MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !

Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !

Worlds Cheapest House: అమెరికాలోని మిచిగాన్‌లో కేవలం 1 డాలర్‌కే ఇల్లు లభిస్తోంది. 2 బెడ్‌రూమ్‌లు ఉన్న ఈ ఇల్లు ఎందుకు అంత చౌకగా అభిస్తోంది. ఆ ఇల్లు ధర, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 23 2026, 07:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. 1 డాలర్‌కే ఎందుకు అమ్ముతున్నారో తెలుసా?
Image Credit : Chatgpt

ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. 1 డాలర్‌కే ఎందుకు అమ్ముతున్నారో తెలుసా?

సొంత ఇల్లు కొనడం అనేది ప్రతీ ఒక్కరి కల. కానీ ఇప్పుడున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. చిన్న స్థలం కొనాలన్నా లక్షల్లో, కోట్లలో డబ్బులు కావాలి. కానీ ప్రపంచంలో కేవలం 1 యూఎస్ డాలర్ (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 83) కే ఒక ఇల్లు ఉందంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. టీ తాగే ఖర్చుకే ఒక పూర్తి ఇల్లు సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఈ వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. జనాలు కూడా ఈ ఇంటి గురించి తెలుసుకోవడానికి నెట్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ ఇల్లు ఎక్కడ ఉంది? దీంట్లో ఏమేం ఉన్నాయి?
Image Credit : Asianet News

ఈ ఇల్లు ఎక్కడ ఉంది? దీంట్లో ఏమేం ఉన్నాయి?

ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఈ ఇల్లు అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో ఉంది. దీని ఖచ్చితమైన అడ్రస్ చూస్తే.. 70 ఈ యప్సిలాంటి అవెన్యూ, పొంటియాక్, మిచిగాన్, యూఎస్ఏ. ఈ ఇంట్లో రెండు బెడ్‌రూమ్‌లు, ఒక కిచెన్, ఒక బాత్‌రూమ్ ఉన్నాయి. ఒక చిన్న కుటుంబం నివసించడానికి ఇది సరిగ్గా సరిపోతుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఈ ఇంటికి సంబంధించి యాడ్ ఇచ్చిన వెంటనే ఆయనకు పోన్ కాల్స్ వరదలా వచ్చాయి. ప్రతీ ఒక్కరూ 1 డాలర్‌కే ఇల్లు అనగానే ఆశ్చర్యపోయి ఎగబడ్డారు.

Related Articles

Related image1
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Related image2
Pancha Bhoota Temples: పంచభూత క్షేత్రాల రహస్యం ఇదే.. ఈ ఆలయాల ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
34
రూ. 8 లక్షల విలువైన ఇల్లు.. 1 డాలర్‌కు ఎలా పడిపోయింది?
Image Credit : Manisha Rani/YouTube

రూ. 8 లక్షల విలువైన ఇల్లు.. 1 డాలర్‌కు ఎలా పడిపోయింది?

ఈ ఇల్లు నిన్న మొన్న కట్టింది కాదు. దీనిని 1856వ సంవత్సరంలో నిర్మించారు. ఒకప్పుడు ఈ ఇంటి విలువ దాదాపు 8 లక్షల రూపాయలుగా ఉండేది. అయితే చాలా సంవత్సరాల పాటు ఈ ఇంటిని అద్దెకు ఇచ్చారు. వరుసగా అద్దెకు ఉన్నవారు ఈ ఇంటిని సరిగ్గా నిర్వహించకపోవడంతో ఇది దారుణంగా దెబ్బతింది. ఇంటి గోడలు, కప్పు, ఫ్లోరింగ్ అన్నీ పాడైపోయాయి. కాలక్రమేణా ఇంటి పరిస్థితి క్షీణించడంతో దాని ధర దారుణంగా పడిపోయింది. చివరికి దాని యజమాని ఈ ఇంటిని కేవలం 1 డాలర్‌కే అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది.

44
తక్కువ రేటు ఉన్నా జనాలు ఎందుకు కొనడం లేదు?
Image Credit : Chatgpt

తక్కువ రేటు ఉన్నా జనాలు ఎందుకు కొనడం లేదు?

కేవలం 1 డాలర్‌కే లభిస్తున్నప్పటికీ, ఈ ఇంటిని కొనడానికి కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఆ ఇంటికి కావాల్సిన రిపేర్లు. ఈ ఇంటిని మళ్లీ ఉండటానికి వీలుగా మార్చాలంటే కనీసం 20,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ. 16 లక్షలకు పైగా) అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇంటిని 1 డాలర్‌కే కొన్నా, రిపేర్లకు భారీగా ఖర్చు పెట్టాల్సి రావడంతో కొనుగోలుదారులు భయపడి వెనక్కి తగ్గుతున్నారు. అందుకే ఈ ఇల్లు ఇప్పటికీ ఎవరూ కొనకుండా అలానే ఉండిపోయింది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు vs అత్యంత చౌకైన ఇల్లు

ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లుగా మిచిగాన్‌లోని ఈ 1 డాలర్ ఇల్లు వార్తల్లో నిలవగా, మరోవైపు ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇళ్లు కూడా ఉన్నాయి. లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచింది. బ్రిటీష్ రాజకుటుంబ అధికారిక నివాసమైన ఈ ప్యాలెస్ విలువ దాదాపు 4.9 బిలియన్ డాలర్లు. ఇందులో 770 కి పైగా గదులు, 40 ఎకరాల భారీ గార్డెన్ ఉన్నాయి. ఇక ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు, భారత్‌లోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా ముకేశ్ అంబానీకి చెందిన ‘యాంటిలియా’ ఉంది. ఒకవైపు బిలియన్ డాలర్ల ప్యాలెస్‌లు ఉంటే, మరోవైపు 1 డాలర్ ఇల్లు ఉండటం గమనార్హం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Funeral: అంతిమ సంస్కారాల్లో మట్టి కుండను ఎందుకు పగలగొడతారో తెలుసా.?
Recommended image2
ఏసీని మ‌నుషుల కోసం త‌యారు చేయ‌లేద‌ని తెలుసా? చ‌ల్ల గాలి వెనుక ఇంత సైన్స్ ఉందా.?
Recommended image3
Pancha Bhoota Temples: పంచభూత క్షేత్రాల రహస్యం ఇదే.. ఈ ఆలయాల ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image2
Pancha Bhoota Temples: పంచభూత క్షేత్రాల రహస్యం ఇదే.. ఈ ఆలయాల ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved