MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: జగతి, మహేంద్రలకు యాక్సిడెంట్.. టెన్షన్ పడుతున్న రిషి వసుధార?

Guppedantha Manasu: జగతి, మహేంద్రలకు యాక్సిడెంట్.. టెన్షన్ పడుతున్న రిషి వసుధార?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 24 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Nov 24 2022, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈరోజు ఎపిసోడ్లో జగతి బంధాల మధ్య గెలుపు ఓటమి లు ఉండవు అని అంటుంది. లేదు జగతి ఇన్ని రోజులు మనం రిషిని బాధ పెట్టాము కానీ మనం అనుకున్నది సాధించలేకపోయాము అని అంటాడు మహేంద్ర. మహేంద్ర ఒకరకంగా చెప్పాలి అంటే దేవయాని అక్కయ్య ఓడిపోయింది. రిషి నిన్ను రమ్మన్నాడు నీకోసం ఎదురు చూస్తుంటాడు అని ధైర్యం చెబుతుంది జగతి. ఇంకేం మాట్లాడకు మహేంద్ర నీకోసం అక్కడ రిషి ఎదురు చూస్తూ ఉంటాడు వెళ్దాం పద అని జగతి దంపతులు అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొకవైపు రిషి మహేంద్ర వస్తున్నాడు అన్న ఆనందంలో మహేంద్ర రూమ్ ని మొత్తం క్లీన్ చేస్తూ సర్దుతూ ఉంటాడు.

25

ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది. ఏంటి సార్ రాత్రంతా నిద్ర పోలేదా అని అడగగా లేదు వసుధార నిద్ర పట్టడం లేదు డాడ్ రాగానే ఎదురు వెళ్లి హగ్ చేసుకుని డాడ్ కి వెల్కమ్ చెప్పాలని ఉంది అని ఆనందంతో మాట్లాడతాడు రిషి. అప్పుడు వసుధార తన మనసులో మహేంద్ర సార్ తిరిగి రాకపోతే రిషి సార్ ఏమవుతాడో తలుచుకుంటేనే భయమేస్తుంది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మనుషులు దూరమైతే ఆ విలువ ఏంటో మనకు తెలిసి వస్తుంది. ఇంకెప్పుడు డాడ్ ని నా నుంచి దూరంగా వెళ్ళనివ్వను అనుకొని సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు విషయం.
 

35

మరొకవైపు దేవయాని వదిలింది అనుకున్నా పీడ మళ్ళీ వస్తుందా వాళ్ళిద్దరు వెళ్ళిపోతే రిషి నా గుప్పెట్లో ఉంటాడని అనుకున్నాను కానీ వీళ్ళు మళ్ళీ వస్తున్నారు అనుకొని కోపంతో తగిలి పోతూ ఉంటుంది దేవయాని. మరుసటి రోజు ఉదయం జగతీ మహేంద్ర ఇద్దరూ సంతోషంగా రిషి దగ్గరికి కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు వారిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక లారీ ఎదురుగా రావడంతో జగతి వాళ్ళ కారుకి ఆక్సిడెంట్ అవుతుంది. మరొకవైపు రిషి మహేంద్ర వాళ్ళ కోసం టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు.
 

45

జగతి మహేంద్ర కు యాక్సిడెంట్ కావడంతో వారిని హాస్పటల్లోకి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత రిషి మహేంద్ర వాళ్ళు రాలేదు అని దేవయాని ధరణి ఇవ్వాలని మీకు కాల్ చేశారా అని అడుగుతూ టెన్షన్ పడుతూ ఉండగా దేవయాని రావాలి అనుకుంటే వస్తారు అంటూ రిషి మనసుని గాయపరిచే విధంగా మాట్లాడుతుంది. మరొకవైపు గౌతమ్ ఇంకా అంకుల్ వాళ్ళు రాలేదేంటి అనుకుంటూ ఉండగా ఇంతలో గౌతమ్ కి హాస్పటల్ నుంచి ఫోన్ చేసి యాక్సిడెంట్ అయింది అని చెప్పడంతో గౌతమ్ షాక్ అవుతాడు. అప్పుడు ఎవరికి ఆక్సిడెంట్ అయ్యింది అనుకోని గౌతమ్ టెన్షన్ గా హాస్పిటల్ కి వెళ్తాడు.
 

55

తర్వాత వసుధార రిషి ఇద్దరు టెన్షన్ పడుతూ మహేంద్ర వాళ్ళ కోసం ఎదురు చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత గౌతమ్ రిషికి ఇలా ఆక్సిడెంట్ అయింది నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఆ తర్వాత రిషి మహేంద్ర గురించి ఆలోచిస్తూ నిజంగా డాడ్ వస్తారా లేకపోతే ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అని అనుకుంటూ ఉంటాడు. లేదు లేదు డాడ్ అలా అనుకోరు నాకోసం కచ్చితంగా వస్తారు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వసు అక్కడికి కాఫీ తీసుకొని రావడంతో లేదు వసుధార డాడీ తో కలిసి కాఫీ తాగుతాను అని సంతోషంగా మాట్లాడతాడు. మరొకవైపు గౌతమ్ హాస్పిటల్ కి వెళ్తాడు. అప్పుడు గౌతమ్ మహేంద్ర జగతిలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత రిషికి గౌతమ్ ఫోన్ చేస్తుండగా దేవయాని ఫోన్ లిఫ్ట్ చేసి గౌతమ్ ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత గౌతమ్ పదేపదే ఫోన్ చేస్తూ ఉంటాడు.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Khushbu Sundar Weight Loss: ఖుష్బూ చెప్పిన ఈ పనిచేస్తే చాలు మీరు ఏనుగులా ఉన్నా సరే దెబ్బకి స్లిమ్‌ అయిపోతారు
Recommended image2
Raghavendra Raoకి మాటిచ్చి ఆ కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Recommended image3
Most Expensive Songs: ఇండియన్ సినిమాలో 8 ఖరీదైన పాటలు.. నెం.1 అమీర్, షారుఖ్ కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved