MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • House Construction: వంద గజాల్లో ఒక అంతస్తు ఇంటిని కడితే ఎంత ఖర్చవుతుంది? దేనికి ఎంత పెట్టాలి?

House Construction: వంద గజాల్లో ఒక అంతస్తు ఇంటిని కడితే ఎంత ఖర్చవుతుంది? దేనికి ఎంత పెట్టాలి?

House Construction: వంద గజాల్లో కూడా చక్కగా ఇల్లు కట్టుకోవచ్చు. ఒక హాలు, రెండు గదులు, కిచెన్ ఉన్న ఒంటిని కట్టేందుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఇక్కడ మేము వివరంగా ఇచ్చాము.. చదివి తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 26 2026, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇల్లు కట్టేందుకు ఎంత ఖర్చు?
Image Credit : Gemini AI

ఇల్లు కట్టేందుకు ఎంత ఖర్చు?

సొంతిల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి అతిపెద్ద కల. అయితే పెరుగుతున్న స్థలం ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు చూసి సామాన్యుడు అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాలకు 100 గజాలు అంటే సుమారు 900 చదరపు అడుగులు స్థలంలో ఒక సౌకర్యవంతమైన ఇల్లు కట్టేందుకు ఎంతో ఖర్చవుతుందో ఇక్కడ ఒక అంచనా వేసి ఇచ్చాము. 100 గజాల స్థలంలో కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా విశాలమైన రెండు బెడ్‌రూమ్‌ల సింగిల్ అంతస్తు ఇల్లు నిర్మించుకోవచ్చు. ప్రస్తుతం నిర్మాణ నాణ్యతను బట్టి చదరపు అడుగుకు సాధారణ మెటీరియల్‌తో అయితే రూ.1,100 నుండి రూ.1,200 వరకు ఖర్చవుతుంది. అదే మీరు నాణ్యమైన బి క్లాస్ మెటీరియల్‌ వాడితే రూ.1,300 నుండి రూ.1,600 వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన 100 గజాల స్థలంలో ఇంటిని నిర్మించడానికి సుమారు రూ.11 లక్షల నుండి రూ.14.4 లక్షల వరకు అవసరమవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఏ మెటీరియల్ కు ఎంతవుతుంది?
Image Credit : Generated by google gemini AI

ఏ మెటీరియల్ కు ఎంతవుతుంది?

ఇంటి నిర్మాణంలో అత్యంత భాగం నిర్మాణ సామగ్రికే ఖర్చువుతంది. పక్కా ప్రణాళికతో మెటీరియల్ కొంటే కాంట్రాక్టర్ల చేతిలో మోసపోకుండా మన డబ్బును ఆదా చేసుకోవచ్చు. 100 గజాల ఇంటి నిర్మాణానికి అయ్యే ప్రధాన సామగ్రి వివరాలను చూస్త ఒక అంతస్తు ఇంటి నిర్మాణానికి సుమారు 400 నుండి 450 సిమెంట్ బస్తాలు అవసరమవుతాయి. దీనికి రూ.1.7 లక్షల నుండి రూ.2.0 లక్షల వరకు ఖర్చవుతుంది. పిల్లర్లు, స్లాబ్ పటిష్టంగా ఉండడం కోసం దాదాపు 3 టన్నుల ఐరన్ అవసరం పడుతుంది. దీనిని రూ.2.2 లక్షల నుండి రూ.2.6 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇక గోడల నిర్మాణానికి 20,000 నుండి 24,000 వరకు ఇటుకలు అవసరమవుతాయి. వీటి ధర రూ.1.4 లక్షల నుండి రూ.1.8 లక్షల మధ్యలో ఉంటుంది. వీటితో పాటు కాంక్రీట్, ప్లాస్టరింగ్ కోసం వాడే ఇసుక, కంకర కోసం మరో రూ.1.2 లక్షల నుండి రూ.1.5 లక్షల వరకు కేటాయించాల్సి ఉంటుంది.

Related Articles

Related image1
Motivational Story: బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు.. ఉద్యోగం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి
Related image2
Vande Bharat Train cost: ఒక వందే భారత్ రైలు తయారు చేయడానికి ఎంత ఖర్చువుతుంది?
33
మేస్త్రీ, కూలీల ఖర్చు
Image Credit : Generated by google gemini AI

మేస్త్రీ, కూలీల ఖర్చు

కేవలం సామగ్రి కోసం మాత్రమే కాకుండా మేస్త్రీలు, కూలీల ఖర్చులు కూడా లెక్కించుకోవాలి. సాధారణంగా మొత్తం నిర్మాణ ఖర్చులో దాదాపు 25 శాతం వరకు కూలి (లేబర్) ఖర్చులకే సరిపోతుంది. ప్రస్తుతం 900 చదరపు అడుగుల వైశాల్యానికి కాంట్రాక్టర్లు చదరపు అడుగుకు రూ.220 నుండి రూ.260 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే లేబర్ చార్జీలు మొత్తం రూ.2.0 లక్షల నుండి రూ.2.3 లక్షల వరకు అవుతాయి. ఇల్లు రూపుదిద్దుకున్న తర్వాత ఫినీషింగ్ పనులైన ప్లంబింగ్, వైరింగ్, నేలపై టైల్స్ వేయడం, గోడలకు రంగులు వేయడం వంటి పనుల కోసం వేరుగా రూ.2.0 లక్షల నుండి రూ.2.4 లక్షల వరకు బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి. ఈ ఖర్చులన్నింటినీ కలుపుకుంటే 100 గజాల ప్లాట్‌లో పూర్తిస్థాయిలో ఒక అందమైన సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ప్రాథమికంగా తక్కువలో తక్కువ 11 లక్షల రూపాయల నుంచి 14 లక్షల దాకా ఖర్చవుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio Freedom Plan: ఎయిర్‌టెల్‌ను దెబ్బకొడుతూ జియో కొత్త ఫ్రీడమ్ ప్లాన్..అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, ఫ్రీ OTT కూడా
Recommended image2
Business Ideas : చేతిలో కేవల రూ.50,000 ఉంటే చాలు.. మంచి లాభాలతో కూడిన ఈ 5 బిజినెస్ చేయవచ్చు
Recommended image3
Gold Price Hike: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో రెండో రోజు బంగారం ధరలకు బ్రేక్
Related Stories
Recommended image1
Motivational Story: బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు.. ఉద్యోగం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి
Recommended image2
Vande Bharat Train cost: ఒక వందే భారత్ రైలు తయారు చేయడానికి ఎంత ఖర్చువుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved