MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Fridge Explosion: ఇలాంటి తప్పులు చేస్తే ఇంట్లోని ఫ్రిజ్ పేలే అవకాశాలు ఎక్కువ, జాగ్రత్త

Fridge Explosion: ఇలాంటి తప్పులు చేస్తే ఇంట్లోని ఫ్రిజ్ పేలే అవకాశాలు ఎక్కువ, జాగ్రత్త

Fridge Explosion: ఫ్రిజ్‌ పేలే సంఘటనలు అప్పుడప్పుడు వింటూనే ఉంటాము. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇంట్లో కొన్నితప్పుల వల్ల ఫ్రిజ్ పేలే అవకాశం ఉంది. ఫ్రిజ్ వాడేటప్పుడు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన 7 ముఖ్యమైన విషయాలు ఇవే!

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 18 2026, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఫ్రిజ్ ఎందుకు పేలుతుంది?
Image Credit : Chatgpt

ఫ్రిజ్ ఎందుకు పేలుతుంది?

ఫ్రిజ్ పేలి ప్రమాదం సంభవించిన ఘటనలు మనం వింటూనే ఉంటాము. ఫ్రిజ్‌ పేలకుండా ఉండాలంటే కొన్ని తప్పులు చేయకూడదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రిజ్ లో వాడే కూలింగ్ గ్యాస్, కరెంట్ కనెక్షన్, కంప్రెసర్ లాంటి వాటిలో వచ్చే సమస్యలు మంటలు లేదా పేలుడుకు దారితీస్తాయి.

ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న కొత్త ఫ్రిజ్‌లలో R600a (ఐసోబ్యూటేన్) అనే కూలింగ్ గ్యాస్ వాడుతున్నారు. ఇది త్వరగా మంటలు అంటుకునే గ్యాస్. కూలింగ్ సిస్టమ్ పాడైపోయి ఈ గ్యాస్ లీక్ అయినప్పుడు, దానికి చిన్న నిప్పురవ్వ తోడైనా కూడా పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. అందుకే ఫ్రిజ్ విషయంలో మనం ఏయే తప్పులు చేయకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కరెంట్ వైర్లు డ్యామేజ్ అయితే?
Image Credit : pinterest

కరెంట్ వైర్లు డ్యామేజ్ అయితే?

ఫ్రిజ్ కరెంట్ వైర్ లేదా ప్లగ్ దగ్గర కట్ అయినట్లున్నా, ప్లాస్టిక్ కరిగినట్లున్నా, కాలిన గుర్తులు ఉంటే లైట్ తీసుకోవద్దు. డ్యామేజ్ అయిన వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి విపరీతమైన వేడి పుడుతుంది. దీనివల్ల ఫ్రిజ్‌కు మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. వైర్ పాడైపోతే మీరే సొంతంగా టేప్ చుట్టి వాడకండి. మంచి ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి రిపేర్ చేయించడం చాలా సేఫ్. ప్లగ్ లేదా సాకెట్ ఎక్కువగా వేడెక్కుతున్నా సరే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.

ఫ్రిజ్ పెట్టిన సాకెట్‌లోనే మల్టీప్లగ్ లేదా ఎక్స్‌టెన్షన్ బోర్డ్ పెట్టి మిక్సీ, మైక్రోవేవ్, కుక్కర్ లాంటివి వాడటం వాడడం మంచిది కాదు. ఒకే కనెక్షన్‌పై ఎక్కువ లోడ్ పడితే సాకెట్ లేదా ప్లగ్ బాగా వేడెక్కి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది.

అందుకే ఫ్రిజ్‌కు ఎప్పుడూ గోడకు ఉండే క్వాలిటీ సాకెట్‌ను మాత్రమే వాడటం సేఫ్. ఫ్రిజ్ కంపెనీలు కూడా ఎక్స్‌టెన్షన్ బోర్డులు వాడొద్దని, ఫ్రిజ్‌కు సపరేట్ సాకెట్ మాత్రమే వాడాలని చెబుతున్నాయి.

33
ఫ్రిజ్‌లో ఐస్‌ను కత్తితో పొడవకూడదు
Image Credit : AI Image

ఫ్రిజ్‌లో ఐస్‌ను కత్తితో పొడవకూడదు

పాత మోడల్ ఫ్రిజ్‌లలో ఫ్రీజర్ నిండా ఐస్ గడ్డకట్టడం కామన్. ఆ ఐస్‌ను త్వరగా తీసేయాలని చాలామంది కత్తి లేదా పదునైన వస్తువులతో పొడుస్తుంటారు. ఇది చాలా డేంజర్. ఐస్‌ను పగలగొట్టేటప్పుడు కత్తి పొరపాటున కూలింగ్ పైపుకు తగిలితే, అందులోని గ్యాస్ లీక్ అవుతుంది.

R600a లాంటి త్వరగా మంటలు అంటుకునే గ్యాస్ వాడే ఫ్రిజ్‌లలో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐస్ గడ్డకడితే మాన్యువల్‌లో చెప్పినట్లు డీఫ్రాస్ట్ బటన్ నొక్కి కరిగించండి. అంతేగానీ కత్తి, స్క్రూ డ్రైవర్ లాంటివి అస్సలు వాడకండి.

ఫ్రిజ్ కూలింగ్ సిస్టమ్ పాడైతే గ్యాస్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనుమానం వస్తే, ఫ్రిజ్ దగ్గర అగ్గిపెట్టె, లైటర్ లాంటివి అస్సలు వెలిగించొద్దు. అలాగే ఫ్రిజ్ కూలింగ్ పైపును మీరే సొంతంగా రిపేర్ చేయడానికి ట్రై చేయకండి.

గ్యాస్ లీక్ అవుతోందని డౌట్ వస్తే వెంటనే కిటికీలు, తలుపులు తీసి గాలి ఆడేలా చేయండి. ఆ తర్వాత టెక్నీషియన్‌ను పిలిపించి చెక్ చేయించండి. గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు నిప్పు పుట్టించే పనులు చేయకపోవడం చాలా ముఖ్యం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bread Idli: పప్పు నానబెట్టక్కర్లేదు.. పిండి రుబ్బక్కర్లేదు.. నిమిషాల్లో బ్రెడ్‌ ఇడ్లీ రెడీ!
Recommended image2
Rice: వైట్ రైస్ కాదు.. రెడ్ రైస్ , బ్లాక్ రైస్.. ఏది తినడం ఆరోగ్యానికి మంచిది?
Recommended image3
Hair Growth: ఒత్తైన జుట్టు కోసం.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!
Related Stories
Recommended image1
Chicken Curry Tips: చికెన్ కూర మరింత రుచిగా రావాలంటే సింపుల్ చిట్కాలు ఇవిగో
Recommended image2
Modi Food: ప్రధాని మోదీ ప్రతిరోజూ ఇష్టంగా తినే అయిదు ఆహారాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved