MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • ఎంత బ‌ల‌వంతుడివైనా స‌రే కోపం జీవితాన్ని నాశ‌నం చేయ‌డం ఖాయం.. క‌నువిప్పు క‌లిగించే క‌థ

ఎంత బ‌ల‌వంతుడివైనా స‌రే కోపం జీవితాన్ని నాశ‌నం చేయ‌డం ఖాయం.. క‌నువిప్పు క‌లిగించే క‌థ

Motivational Story: కోపం అనేది స‌ర్వ‌సాధార‌ణ‌మైన ఎమోష‌న్‌. ప్ర‌తీ ఒక్క‌రూ కోప్ప‌డ‌డం ఖాయం. అయితే కోపం అనే ఎమోష‌న్ ఇత‌రుల‌ను ఇబ్బంది పెట్ట‌డ‌మే కాకుండా మ‌న‌ల్ని కూడా నాశ‌నం చేస్తుంది. ఈ స‌త్యాన్ని చాటే ఒక నీతి క‌థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

3 Min read
Author : Narender Vaitla
Published : Sep 17 2026, 06:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిన్న విషయానికే కోపం తెచ్చుకునే ఏనుగు
Image Credit : Gemini AI

చిన్న విషయానికే కోపం తెచ్చుకునే ఏనుగు

ఒక దట్టమైన అడవిలో ఓ భారీ ఏనుగు ఉండేది. శరీరంతో ఎంత బలంగా ఉండేదో.. స్వభావంలో అంతకంటే ఎక్కువ కోపంగా ఉండేది. దానికి ముక్కు మీద కోపం. చిన్న చిన్న విషయాలకు కూడా ఆగ్రహంతో ఊగిపోయేది. తనకు నచ్చని శబ్దం వినిపించినా, ఏదైనా జంతువు తన దారికి అడ్డంగా వచ్చినా వెంటనే కోపంతో తొండాన్ని పైకెత్తి బెదిరించేది. అడవిలోని జంతువులన్నీ దాని కోపాన్ని చూసి భయపడేవి. నిజానికి ఆ ఏనుగుకు ఎవరూ శత్రువులు కాదు. కానీ దాని కోపమే దానికి పెద్ద సమస్యగా మారింది. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసుకుని తన ప్రశాంతతను తానే కోల్పోయేది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏనుగును కుట్టిన చిన్న తేనేటీగ
Image Credit : Gemini AI

ఏనుగును కుట్టిన చిన్న తేనేటీగ

ఒకరోజు ఏనుగు అడవిలో నడుచుకుంటూ వెళ్తోంది. అప్పుడే ఓ చిన్న తేనేటీగ అటువైపు ఎగురుతూ వచ్చింది. ఏనుగు దగ్గరికి వచ్చిన సమయంలో అది అనుకోకుండా ఏనుగు కంటి పైభాగంలో కుట్టింది. కుట్టింది ఓ చిన్న తేనేటీగే. కానీ నొప్పి మాత్రం ఏనుగుకు ఒక్కసారిగా తీవ్రమైంది. అంతే.. అప్పటికే కోపానికి అలవాటు పడిన ఏనుగు ఆ నొప్పితో మరింత రెచ్చిపోయింది. "నన్నే కుట్టే ధైర్యం చేసిందా?" అంటూ తేనేటీగను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది.

35
తేనేటీగ కోసం విచక్షణ కోల్పోయిన ఏనుగు
Image Credit : Gemini AI

తేనేటీగ కోసం విచక్షణ కోల్పోయిన ఏనుగు

ఏనుగు తన తొండంతో తేనేటీగను కొట్టేందుకు ప్రయత్నించింది. ఒకసారి కాదు.. పదే పదే ప్రయత్నించింది. కానీ చిన్నదైన తేనేటీగ వేగంగా ఎగురుతూ ఏనుగు దాడి నుంచి తప్పించుకుంది. తేనేటీగ ఎంతకీ దొరకకపోవడంతో ఏనుగు కోపం మరింత పెరిగిపోయింది. కాసేపు ఆగి ఆలోచించి ఉంటే తేనేటీగ అక్కడి నుంచి ఎగిరిపోయేది. నొప్పి కూడా కొద్దిసేపటికి తగ్గిపోయేది. కానీ కోపంతో ఉన్నప్పుడు ఏనుగుకు ఆలోచన రాలేదు. తేనేటీగను ఎలాగైనా చంపాలనే ఆలోచన మాత్రమే దాని మనసులో ఉంది. చివరకు కోపంతో విచక్షణ కోల్పోయిన ఏనుగు బలంగా తొండాన్ని ఊపి కొట్టింది. అయితే ఆ దెబ్బ తేనేటీగకు తగలలేదు. దురదృష్టవశాత్తూ ఏనుగు తొండం దాని సొంత కంటికే బలంగా తగిలింది. కంటికి తీవ్ర గాయం కావడంతో ఏనుగు కంటిచూపును కోల్పోయే పరిస్థితి వచ్చింది.

45
చిన్న తేనేటీగ వల్ల కాదు.. తన కోపం వల్లే నష్టం
Image Credit : Gemini AI

చిన్న తేనేటీగ వల్ల కాదు.. తన కోపం వల్లే నష్టం

కొద్దిసేపటి తర్వాత ఏనుగు ప్రశాంతంగా మారింది. జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది. తనను కుట్టిన తేనేటీగ ఎప్పుడో అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ దాన్ని చంపాలనే కోపంలో తానే తనకు గాయం చేసుకుంది. అప్పుడు ఏనుగుకు అసలు విషయం అర్థమైంది. "నన్ను కుట్టింది తేనేటీగ. కానీ నాకు ఇంత పెద్ద నష్టం చేసింది మాత్రం నా కోపమే" అని బాధపడింది. ఒక చిన్న నొప్పిని భరించి కొన్ని క్షణాలు ప్రశాంతంగా ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. తేనేటీగ చేసిన పని వల్ల వచ్చిన నష్టం కంటే.. దాన్ని చంపాలనే కోపంలో తానే చేసుకున్న నష్టమే ఎక్కువైంది.

55
కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగాలి
Image Credit : Gemini AI

కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగాలి

ఈ చిన్న కథలో పెద్ద జీవిత పాఠం దాగి ఉంది. "తన కోపమే తనకు శత్రువు" అనే సామెతకు ఈ కథ సరిగ్గా సరిపోతుంది. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి. ఎవరైనా ఒక మాట అన్నారని, చిన్న సమస్య ఎదురైందని, మనకు నచ్చని పని జరిగిందని వెంటనే కోపం తెచ్చుకుంటాం. ఆ సమయంలో ఒక్కసారి కూడా ఆలోచించకుండా మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు తర్వాత మనకే ఇబ్బందులు తెస్తాయి.

కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే చాలా సమస్యలను నివారించవచ్చు. కొద్దిసేపు మౌనంగా ఉండటం, అక్కడి నుంచి కాస్త దూరంగా వెళ్లడం, నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వంటి చిన్న ప్రయత్నాలు కూడా కోపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఎందుకంటే కోపం ఉన్న సమయంలో మనం చేసే తప్పుకు కారణం ఎదుటివారు కావచ్చు.. కానీ ఆ తప్పు వల్ల వచ్చే నష్టాన్ని మాత్రం మనమే అనుభవించాల్సి వస్తుంది. అందుకే కోపం వచ్చిన ప్రతిసారీ మనసులో.. "నేను ఇప్పుడు కోపంతో తీసుకునే నిర్ణయం.. రేపు నాకు బాధ కలిగించకూడదు" అనే మాట‌ను గుర్తు చేసుకోవాలి.. కోపాన్ని జయించినవాడు ఎదుటివారిని కాదు.. ముందుగా తనను తానే జయించినవాడని గుర్తుంచుకోవాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
DMart Offers : MRP తో పనేలేదు.. డీమార్ట్‌లో అతితక్కువ ధరకు దొరికే 10 వస్తువులు ఇవే
Recommended image2
Telugu Saying: చెబితే వినని వాళ్లని చెడితే చూడాలట! పెద్దలు ఈ సామెత ఊరికే చెప్పలేదు!
Recommended image3
Snakes : అడవిలో కంటే జనావాసాల్లో ఉండే పాములే ఎక్కువకాలం బ్రతుకుతాయట.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉన్న‌ట్లే. ఎలాగంటే.?
Recommended image2
వ‌ర్షాకాలం, చ‌లికాలం సోలార్ ప్యానెల్స్ ప‌నిచేయ‌వా.? అప్పుడు వాటి ప‌రిస్థితి ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved