MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌

Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌

Kayadu Lohar: సినిమాల్లో అమ్మాయిలను కేవలం గ్లామర్ డాల్స్‌గా, ప్రేక్షకులను ఆకట్టుకునే వస్తువులుగా చూపించడాన్ని తాను ఒప్పుకోనని యంగ్ హీరోయిన్ కయదు లోహర్ స్పష్టం చేశారు.

2 Min read
Author : Aithagoni Raju| PTI
Published : Sep 07 2026, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌
Image Credit : instagram/@kayadu_lohar_official

బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌

సినిమాల్లో అమ్మాయిలను కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఓ అలంకార వస్తువులా చూపించడాన్ని నేను ఒప్పుకోను అని యంగ్ హీరోయిన్ కయదు లోహర్ తేల్చి చెప్పారు. కథకు అవసరమైతే, పాత్ర డిమాండ్ చేస్తే.. హద్దుల్లో ఉండి బోల్డ్ గా నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ కేవలం లైమ్‌లైట్ కోసం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కోసం అసభ్యకరమైన సీన్లలో నటించడం తన మనస్సాక్షికి విరుద్ధమని చెప్పారు. కయాడు ఇటీవల విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన `ఫంకీ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డ్రాగన్‌తో పాపులర్‌ అయిన కయాదు లోహర్‌
Image Credit : instagram/@kayadu_lohar_official

డ్రాగన్‌తో పాపులర్‌ అయిన కయాదు లోహర్‌

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన కయదు లోహర్.. కన్నడ, మలయాళం, తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో 'డ్రాగన్' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం నాని 'ది ప్యారడైజ్'తో పాటు సూర్య, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. సౌత్ ఇండియాలో అందం, అభినయం ఉన్న హీరోయిన్లకు కొదవ లేదు. కానీ తక్కువ టైంలోనే భాషతో సంబంధం లేకుండా మంచి కథలతో ప్రేక్షకులను మెప్పించడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి అరుదైన నటీమణుల్లో కయదు లోహర్ ఒకరు.

Related Articles

Related image1
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Related image2
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
35
మోడలింగ్‌ నుంచి కెరీర్‌ ప్రారంభం
Image Credit : instagram/@kayadu_lohar_official

మోడలింగ్‌ నుంచి కెరీర్‌ ప్రారంభం

అస్సాంలో పుట్టి, పుణెలో చదువు పూర్తి చేసిన కయదు.. మోడలింగ్ ద్వారా కెరీర్ మొదలుపెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె.. సినిమాల్లో మహిళల పాత్రల గురించి తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన కయదు.. సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను చూపించే విధానంపై ఓపెన్‌గా మాట్లాడారు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయడం కోసం అమ్మాయిలను అసభ్యంగా చూపించడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని చెప్పారు.

45
అమ్మాయిలను అందమైన బొమ్మలుగా చూపిస్తే ఒప్పుకోను
Image Credit : instagram/@kayadu_lohar_official

అమ్మాయిలను అందమైన బొమ్మలుగా చూపిస్తే ఒప్పుకోను

'సినిమాల్లో అమ్మాయిలను కేవలం ఓ అందమైన బొమ్మలా, అలంకార వస్తువులా చూపించడాన్ని నేను ఒప్పుకోను. ఒక సీన్‌లో బోల్డ్‌నెస్ అనేది కథకు ఎంతవరకు అవసరం అన్నదే నాకు ముఖ్యం. పాత్రకు అవసరమైతే, హద్దుల్లో ఉండి నటించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కేవలం జనాలను ఆకట్టుకోవడానికే అసభ్యతను జోడిస్తే అలాంటి సినిమాలు నేను చేయను. అలాంటి సీన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వొచ్చు. కానీ ఒక నటిగా నా మనస్సాక్షికి ఏమాత్రం సంతృప్తి ఉండదు' అని కయదు వివరించారు.

55
వరుస అవకాశాలు
Image Credit : instagram/@kayadu_lohar_official

వరుస అవకాశాలు

'టైమ్స్ ఫ్రెష్ ఫేస్' పోటీలో గెలిచి అందరి దృష్టిని ఆకర్షించిన కయదు.. ఆ తర్వాత నటన వైపు అడుగులు వేశారు. కన్నడలో 'ముగిల్‌పేట' సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మలయాళంలో చారిత్రక చిత్రం `నూట్టాండు'లో 'నంగేలి' పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తెలుగులో శ్రీవిష్ణు సరసన 'అల్లూరి' సినిమాలో కనిపించారు. తర్వాత విశ్వక్ సేన్ 'ఫంకీ' ప్రాజెక్ట్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తమిళంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన 'డ్రాగన్' సినిమా కయదు కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. ఈ చిత్రంలోని 'పల్లవి' పాత్ర సోషల్ మీడియాలో సెన్సేషన్ అవ్వడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని పక్కన పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ 'ది ప్యారడైజ్'లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే తమిళంలో సూర్య (సూర్య 48), శింబు, సూపర్‌స్టార్ రజినీకాంత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. దీంతో ప్రస్తుతం సౌత్ ఇండియాలో కయదు లోహర్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Telugu Actress Arrest : చిరంజీవితో కలిసి కామెడీ పండించిన తెలుగు నటి అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image3
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Related Stories
Recommended image1
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image2
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved