MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • HandBag: రోడ్డు పక్కన దొరికే రూ.500 హ్యాండ్ బ్యాగ్‌ను 8 లక్షల రూాపాయలకు అమ్మేశారు

HandBag: రోడ్డు పక్కన దొరికే రూ.500 హ్యాండ్ బ్యాగ్‌ను 8 లక్షల రూాపాయలకు అమ్మేశారు

HandBag: మన దేశంలో రోడ్డు పక్కన దొరికే రూ.500కే బ్యాగ్‌ను.. ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏకంగా రూ.8.3 లక్షల ధర పెట్టి అమ్మేస్తోంది. ఇప్పుడు ఈ విషయం ఇంటర్నెట్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. సెలెబ్రిటీలు, ధనవంతులను ఆ బ్రాండ్ బ్యాగును ఎగబడి కొనేస్తున్నారు.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 18 2026, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వామ్మో రూ.500 బ్యాగును..
Image Credit : Fendi

వామ్మో రూ.500 బ్యాగును..

హ్యాండ్ బ్యాగులంటే మహిళలకు ఎంతో క్రేజ్. అయితే ఇప్పుడు ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఏకంగా అయిదు వందల రూపాయల బ్యాగును లక్షల రూపాయలకు ఆన్ లైన్లో అమ్ముతోంది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ 'ఫెండి' (Fendi) మార్కెట్లోకి తెచ్చిన కొత్త హ్యాండ్‌బ్యాగ్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది. దానికి కారణం అది మన దేశంలో రోడ్డు పక్కన సులువుగా దొరుకుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఫెండి నవరాత్రి బ్యాగ్
Image Credit : Fendi

ఫెండి నవరాత్రి బ్యాగ్

'Baguette 26424: Multicolour Re-Edition bag with embroidery and mirrors' అనే పేరుతో ఫెండి సంస్థ ఈ బ్యాగ్‌ను లాంచ్ చేసింది. రంగురంగుల దారాలు, 39,500 పూసలు, 475 చిన్న అద్దాలతో పూర్తిగా చేతులతోనే దీన్ని తయారు చేశామని, ఒక్కో బ్యాగ్ కుట్టడానికి 138 గంటల సమయం పట్టిందని కంపెనీ చెబుతోంది.

దీని ధరను 10,000 డాలర్లుగా (మన కరెన్సీలో సుమారు రూ.8.3 లక్షలు) ఫిక్స్ చేశారు. కానీ, ఈ బ్యాగ్ డిజైన్ చూస్తే.. గుజరాత్, రాజస్థాన్ వీధుల్లో నవరాత్రి ఉత్సవాల సమయంలో మహిళలు వాడే సంప్రదాయ అద్దాల బ్యాగ్‌ను అచ్చు గుద్దినట్లు దించేసినట్లుగా ఉంది.

33
మండిపడుతున్నసెలెబ్రిటీలు
Image Credit : Fendi Navratri bag

మండిపడుతున్నసెలెబ్రిటీలు

ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఎక్స్ (X) వేదికగా ఫెండిపై విమర్శలు గుప్పించారు. "ప్రాడా (Prada) కొల్హాపూరి చెప్పుల వివాదం తర్వాత, ఇప్పుడు ఫెండి 'నవరాత్రి' బ్యాగ్ వచ్చింది. గుజరాత్ వీధుల్లో 500 రూపాయలకు దొరికే డిజైన్‌కు 8.3 లక్షలు వసూలు చేస్తున్నారు. కానీ, అసలైన భారతీయ కళాకారులకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ఇంటర్నేషనల్ బ్రాండ్లు మన కళలను దోచుకోవడం ఎప్పుడు ఆపుతాయి?" అని ఆయన ప్రశ్నించారు.

బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్-షా కూడా దీనిపై స్పందించారు. మన సంప్రదాయ కళను కాపాడుతున్న కళాకారులను పక్కనపెట్టి, దాన్ని లగ్జరీ వస్తువుగా మార్చి అమ్మడం మన నైపుణ్యాన్ని అవమానించడమేనని ఆమె మండిపడ్డారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మరణం తర్వాత మ‌నిషి శరీరంలో ఏం జరుగుతుంది? మొదట మారేది ఇదే..
Recommended image2
Godavari: గోదావరి నది సముద్రంలో కలిసే చోట కనిపించే అద్భుతం.. ‘అన్నా చెల్లెళ్ల గట్టు’
Recommended image3
Gold Hating Country: ఈ దేశంలో బంగారమంటేనే పడదు, గోల్డ్ జ్యూయలరీ వేసుకోవడం పెద్ద వింత
Related Stories
Recommended image1
Chicken Curry Tips: చికెన్ కూర మరింత రుచిగా రావాలంటే సింపుల్ చిట్కాలు ఇవిగో
Recommended image2
Fridge Explosion: ఇలాంటి తప్పులు చేస్తే ఇంట్లోని ఫ్రిజ్ పేలే అవకాశాలు ఎక్కువ, జాగ్రత్త
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved