MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Bigg Boss Agnipariksha: ఏంటి నీకు సుఖాలు కావాలా ? కంటెండర్ ని గెంటేసిన శ్రీముఖి.. ఏం జరిగిందో తెలుసా

Bigg Boss Agnipariksha: ఏంటి నీకు సుఖాలు కావాలా ? కంటెండర్ ని గెంటేసిన శ్రీముఖి.. ఏం జరిగిందో తెలుసా

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో ఏడవ ఎపిసోడ్ పూర్తయింది. ఈ ఎపిసోడ్ లో కొన్ని ఉత్కంఠకర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

3 Min read
Author : Tirumala Dornala
Published : Aug 21 2026, 08:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Agnipariksha
Image Credit : Jiohotstar

Bigg Boss Agnipariksha

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో ఏడవ ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది. చివరి ఎపిసోడ్ లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయని ఇద్దరు కంటెండర్స్ ని జ్యూరీ సభ్యులు స్టేజీపైకి పిలిచారు. వాళ్లిద్దరూ ఎవరో కాదు ఉటా అండ్ అపూర్వ. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరూ ఒక్కో కార్డుని ఎంచుకోవాలి. ఎవరి కార్డులో ఎగ్జిట్ అని ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఆ దురదృష్టం ఉటాకే తగిలింది. ఉటా ఎంచుకున్న కార్డులో ఎగ్జిట్ అని ఉంది. అపూర్వ ఎంచుకున్న కార్డులో స్టే అని ఉంది. దీనితో అపూర్వ సేవ్ అయింది. ఉటా మాత్రం ఎలిమినేట్ అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జపాన్ నుంచి వచ్చిన వ్యక్తి అవుట్
Image Credit : Jiohotstar

జపాన్ నుంచి వచ్చిన వ్యక్తి అవుట్

ఎక్కడో జపాన్ నుంచి వచ్చి తెలుగు నేర్చుకుని ఇంత కష్టపడిన ఉటాని జ్యూరీ సభ్యులు అభిజీత్, బిందు మాధవి, నవదీప్ అభినందించి వీడ్కోలు పలికారు. ఆ తర్వాత డేర్ ఆర్ డై లో భాగంగా వరుసగా టాస్కులు మొదలయ్యాయి. ముందుగా అత్యంత ఘాటైన ఘోస్ట్ పెప్పర్ చిల్లీతో టాస్క్ మొదలైంది. ఆ చిల్లీ భరించలేని కారంతో ఉంటుంది. ఈ టాస్క్ లో దీపక్, అమన్, సుమ, లయ పాల్గొన్నారు. వీళ్ళు ముందుగా ఘోస్ట్ పెప్పర్ చిల్లీ తిని ఆ తర్వాత బెలూన్స్ ఊది పగలగొట్టాలి. కారాన్ని భరిస్తూ ఇది చేయాలి.

Related Articles

Related image1
Pawan - Allu Aravind: పవన్ కళ్యాణ్ కాలెత్తడం అల్లు అరవింద్ కి నచ్చలేదా ? తొలగించాలని అనుకున్నారు.. కానీ
Related image2
Chandra Mohan: ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు, తండ్రి మిగిల్చిన మందు తాగుతూ..అందుకే నా కూతుళ్ళని దూరంగా ఉంచా
35
క్లాస్ పీకిన అభిజీత్
Image Credit : Jiohotstar

క్లాస్ పీకిన అభిజీత్

ఈ టాస్క్ లో దీపక్ విజయం సాధించారు. అమన్ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టాడు. నెక్స్ట్ టాస్క్ లో అబ్బాయిలు పియర్సింగ్ చేయించుకోవాలి. చెవి, ముక్కు, ఐబ్రోస్ లలో రెండు భాగాలు ఎంచుకుని పియర్సింగ్ చేయించుకోవాలి. ఈ టాస్క్ లో రోహిత్, హేమంత్ పాల్గొన్నారు. వీళ్ళిద్దరూ ముక్కు కుట్టించుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఎవరైతే ముక్కుకి ఓకె అని అంటారో వాళ్ళని విన్ చేద్దాం అని అనుకున్నా అంటూ బిందు మాధవి పేర్కొంది. దీనితో హేమంత్ వెంటనే నాకు ఓకె అని చెప్పాడు. రోహిత్ మాత్రం అంగీకరించలేదు. రోహిత్ ఆసక్తి చూపించకపోవడం అభిజీత్ కి నిరాశ కలిగించింది. వీళ్లంతా నిన్ను వద్దన్నారు. అయినా కూడా గ్రీన్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను. నన్ను నువ్వు డిసప్పాయింట్ చేశావు అంటూ అభిజీత్ క్లాస్ పీకాడు.

45
ఏంటి నీకు సుఖాలు కావాలా ? వెళ్ళిపో
Image Credit : Jiohotstar

ఏంటి నీకు సుఖాలు కావాలా ? వెళ్ళిపో

అసలు అగ్నిపరీక్షకు ఎందుకు వచ్చావ్ అంటూ శ్రీముఖి ఫైర్ అయింది. రోహిత్ ఆలోచించడానికి వచ్చాడు అంటూ నవదీప్ సెటైర్లు వేశారు. మొత్తంగా ఈ టాస్క్ లో హేమంత్ విజయం సాధించాడు. నెక్స్ట్ టాస్క్ లో రుచిత, ప్రియాంకకి అవకాశం ఇచ్చారు. కాళ్ళని గట్టిగా టై చేస్తారు. అలాగే వెళ్లి బకెట్స్ లో వాటర్ నింపాలి. అంత గట్టిగా కడితే ఎలా అంటూ రుచిత చిరాకు ప్రదర్శించింది. ఆమె యాటిట్యూడ్ శ్రీముఖికి కోపం తెప్పించింది. గట్టిగా అంటావ్ ఏంటి.. గట్టిగా ఉండాలి అనే కడుతున్నాం. నీకు అగ్నిపరీక్షలా కంఫర్ట్స్, సుఖాలు కావాలా ? అయితే టాస్క్ నుంచి వెళ్ళిపో అంటూ గెంటేసింది. దీనితో రుచిత ఛాన్స్ కోల్పోయింది. వెంటనే ఆ అవకాన్ని శ్రీముఖి ఝాన్సీకి ఇచ్చింది. రుచిత వెళ్లిపోవడంతో వచ్చిన ఝాన్సీ అనూహ్యంగా టాస్క్ లో విజయం సాధించింది. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. ఆయా తర్వాత బాడీకి క్లిప్స్ పెట్టుకునే టాస్క్ లో రోహిత్ విజయం సాధించాడు. ఎట్టకేలకు రోహిత్ తనని తాను నిరూపించుకోవడంతో అంతా అభినందించారు. చివరి టాస్క్ అపూర్వ, రుచిత మధ్య జరిగింది. ఇది ఐస్ బాత్ టాస్క్. ఇందులో అపూర్వ విజయ సాధించింది.

55
టాప్ 15లో మరికొందరికి ఛాన్స్
Image Credit : Jiohotstar

టాప్ 15లో మరికొందరికి ఛాన్స్

చివర్లో జ్యూరీ సభ్యులు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫైనల్ టాప్ 15 కంటెస్టెంట్స్ ని ఎంపిక చేశారు. ఆల్రెడీ కొంత మంది టాప్ 15 లో అవకాశం సాధించారు. ఈ రోజు మరికొందరిని ప్రకటించడంతో ఫైనల్ టాప్ 15 లిస్ట్ రెడీ అయింది. అంటే ఇక నుంచి అసలైన అగ్నిపరీక్ష మొదలవుతుంది. అగ్ని పరీక్ష టాప్ 15 కంటెస్టెంట్స్ లో ఈ రోజు హేమంత్, అమన్, అపూర్వ, దీపక్, ప్రియాంక, ఝాన్సీ, రోహిత్, గాయత్రీ అవకాశం పొందారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakash Raj: నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ఓటర్ ఐడీలు, ప్రకాష్ రాజ్ అరెస్ట్ .. నాన్ బెయిలబుల్ వారెంట్
Recommended image2
Vijay London Trip: బ్రిటన్‌లో ఫ్యామిలీ రీయూనియన్? భార్య సంగీతను కలవనున్న సీఎం విజయ్?
Recommended image3
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా
Related Stories
Recommended image1
Pawan - Allu Aravind: పవన్ కళ్యాణ్ కాలెత్తడం అల్లు అరవింద్ కి నచ్చలేదా ? తొలగించాలని అనుకున్నారు.. కానీ
Recommended image2
Chandra Mohan: ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు, తండ్రి మిగిల్చిన మందు తాగుతూ..అందుకే నా కూతుళ్ళని దూరంగా ఉంచా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved