MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Animal Facts : జీవితంలో ఒక్కసారి కూడా ఆకాశాన్ని చూడలేని జంతువు ఏది? ఎందుకో తెలుసా?

Animal Facts : జీవితంలో ఒక్కసారి కూడా ఆకాశాన్ని చూడలేని జంతువు ఏది? ఎందుకో తెలుసా?

పందులు మనలాా తలను పూర్తిగా పైకెత్తి ఆకాశం వైపు చూడలేవు… ఎందుకో తెలుసా? పందుల శరీర నిర్మాణం, వాటి కంటిచూపు వెనకున్న ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 18 2026, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆకాశాన్ని చూడలేని జంతువేది?
Image Credit : Gemini AI

ఆకాశాన్ని చూడలేని జంతువేది?

కొన్ని జంతువులు చాలా ఆసక్తికరమైన లక్షణాలను కలిగివుంటాయి. పాడి పశువులు పచ్చగడ్డి తిని తెల్లని పాలు ఇవ్వడం, పాము విషానికి విరుగుడు మందు గుర్రాల నుండి రెడీ చేయడం, కప్పలు అహారం, నీళ్లు లేకుండా నెలలపాటు జీవించడం... ఇలా జంతు ప్రపంచంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు ఉన్నాయి. ఇలాగే ఓ జంతువు తన జీవితకాలంలో ఆకాశాన్ని చూడలేదు... దాని కళ్లు ఎప్పుడూ నేలవైపే ఉంటాయి. ఇదేదో అడవి జంతువు అయివుంటుందని అనుకుంటున్నారా? కానే కాదు. ఇది జనావాసాల్లో కనిపించే జంతువు... ఇంతకీ అదేంటి? ఆకాశాన్ని ఎందుకు చూడలేదో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పంది ఆకాశాన్ని చూడలేదా..?
Image Credit : Getty

పంది ఆకాశాన్ని చూడలేదా..?

పందుల గురించి మనకు చిన్నప్పటి నుంచే ఎన్నో విషయాలు తెలుసు. సాధారణంగా పందులు నేలపై తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతుంటాయి. వాటి ముక్కుతో నేలను తవ్వుతూ, వాసన చూస్తూ ఆహారాన్ని గుర్తిస్తాయి. అయితే పందులకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం గురించి చాలామందికి తెలియదు. పందులు ఆకాశాన్ని నేరుగా చూడలేవు. మరి పందులు ఎందుకు పైకి చూడలేవు? పంది శరీర నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతే దీనికి కారణమా?

పందులు కేవలం నేలను, నేరుగా చూడగలవు... పూర్తిగా తల పైకెత్తి ఆకాశాన్ని చూడలేవు. తలను ఇరువైపులా కళ్లు ఉంటాయి కాబట్టి చుట్టూ ఉన్న దృశ్యాలను చూడగలవు... కానీ మనుషుల మాదిరిగా తల పైకెత్తి ఆకాశం వైపు చూడలేవు. దీనికి ప్రధాన కారణం వాటి మెడ, వెన్నెముక నిర్మాణం, శరీర ఆకృతి.

పందుల మెడ మనుషుల మెడలా స్వేచ్ఛగా అన్ని దిశల్లో కదలదు... వీటిలోని మెడ కండరాలు, ఎముకలు గట్టిగా ఉంటాయి. ముఖ్యంగా తలను బాగా వెనక్కి వంచే సామర్థ్యం వాటిలో పరిమితంగా ఉంటుంది. అందువల్ల నేలపై ఆహారం (వేర్లు, దుంపలు) కోసం వెతికే సమయంలో తల కిందికి ఉండటం వాటికి చాలా సహజం. కానీ తలను పూర్తిగా పైకి ఎత్తి ఆకాశం వైపు చూడటం మాత్రం సాధ్యం కాదు.

34
పందుల శరీర నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది
Image Credit : X/cutebabypix

పందుల శరీర నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది

పందుల శరీర ఆకృతిని గమనిస్తే వాటి తల, మెడ, భుజాల నిర్మాణం మనుషుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. వాటి శరీరం బరువుగా ఉండటం, మెడ కదలికలు పరిమితంగా ఉండటం వల్ల తలను వెనక్కి వంచడం కష్టమవుతుంది. అంతేకాదు పందులు సాధారణంగా నేలపై ఆహారం వెతుక్కునే జీవులు… ఇవి ఎక్కువగా దుంపలు, వేర్లను తింటాయి. వాటి ముక్కు చాలా సున్నితంగా ఉండటంతో నేలను వాసన చూస్తూ ఆహారాన్ని గుర్తించడం వాటి సహజ ప్రవర్తన. అందుకే వాటి తల ఎక్కువ సమయం నేలకు దగ్గరగా కనిపిస్తుంది.

44
పందులు నేలను ఎందుకు ఎక్కువగా చూస్తాయి?
Image Credit : Getty

పందులు నేలను ఎందుకు ఎక్కువగా చూస్తాయి?

పందుల జీవన విధానంలో నేలతో సంబంధం చాలా ఎక్కువ. ఆహారం కోసం నేలను ముక్కుతో తవ్వడం, వాసనల ద్వారా ఆహారం లేదా ఇతర వస్తువులను గుర్తించడం వాటి సహజ లక్షణాలు. అందువల్ల వాటి తల ఎక్కువగా కిందికి వంగి ఉంటుంది. ఈ కారణంగా పందులను చూసినప్పుడు అవి ఎప్పుడూ నేలనే చూస్తున్నట్లు అనిపిస్తుంది.

ప్రకృతిలో ప్రతి జంతువు తన జీవన విధానానికి అనుగుణంగా ప్రత్యేకమైన శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. పందుల విషయంలో కూడా వాటి బలమైన శరీరం, ప్రత్యేకమైన మెడ నిర్మాణం, ముక్కుతో ఆహారాన్ని వెతికే అలవాటు వాటి కదలికలను ప్రభావితం చేస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vizag Beach: గోవా దేనికి గురూ? వైజాగ్ తీరంలో ఈ టాప్ 5 బీచ్ రిసార్ట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Recommended image2
Fish: నదిలో పుట్టి.. సముద్రంలో పెరిగి, చావు కోసం మళ్లీ పుట్టిన నదికే వచ్చే చేప ఇది..!
Recommended image3
Psychology: సైకాలజీ ప్రకారం డబ్బు మనిషి ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Recommended image2
Interesting Fact : కోర్టులో జడ్జీలు, లాయర్లు నల్ల కోటు ఎందుకు వేసుకుంటారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved