MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • House Vs Land : ప్లాట్ కొనాలా? ఇల్లు కట్టాలా? ఎవరికి, ఏది బెస్ట్ ఆప్షనో తెలుసా?

House Vs Land : ప్లాట్ కొనాలా? ఇల్లు కట్టాలా? ఎవరికి, ఏది బెస్ట్ ఆప్షనో తెలుసా?

House vs Land : ఇల్లు కట్టాలా లేక స్థలం కొనాలా? ఏది మంచిది. ఈ నిర్ణయం తీసుకోవాలంటే చాలా ముందుచూపు ఉండాలి… భవిష్యత్తులో వచ్చే ఖర్చుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయం తీసుకోగలరు.

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 18 2026, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇల్లు కట్టాలా? స్థలం కొనాలా?
Image Credit : Gemini AI

ఇల్లు కట్టాలా? స్థలం కొనాలా?

సొంతిల్లు ఉండాలని ప్రతిఒక్కరు కలలు కంటారు. కానీ చేతిలో ఉన్న డబ్బుతో ముందుగా స్థలం కొనాలా? లేక ఇప్పటికే ఉన్న స్థలంలో ఇల్లు కట్టాలా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే ప్లాట్ కొన్నా, ఇల్లు కట్టుకున్నా భవిష్యత్ లో లాభదాయకంగా ఉండాలి… అంతేగానీ నష్టాలను మిగల్చకూడదు. అందుకే ఇల్లు లేదా స్థలం కొనే ముందు కేవలం అప్పటికయ్యే ఖర్చునే కాకుండా భవిష్యత్తులో వచ్చే ఖర్చులను కూడా అంచనా వేసుకోవాలి. కాబట్టి స్థలం కొనడం బెటరా? ఇల్లు కట్టుకోవడం బెటరా? ఎవరికి ఏది బెస్ట్ ఆప్షన్? ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్థలం కొనేటప్పుడు వచ్చే ఖర్చులు ఏంటి?
Image Credit : pinterest

స్థలం కొనేటప్పుడు వచ్చే ఖర్చులు ఏంటి?

కేవలం స్థలం రేటును మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకూడదు. స్థలం కొనేటప్పుడు సాధారణంగా మరికొన్ని ఖర్చులు కూడా ఉంటాయి. అవేంటంటే..

  • స్థలం ధర
  • స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఖర్చులు
  • పట్టా, సర్వే ఖర్చులు
  • బ్రోకర్ కమీషన్
  • బ్యాంకు లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ
  • స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసే ఖర్చు
  • కరెంట్, నీటి సదుపాయం
  • ఆస్తి లేదా భూమి పన్నులు.

వీటన్నింటినీ కచ్చితంగా లెక్కలోకి తీసుకోవాలి.

ప్లాట్ మెయింటెనెన్స్ ఖర్చులు

కేవలం స్థలం కొని వదిలేసినా ఖర్చులు ఉండవని అనుకోలేం. ఆ స్థలాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ఫెన్సింగ్ వేయడం, పిచ్చిమొక్కలు, చెత్తను క్లీన్ చేయించడం, క్రమం తప్పకుండా పన్నులు కట్టడం లాంటి ఖర్చులు ఉంటాయి. భవిష్యత్తులో ఆ స్థలంలో ఇల్లు కట్టాలనుకుంటే అప్పటికి నిర్మాణ సామగ్రి, లేబర్ ఖర్చులు భారీగా పెరగొచ్చనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.

35
ఇల్లు కట్టేటప్పుడు ఖర్చులు ఎక్కడెక్కడ వస్తాయి?
Image Credit : pinterest

ఇల్లు కట్టేటప్పుడు ఖర్చులు ఎక్కడెక్కడ వస్తాయి?

మనకు ఇప్పటికే స్థలం ఉన్నా, ఇల్లు కట్టడానికి అయ్యే నిర్మాణ ఖర్చే అతిపెద్దది. ఇందులో బేసిక్ మెటీరియల్స్ ధరలతో పాటు వివిధ పనులకు అయ్యే ఖర్చులు కూడా కలుస్తాయి.

నిర్మాణ సామగ్రి : ఇటుకలు, సిమెంట్, ఇసుక, కంకర, ఇనుము లాంటివి అవసరం. వీటి ధరలు ఇంటి సైజు, క్వాలిటీని బట్టి మారుతాయి.

లేబర్ ఖర్చు : మేస్త్రీ, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ లాంటి వాళ్లతో పాటు ఇంజనీర్ లేదా ఆర్కిటెక్ట్ ఫీజులు కూడా బడ్జెట్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కాకుండా ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్, తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్, పెయింటింగ్, కిచెన్, బాత్రూమ్ ఖర్చులు అదనం.

కాబట్టి కేవలం చదరపు అడుగుకి ఎంత అని మాత్రమే చూడకుండా, ప్రతి ఖర్చును విడివిడిగా లెక్కేసుకోవాలి. అనుకోని ఖర్చుల కోసం కొంత అమౌంట్ పక్కన పెట్టుకోవడం మంచిది.

ఇల్లు కట్టాక కూడా ఖర్చులు తప్పవు

ఇల్లు కట్టేస్తే ఖర్చులు అయిపోయినట్లు కాదు. ఆ తర్వాత కూడా పెయింటింగ్, ఎలక్ట్రికల్ రిపేర్లు, ప్లంబింగ్, గోడల మెయింటెనెన్స్, తలుపులు, కిటికీల రిపేర్లు, వాటర్ ట్యాంక్ క్లీనింగ్, సెక్యూరిటీ లాంటి ఖర్చులు వస్తూనే ఉంటాయి. ఇక ఇల్లు పాతబడేకొద్ది పెద్ద పెద్ద రిపేర్లు కూడా రావచ్చు. అందుకే ఇంటి మెయింటెనెన్స్ కోసం ఏటా కొంత అమౌంట్ పక్కన పెట్టడం చాలా ముఖ్యం.

45
లోన్ తీసుకుంటే అసలు కంటే వడ్డీయే ఎక్కువ
Image Credit : pinterest

లోన్ తీసుకుంటే అసలు కంటే వడ్డీయే ఎక్కువ

ఇల్లు లేదా స్థలం కొనడానికి లోన్ తీసుకున్నప్పుడు, అసలుతో పాటు చాలా ఏళ్ల పాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంది. కాబట్టి కేవలం ఆస్తి ధరను మాత్రమే చూడకుండా, లోన్ తీరేసరికి అసలు + మొత్తం వడ్డీ కలిపి ఎంత కడుతున్నామో ముందే లెక్కేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం.

55
ఫైనల్ గా ఎవరు ప్లాట్ కొనాలి? ఎవరు ఇల్లు కట్టుకోవాలి?
Image Credit : pinterest

ఫైనల్ గా ఎవరు ప్లాట్ కొనాలి? ఎవరు ఇల్లు కట్టుకోవాలి?

వెంటనే ఇల్లు కట్టుకుని మారాల్సిన అవసరం లేని వాళ్లకు, ముందుగా స్థలం కొని పెట్టుకోవడం మంచి ఆప్షన్. కానీ స్థలం కొనే ముందు దాని లీగల్ డాక్యుమెంట్లు కరెక్ట్‌గా ఉన్నాయా? లొకేషన్ ఎలా ఉంది? రోడ్డు సదుపాయం, తాగునీరు, కరెంట్ వసతులు ఉన్నాయా? అనేది బాగా చెక్ చేసుకోవాలి. అలాగే భవిష్యత్తులో ఆ స్థలంలో ఇల్లు కడతామా? పెట్టుబడి కోసమా? లేక వేరే అవసరాల కోసమా? అనేది ముందే డిసైడ్ చేసుకోవడం ముఖ్యం.

వెంటనే సొంతింట్లోకి మారాలనుకునే వాళ్లకు ఇల్లు కట్టుకోవడమే బెస్ట్ ఆప్షన్. అయితే ఇల్లు కట్టడానికి అయ్యే ప్రారంభ ఖర్చును మాత్రమే లెక్కలోకి తీసుకోకూడదు. భవిష్యత్తులో వచ్చే మెయింటెనెన్స్, రిపేర్లు, పెయింటింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ లాంటి ఖర్చులను కూడా కలుపుకుని ప్లాన్ చేసుకోవాలి.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు

స్థలం రేటు ఎంత? ఇల్లు కట్టడానికి ఎంత అవుతుంది? అనేది మాత్రమే పూర్తి లెక్క కాదు. ఏదైనా ఆస్తి కొనే ముందు…

  • ప్రారంభ పెట్టుబడి
  • రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ ఖర్చులు
  • లోన్, వడ్డీ
  • నిర్మాణ ఖర్చు
  • కరెంట్, నీరు లాంటి వసతులు
  • ఏటా కట్టే పన్నులు
  • మెయింటెనెన్స్, రిపేర్లు
  • భవిష్యత్తులో వచ్చే పెద్ద ఖర్చులు

ఇలా కనీసం 10-20 ఏళ్ల పాటు అయ్యే మొత్తం ఖర్చును లెక్కేసుకున్నాకే నిర్ణయం తీసుకోవడం సేఫ్.

గమనిక : స్థలం లేదా ఇల్లు కొనేటప్పుడు కట్టాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజులు, పన్నులు రాష్ట్రం, స్థానిక సంస్థలు, ఆస్తి స్వభావాన్ని బట్టి మారుతాయి. కాబట్టి కొనే ముందు అధికారిక ఫీజుల వివరాలను చెక్ చేసుకుని, లీగల్ ఎక్స్‌పర్ట్ ద్వారా డాక్యుమెంట్లను వెరిఫై చేయించుకోవడం మంచిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
స్థిరాస్తి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Yawning: ఎదుటివారు ఆవ‌లిస్తే మ‌న‌కూ ఆవ‌లింత‌లు ఎందుకు వ‌స్తాయి.? ఎప్పుడైనా ఆలోచించారా
Recommended image2
Andhra Ooty: ఆంధ్ర ఊటీ.. అరకులో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 ప్రదేశాలు ఇవే
Recommended image3
ఎంత బ‌ల‌వంతుడివైనా స‌రే కోపం జీవితాన్ని నాశ‌నం చేయ‌డం ఖాయం.. క‌నువిప్పు క‌లిగించే క‌థ
Related Stories
Recommended image1
House Construction: వంద గజాల్లో ఒక అంతస్తు ఇంటిని కడితే ఎంత ఖర్చవుతుంది? దేనికి ఎంత పెట్టాలి?
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved