MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Walking: నడిచే వేగం తగ్గితే డేంజర్ బెల్స్ మోగినట్లేనా? వాకింగ్ వెనుక ఉన్న షాకింగ్ హెల్త్ సైన్స్

Walking: నడిచే వేగం తగ్గితే డేంజర్ బెల్స్ మోగినట్లేనా? వాకింగ్ వెనుక ఉన్న షాకింగ్ హెల్త్ సైన్స్

Walking Health Science: నడిచే వేగం మీ ఆరోగ్యాన్ని చెబుతుంది. వాకింగ్ స్పీడ్ తగ్గితే ఎదురయ్యే ముప్పులు, రోజూ వాకింగ్ చేయడం వల్ల కలిగే 6 అద్భుత ప్రయోజనాలను వైద్య నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 18 2026, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నడక సీక్రెట్స్ : మీరు నడిచే వేగం బట్టి మీ ఆయుష్షు చెప్పొచ్చు
Image Credit : Gemini

నడక సీక్రెట్స్ : మీరు నడిచే వేగం బట్టి మీ ఆయుష్షు చెప్పొచ్చు

మనం నడిచే శైలి కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు. అది మన శరీర ఆరోగ్యానికి అద్దం పడుతుంది. చాలామంది దీన్ని సాధారణ విషయంగా తీసుకుంటారు, కానీ వైద్యులు దీనిని ఒక ప్రధాన ‘హెల్త్ సిగ్నల్’గా పరిగణిస్తారు. మనం ఎంత వేగంగా నడుస్తున్నామనే అంశం మన గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కండరాలు, మన వయస్సు పెరిగే వేగాన్ని స్పష్టంగా సూచిస్తుంది.

2020 జనవరిలో ‘సైన్స్ డైరెక్ట్’ ప్రచురించిన అధ్యయనం ప్రకారం, నెమ్మదిగా నడవడం అనేది డిమెన్షియా, మానసిక సామర్థ్యం తగ్గడానికి ముందస్తు సంకేతమని తేలింది. అలాగే, ఇటీవల జరిగిన యాపిల్ హియరింగ్ స్టడీ లో వినికిడి లోపం ఉన్నవారి నడక వేగం తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యత్యాసం ఎక్కువగా కనిపించింది. నోయిడాలోని మెట్రో హాస్పిటల్స్ అండ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ అక్షయ్ చుగ్ అందించిన సమగ్ర వివరాలు ఇక్కడ చూద్దాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వాకింగ్ స్పీడ్‌ను 6th వైటల్ సైన్ అని ఎందుకు అంటారు?
Image Credit : AI Generated

వాకింగ్ స్పీడ్‌ను 6th వైటల్ సైన్ అని ఎందుకు అంటారు?

వైద్యరంగంలో శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు వంటివాటిని కీలక సంకేతాలుగా చూస్తారు. అలాగే వాకింగ్ స్పీడ్‌ను 6వ వైటల్ సైన్ గా పరిగణిస్తున్నారు. ఎలాంటి ఖరీదైన వైద్య పరీక్షలు లేకుండానే ఒక వ్యక్తి మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

• సమన్వయం: నడిచేటప్పుడు గుండె, ఊపిరితిత్తులు, కండరాలు, మెదడు ఒకేసారి కలిసి పనిచేస్తాయి. వేగంగా, సమతుల్యంగా నడవడం మంచి కార్డియోవాస్క్యులర్ ఫిట్‌నెస్‌కు నిదర్శనం.

• రోజువారీ పనులు: ఎవరి సహాయం లేకుండా నడవగలగడం, మెట్లు ఎక్కడం, బట్టలు వేసుకోవడం వంటి పనులు ఎంత సులభంగా చేస్తున్నారో నడక వేగం చెబుతుంది.

• ముందస్తు హెచ్చరిక: శరీరంలో అంతర్గతంగా ఏవైనా సమస్యలు మొదలైతే, ముందుగా నడక వేగం తగ్గడం, బ్యాలెన్స్ తప్పడం, త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

35
ఏ వయస్సు వారు ఎంత వేగంతో నడవాలి?
Image Credit : Getty

ఏ వయస్సు వారు ఎంత వేగంతో నడవాలి?

2020లో 'రీసెర్చ్ గేట్' ప్రచురించిన అధ్యయనం ప్రకారం, నడిచే వేగం అనేది వయస్సు, లింగాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా పురుషులు మహిళల కంటే కాస్త వేగంగా నడుస్తారు. సగటు వేగం వివరాలు గమనిస్తే..

• 30 ఏళ్ల కంటే తక్కువ: గంటకు సగటున 3 మైళ్ళు (దాదాపు 4.8 కి.మీ).

• 30 - 49 ఏళ్లు: గంటకు సగటున 2.8 మైళ్ళు.

• 50 - 59 ఏళ్లు: గంటకు సగటున 2.75 మైళ్ళు.

• 60 ఏళ్లకు పైబడి: గంటకు సగటున 2.7 మైళ్ళు.

• 65 ఏళ్ల తర్వాత: గంటకు సగటున 2.1 మైళ్ళు.

నడక వేగాన్ని బట్టి ఫిట్‌నెస్ స్థాయిని గుర్తించవచ్చు. వేగవంతమైన నడక మంచి గుండె ఆరోగ్యాన్ని, మధ్యస్థ నడక సాధారణ ఆరోగ్యాన్ని సూచిస్తాయి. ఒకవేళ వయస్సు సగటు కంటే నెమ్మదిగా నడిస్తే అది కండరాల బలహీనత, నాడీ వ్యవస్థ లేదా ఊపిరితిత్తుల లోపాలను సూచిస్తుంది.

45
వినికిడి శక్తికి, నడక వేగానికి సంబంధం ఏమిటి?
Image Credit : Getty

వినికిడి శక్తికి, నడక వేగానికి సంబంధం ఏమిటి?

చెవులు కేవలం వినడానికే కాదు, బాడీ బ్యాలెన్స్ కాపాడటంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వినికిడి సామర్థ్యం తగ్గినప్పుడు బాడీ కోఆర్డినేషన్ దెబ్బతిని నడక నెమ్మదిస్తుంది. 57 వేల కంటే ఎక్కువ మంది ఐఫోన్ వినియోగదారుల డేటాను విశ్లేషించిన యాపిల్ హియరింగ్ స్టడీలో ఈ విషయం స్పష్టమైంది. వినికిడి లోపం ఉన్నప్పుడు శబ్దాలను అర్థం చేసుకోవడానికి మెదడు ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల నడిచేటప్పుడు ఏకాగ్రత, వేగం రెండూ ప్రభావితమవుతాయి.

అకస్మాత్తుగా నడక వేగం తగ్గడం లేదా నడిచేటప్పుడు ఛాతి నొప్పి, ఊపిరి ఆడకపోవడం, తలతిరగడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

55
రోజూ ఎంతసేపు నడవాలి? నడక వేగం ఎలా పెంచుకోవాలి?
Image Credit : Getty

రోజూ ఎంతసేపు నడవాలి? నడక వేగం ఎలా పెంచుకోవాలి?

వైద్య నిపుణుల ప్రకారం, రోజూ కనీసం 30 నిమిషాలు నడవాలి. ఒకేసారి వీలు కాకపోతే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 10 నిమిషాల చొప్పున 3 భాగాలుగా చేయవచ్చు.

• వాకింగ్ మోడ్: మిమోడరేట్ స్పీడ్ (గంటకు 4-5 కి.మీ) ఉండాలి. అంటే నడుస్తున్నప్పుడు ఎదుటివారితో మాట్లాడగలగాలి, కానీ పాటలు పాడేంత ఖాళీ ఉండకూడదు.

• వారానికి 5 రోజులు: గుండె, ఊపిరితిత్తులు బలంగా ఉండటానికి వారానికి 5 రోజులు బ్రిస్క్ వాక్ చేయాలి.

• వేగం పెంచే మార్గాలు: స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ద్వారా కాళ్ల కండరాలను బలపరచాలి. బ్యాలెన్స్ వ్యాయామాలు, సైక్లింగ్ వంటి కార్డియో వర్కౌట్స్, ఇంటర్వెల్ వాకింగ్ అంటే కొద్దిసేపు వేగంగా, కొద్దిసేపు నెమ్మదిగా వాకింగ్ చేయడం వల్ల నడక వేగం పెరుగుతుంది.

రోజూ క్రమం తప్పకుండా నడవడం వల్ల గుండె బలంగా మారుతుంది, బరువు అదుపులో ఉంటుంది, మానసిక ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. అయితే కేవలం నడక మాత్రమే కాకుండా వారానికి 2-3 రోజులు కండరాల బలానికి కావలసిన తేలికపాటి వ్యాయామాలు చేస్తే పూర్తి ఫిట్‌నెస్‌కు మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Village: ఈ గ్రామంలో ఇంకా రాజు పెత్తనమే కొనసాగుతోంది, భారత చట్టాలు ఇక్కడ పనిచేయవు
Recommended image2
పందులు బురదలో ఎందుకు దొర్లుతాయి? ఇష్టమా..అవసరమా?
Recommended image3
రోడ్లు స్ట్రెయిట్ గా వేస్తే దూరం తగ్గుతుందిగా.. మరి వంకరటింకరగా, మలుపులు తిప్పుతూ ఎందుకు వేస్తారు?
Related Stories
Recommended image1
UPI Payments: యూపీఐ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి 5 సింపుల్ ట్రిక్స్ ఇవే
Recommended image2
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved