MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!

Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!

ఏ జంతువు నోట్లో ఎన్ని పళ్లు ఉంటాయి? అసలు పళ్లే ఉండని జీవి ఏది? అత్యధికంగా పళ్లుండే జీవి ఏది? ఇలా జంతువులకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

4 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 06 2026, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జంతువుల పళ్ల గురించి ఆసక్తికర విషయాలు..
Image Credit : Gemini AI

జంతువుల పళ్ల గురించి ఆసక్తికర విషయాలు..

మనిషికి నోట్లో ఎన్ని పళ్లు ఉంటాయి? అంటే వెంటనే 32 అని సమాధానం వస్తుంది. సాధారణంగా పూర్తి ఎదిగిన మనిషికి 32 శాశ్వత దంతాలు ఉంటాయి.. ఇవి అహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి. అయితే ఆహారం తీసుకోవడం అనేది మనిషి ఒక్కరికే పరిమితం కాదు... భూమిపై ఉన్న ప్రతి జంతువూ తనదైన పద్ధతిలో ఆహారం తీసుకుంటుంది. ఇందుకోసం కొన్ని జీవులు పదునైన దంతాలను ఉపయోగిస్తే, మరికొన్ని మొక్కలను నమలడానికి వెడల్పాటి పళ్లను కలిగి ఉంటాయి. ఇంకొన్ని జీవులకు ఊహకందని విధంగా అసలు పళ్లే ఉండవు. మరి ఏ జీవికి అతి తక్కువ దంతాలు ఉన్నాయి? ఏ జీవి నోట్లో అత్యధిక సంఖ్యలో దంతాలు ఉంటాయి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మనిషి కంటే తక్కువ పళ్లుండే జీవులివే
Image Credit : sasint / Pixabay

మనిషి కంటే తక్కువ పళ్లుండే జీవులివే

కోడికి అసలు పళ్లు ఉండవు

మన చుట్టూ కనిపించే కోళ్లు ఆహారం తినేటప్పుడు నోట్లో పళ్లు ఉన్నట్లుగా కనిపించవు. ఎందుకంటే కోళ్లకు నిజంగానే దంతాలు ఉండవు. వాటికి ముక్కు భాగంలో గట్టి కొమ్ము వంటి నిర్మాణం ఉంటుంది. ధాన్యాలు, పురుగులు, చిన్న ఆహార పదార్థాలను కోళ్లు ఈ ముక్కుతో తీసుకుంటాయి. ఆ తర్వాత ఆహారం జీర్ణవ్యవస్థలోని ప్రత్యేక భాగాల ద్వారా మెత్తబడుతుంది.

కోడితో పాటు అనేక పక్షిజాతులకు కూడా మనుషులు లేదా ఇతర క్షీరదాల మాదిరిగా దవడల్లో దంతాలు ఉండవు. పక్షులు తమ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ముక్కుల ఆకారాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. గింజలు తినే పక్షులకు ఒక రకమైన ముక్కు, మాంసాహార పక్షులకు మరో రకమైన పదునైన ముక్కు ఉంటుంది.

ఎలుకకు 16 పళ్లు..

చిన్న జీవుల్లో ఎలుక దంతాల నిర్మాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణంగా ఎలుకకు 16 దంతాలు ఉంటాయి. ఇందులో ముందు భాగంలోని కోసే దంతాలు చాలా ముఖ్యమైనవి. ఎలుకల ముందరి దంతాలు జీవితకాలంలో పెరుగుతూనే ఉంటాయి. అందుకే అవి చెక్క, గింజలు, ఆహార పదార్థాలు, కొన్నిసార్లు గట్టి వస్తువులను కూడా కొరుకుతూ తమ దంతాల పొడవును అదుపులో ఉంచుకుంటాయి.

ఎలుకలు వస్తువులను కొరికి నష్టం చేయడానికి ప్రధాన కారణాల్లో వాటి నిరంతరం పెరిగే ముందరి దంతాలు కూడా ఒకటి. వాటి దంతాలు పదునుగా ఉండటంతో గట్టి పదార్థాలను కూడా కొరికే సామర్థ్యం ఉంటుంది.

ఏనుగుకు 26 దంతాలుంటాయా? 

ఏనుగును చూసినప్పుడు బయటకు వచ్చిన రెండు భారీ దంతాలు కనిపిస్తాయి… అందుకే చాలామంది వీటికి రెండే పళ్లు ఉంటాయని అనుకుంటారు. కానీ సాధారణంగా ఏనుగుకు సుమారు 26 దంతాలు ఉంటాయని చెబుతారు. ఆహారాన్ని మెత్తగా చేయడానికి వెనుక భాగంలో భారీ నమిలే దంతాలు కీలక పాత్ర పోషిస్తాయి.

ఏనుగు జీవితంలో దంతాల మార్పు విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దాని పెద్ద నమిలే దంతాలు అరిగిపోయినప్పుడు కొత్తవి ముందుకు వచ్చే విధంగా ప్రకృతి దాని దంత వ్యవస్థను రూపొందించింది. గడ్డి, ఆకులు, కొమ్మలు వంటి గట్టి మొక్కల ఆహారాన్ని నమలడానికి ఇవి ఉపయోగపడతాయి.

పిల్లికి 30 దంతాలు 

పిల్లి నోట్లో సాధారణంగా 30 శాశ్వత దంతాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లి కోరలు చాలా పదునుగా ఉంటాయి. మాంసాహార జీవి కావడంతో మాంసాన్ని పట్టుకోవడం, చింపడం, చిన్న ఎముకలపై ఉన్న మాంసాన్ని వేరు చేయడంలో ఈ దంతాలు సహాయపడతాయి.

పిల్లి దంతాలు మనిషి దంతాల మాదిరిగా ప్రధానంగా ఆహారాన్ని బాగా నమలడానికి కాకుండా, మాంసాన్ని కోయడానికి, చీల్చడానికి అనువుగా ఉంటాయి. అందుకే దాని దవడ నిర్మాణం, దంతాల ఆకారం ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఉంటుంది.

Related Articles

Related image1
Interesting Facts : జైళ్లను అద్దెకిచ్చే దేశమేదో తెలుసా?
Related image2
Wedding Facts : తాళిని మూడుముళ్లు వేసే ఎందుకు కడతారో తెలుసా? ఈ సాంప్రదాయం వెనక ఇంత అర్థం దాగుందా..!
35
మనిషి కంటే ఎక్కువ పళ్లుండే జీవులివే...
Image Credit : Getty

మనిషి కంటే ఎక్కువ పళ్లుండే జీవులివే...

గుర్రానికి 36 నుంచి 44 వరకు పళ్లు

గుర్రాల దంతాల సంఖ్య వయస్సు, లింగం, శరీర నిర్మాణం ఆధారంగా మారవచ్చు. సాధారణంగా గుర్రానికి 36 నుంచి 44 వరకు దంతాలు ఉంటాయి. గడ్డి వంటి మొక్కల ఆహారాన్ని ఎక్కువసేపు నమలాల్సి రావడంతో వాటి వెనుక దంతాలు వెడల్పుగా, బలంగా ఉంటాయి.

గుర్రం దంతాల ఆధారంగా దాని వయస్సును అంచనా వేసేందుకు కూడా పశువైద్య రంగంలో కొన్ని పద్ధతులు ఉపయోగిస్తారు. దంతాల అరుగుదల, ఆకారం, ఎదుగుదల వంటి అంశాలు వయస్సు అంచనాకు ఉపయోగపడతాయి.

మొసలికి పదుల సంఖ్యలో దంతాలు

మొసలి నోట్లో సాధారణంగా 60 నుంచి 70 వరకు పదునైన దంతాలు ఉంటాయి. అయితే జాతిని బట్టి ఈ సంఖ్యలో తేడాలు ఉండొచ్చు. మొసలి దంతాల ప్రత్యేకత ఏమిటంటే అవి జీవితకాలంలో పలుమార్లు మారుతూ ఉంటాయి. పాత లేదా దెబ్బతిన్న దంతం ఊడిపోయిన తర్వాత దాని స్థానంలో కొత్త దంతం రావచ్చు. మొసలి తన ఆహారాన్ని మనుషుల మాదిరిగా బాగా నమలదు. ప్రధానంగా ఎరను బలంగా పట్టుకోవడం, ముక్కలు చేయడం కోసం దాని పదునైన దంతాలు ఉపయోగపడతాయి.

సొరచేపలకు వందల సంఖ్యలో దంతాలు

సముద్రంలో అత్యంత శక్తివంతమైన జీవుల్లో సొరచేపలు ఒకటి. కొన్ని జాతుల సొరచేపల నోట్లో వందల సంఖ్యలో దంతాలు ఉంటాయి. ఉదాహరణకు గ్రేట్ వైట్ షార్క్ నోట్లో ఒకేసారి అనేక వరుసల్లో దంతాలు ఉంటాయి. సాధారణంగా వందల సంఖ్యలో దంతాలు ఉండే అవకాశం ఉంది. దంతాలు విరిగిపోయినా లేదా ఊడిపోయినా వాటి వెనుక వరుసల్లో కొత్త దంతాలు సిద్ధంగా ఉంటాయి. అందువల్ల జీవితకాలంలో ఒక సొరచేప వేల సంఖ్యలో దంతాలను కోల్పోయి తిరిగి కొత్త దంతాలను పొందగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.

45
అత్యధిక దంతాలుండే జీవి ఇదే...
Image Credit : Gemini AI

అత్యధిక దంతాలుండే జీవి ఇదే...

భూమిపై అత్యధిక సంఖ్యలో దంతాల వంటి నిర్మాణాలు కలిగిన జీవుల్లో నత్తలు ప్రముఖమైనవి. సాధారణంగా కొన్ని నత్తలలో వేల సంఖ్యలో సూక్ష్మ దంతాలు ఉంటాయి. సాధారణంగా కనిపించే జాతుల్లో ఈ సంఖ్య 12,000 నుంచి 15,000 వరకు ఉంటాయి... మరికొన్ని ప్రత్యేక జాతుల నత్తలలో ఈ సంఖ్య 20,000 నుండి 25,000 వరకు కూడా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

అయితే నత్తలకు మనిషి లేదా ఇతర జంతువుల మాదిరిగా దవడల్లో పెద్ద పెద్ద పళ్లు ఉండవు. వాటి నోట్లో నాలుకను పోలిన ప్రత్యేకమైన కండరపు నిర్మాణం ఉంటుంది. దీనిపై వరుసలుగా వేలాది సూక్ష్మ దంతాలు అమరి ఉంటాయి. ఈ ప్రత్యేక నిర్మాణాన్నే రాడ్యులా (Radula) అంటారు.

నత్తలు ఈ రాడ్యులాను ఉపయోగించి ఆకులు, నాచు, మొక్కల ఉపరితలంపై ఉండే ఆహారం వంటి పదార్థాలను గీరి తింటాయి. అంటే ఈ సూక్ష్మ దంతాలు మన దంతాల మాదిరిగా ఆహారాన్ని నమలడానికి మాత్రమే కాదు, ఉపరితలం నుంచి ఆహారాన్ని రాపిడి చేసి తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకే నత్త నోట్లో వేలాది దంతాలు ఉన్నాయని వినగానే ఆశ్చర్యంగా అనిపించినా, వాటి నిర్మాణం మనం ఊహించే సాధారణ పళ్లకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ భూమిపై అత్యధికంగా పళ్లుండే జీవి నత్తను అసలు ఒక్క పన్నుకూడా లేని కోడి తింటుంది. సర్వభక్షకాలైన కోళ్లు సాధారణంగా కనిపించే నత్తలను చాలా ఇష్టంగా తింటాయి. ఇది ప్రకృతి వింతల్లో ఒకటి.

55
దంతాల సంఖ్య కంటే వాటి ఉపయోగమే ముఖ్యం
Image Credit : Getty

దంతాల సంఖ్య కంటే వాటి ఉపయోగమే ముఖ్యం

ప్రతి జీవి దంతాల సంఖ్య ఒకేలా ఉండదు. అది ఆ జీవి ఆహారం, జీవనశైలి, శరీర నిర్మాణం, పరిణామక్రమంపై ఆధారపడి ఉంటుంది. మాంసాహార జీవులకు ఎరను పట్టుకోవడానికి పదునైన కోరలు అవసరం. మొక్కలను తినే జంతువులకు గడ్డి, ఆకులను నమలడానికి వెడల్పాటి నమిలే దంతాలు అవసరం. ఎలుకలకు గట్టి పదార్థాలను కొరకడానికి నిరంతరం పెరిగే ముందరి దంతాలు ఉంటాయి. కోడి వంటి పక్షులకు దంతాలు లేకపోయినా వాటి ముక్కు, జీర్ణవ్యవస్థ ఆహారం తీసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది.

కేవలం ఎంత సంఖ్యలో దంతాలు ఉన్నాయన్నది మాత్రమే కాదు... ఆ దంతాలు లేదా దంతాలలాంటి నిర్మాణాలు ఆ జీవి జీవనానికి ఎలా ఉపయోగపడుతున్నాయన్నదే అసలు విశేషం. మనిషి నుంచి అతి చిన్న నత్త వరకు ప్రతి జీవికి ప్రకృతి తన ఆహారపు అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేకమైన నోటి నిర్మాణాన్ని అందించిందనే చెప్పాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Longest Lifespan Animals: బాబోయ్.. ఏకంగా 4300 ఏళ్లు బతుకుతుందా? భూమిపై అత్యంత ఎక్కువ ఆయుష్షు ఉన్న జీవి ఇదే !
Recommended image2
క్షమించడం అంటే ఓడిపోవడం కాదు, బ‌ల‌హీన‌త అస‌లే కాదు.. మ‌రెంటో తెలుసా.?
Recommended image3
విద్యుత్ మీటర్లలో ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పసుపు లైట్లు ఎందుకుంటాయి? ఇవి వెలిగితే అర్థమేంటి?
Related Stories
Recommended image1
Interesting Facts : జైళ్లను అద్దెకిచ్చే దేశమేదో తెలుసా?
Recommended image2
Wedding Facts : తాళిని మూడుముళ్లు వేసే ఎందుకు కడతారో తెలుసా? ఈ సాంప్రదాయం వెనక ఇంత అర్థం దాగుందా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved