఇడ్లీల కోసం సింపుల్ టిప్స్ ఇవిగో!
Recommended image2
Ragi Idli: మెత్తటి రాగి ఇడ్లీలు కావాలంటే ఇలా చేయండి, వెరీ సింపుల్ చిట్కా ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved