యాంకర్ సుధీర్ రెడ్డికి సోషల్ మీడియాలో బాగానే క్రేజ్ ఉంది. ఆయనకు వారానికి రూ.2లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం.
అగ్నిపరీక్ష ద్వారా అందరి హృదయాలను దోచిన సృష్టి వ్యాకరణం కి వారానికి 70 లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారట.
రైతుగా.. అగ్నిపరీక్ష లోకి అడుగుపెట్టిన ఝాన్సీ.. తన ఆటతో ఏకంగా బిగ్ బాస్ లోకి వెళ్లడానికి టికెట్ సంపాదించింది. ఆమెకు కూడా వారానికి రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు అందించనున్నారు.
ఒకప్పుడు నటుడుగా మంచి గుర్తింపు సాధించిన కృష్ణుడు.. చాలా గ్యాప్ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. ఇతనికి వారానికి రూ.3లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.
సీరియల్ నటిగా దేబ్జానీకి మంచి క్రేజ్ ఉంది. అందం, నటనతో ఆకట్టుకునే దేబ్జానీకి వారానికి రూ.3.5లక్షలు ఇస్తున్నారని సమాచారం.
ఒకప్పుడు సీరియల్స్ తో వరసగా దూసుకుపోయిన చైత్రా రాయ్.. ఇటీవల గ్యాప్ ఇచ్చింది. ఇద్దరు పిల్లల తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఆమెకు రూ.2.25లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.
యంగ్ హీరో త్రిగుణ్ కి కూడా భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. వారానికి రూ.3లక్షల రెమ్యూనరేషన్.
టెంపర్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు వంశీ కి రూ.2 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.
అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన అమన్ కి రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.
యాంకర్ వర్షిణి కి రూ.3.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.
జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ కి భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు. రూ.3.5లక్షల నుంచి రూ.4లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.
అగ్ని పరీక్షలో అందంతో అందరినీ ఆకట్టుకున్న శాలినీ కి రూ.75వేల నుంచి రూ.లక్ష వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.
అగ్ని పరీక్షలో అందరి కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న రోహిత్ నాయుడు కి.. ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారు. రూ.1.5లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.
ఆర్జే చరణ్ కూడా అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. ఇతనికి కూడా రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.
బుల్లితెరపై ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న నటుడు ముఖేష్ గౌడ. అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ముఖేష్ కే ఇవ్వడం విశేషం. వారానికి ఏకంగా రూ.4లక్షల వరకు ఇస్తున్నారు.