MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?

Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?

చిరంజీవి తన పుట్టిన ఊరు మొగల్తూరులో ఇంటిని లైబ్రరీకి ఇమ్మంటే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇంటిని అమ్మేసుకున్నారట. దీంతో దారుణంగా ట్రోల్‌ అయ్యారు. దీనిపై చిరంజీవి స్పందించి వివరణ ఇచ్చారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 07 2026, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అవమానాలు దాటుకొని మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి
Image Credit : Asianet News

అవమానాలు దాటుకొని మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి ఎన్నో స్ట్రగుల్స్ పడి సినిమాల్లో రాణించారు. వరుస విజయాలు అందుకొని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్‌గా ఎదిగారు. తన జర్నీలో చిరంజీవి చాలా అవమానాలు ఫేస్‌ చేశారు. ప్రీమియర్స్ షో వేస్తే ఓ హీరో తనని దారుణంగా అవమానించాడట. అంతేకాదు లేట్‌గా షూటింగ్‌కి వచ్చాడని ఓ నిర్మాత రోజంతా ఎండలో నిల్చోబెట్టారట. ఇలాంటివి చాలానే ఉన్నాయి. కానీ వాటిని కసిగా తీసుకొని తానేంటో నిరూపించుకొని ఇప్పుడు తిరుగులేని మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
3లక్షలకే ఇంటిని అమ్మేసిన చిరంజీవి
Image Credit : Asianet News

3లక్షలకే ఇంటిని అమ్మేసిన చిరంజీవి

ఇదిలా ఉంటే పెద్ద స్టార్‌ అయ్యాక చిరంజీవి చేసిన ఒక పని ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఒక నిందని ఇప్పటి వరకు మోస్తున్నారు. మరి అదేంటంటే.. మొగల్తూరులో చిరంజీవికి సంబంధించి ఒక ఇళ్లు ఉంది. అక్కడి వారు లైబ్రరీ కోసం ఇమ్మని అడిగారట. వాళ్లు ఫోర్స్ చేస్తుంటే, చిరంజీవి ఆ ఇంటిని అమ్మేశారట. మూడు లక్షలకే ఆ ఇంటిని అమ్మేశారట. మొదట ఇంటిని అమ్మమని మేనేజర్లకి చెబితే ఇంకా అమ్మలేదట. ఈ విషయంపై ఆయన సీరియస్‌ కూడా అయ్యారట. చివరికి ఎట్టకేలకు మూడు లక్షలకు అమ్ముకున్నారని, లైబ్రరీకి ఇవ్వలేదని, సినిమాల ద్వారా కోట్లు సంపాదించే చిరంజీవి.. 3 లక్షలకే కక్కుర్తి పడితే ఇక జనాలకు ఏం సర్వీస్‌ చేస్తారని ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శించారట.

Related Articles

Related image1
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Related image2
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
34
చిరంజీవి వివరణ
Image Credit : Asianet News

చిరంజీవి వివరణ

తాజాగా ఈ ప్రశ్న చిరంజీవికి ఎదురైంది. దీనిపై ఆయన స్పందించారు. ఇన్నాళ్లు దీనిపై స్పందించని ఆయన ఎట్టకేలకు ఓపెన్‌ అయ్యారు. ఈ విషయం తన వరకు వచ్చిందని చెప్పారు. అయితే ఆ ప్రాపర్టీ తనది కాదని, అది తన మామయ్య(అమ్మ వాళ్ల తమ్ముడు)ది అని చెప్పారు. వాళ్ల ప్రాపర్టీపై తనకు ఎందుకు హక్కు ఉంటుంది, అది తనది ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి వార్తలు, ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తారో అర్థం కాదు, బూరదజల్లే ప్రయత్నమే కాని, ఇది మరోటి కాదన్నారు చిరంజీవి. అది తన మామయ్యది కావడంతో ఆయన అమ్ముకున్నారని, దానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఈ ప్రచారం చేశారని తెలిపారు. అయితే దీని వల్లే ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో చాలా బ్యాడ్‌ అయ్యిందట. పార్టీపై ప్రభావం చూపించిందట.

44
మొగల్తూరులో సొంతంగా లైబ్రరీ కట్టించిన చిరంజీవి
Image Credit : Asianet News

మొగల్తూరులో సొంతంగా లైబ్రరీ కట్టించిన చిరంజీవి

ఈ విషయంలోనే చిరంజీవి తన గొప్ప మనసుని చాటుకున్నారు. అదే మొగల్తూరులో తన ఫ్రెండ్‌ సత్యం(పండరి) సహకారంతో తాను సొంతంగా ఒక లైబ్రరీ నిర్మించారట. దానికి చిరంజీవి గ్రాంథాలయం అనే పేరు కూడా పెట్టారు. ఇప్పటికీ అది వాడుకలో ఉంది. తాను పుట్టిన ఊరుకోసం ఇంత చేసినా, ఆయన మాత్రం ఈ నిందని మోస్తూనే ఉన్నారు.

ఇక ప్రస్తుతం చిరంజీవి `కాకా` అనే చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. వచ్చే సంక్రాంతికి ఇద విడుదల కానుంది. మరోవైపు `విశ్వంభర` మూవీ విడుదల కావాల్సి ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image2
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Recommended image3
Telugu Actress Arrest : చిరంజీవితో కలిసి కామెడీ పండించిన తెలుగు నటి అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Recommended image2
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved