MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Soundarya: సౌందర్య చనిపోయిందని నమ్మలేక రెండేళ్లపాటు అభిమానులు చేసిన పని ఇదే.. అమ్మ బయటపెట్టిన నిజం

Soundarya: సౌందర్య చనిపోయిందని నమ్మలేక రెండేళ్లపాటు అభిమానులు చేసిన పని ఇదే.. అమ్మ బయటపెట్టిన నిజం

సౌందర్య హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కానీ ఆమె లేరనే వార్తని నమ్మలేని అభిమానులు ఏం చేశారో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు. రెండేళ్లపాటు అదే పని.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 19 2026, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అద్భుతమైన నటనకు కేరాఫ్‌ సౌందర్య
Image Credit : MAA TV

అద్భుతమైన నటనకు కేరాఫ్‌ సౌందర్య

సహజమైన నటనకు కేరాఫ్‌, అద్భుతమైన నటనకే కాదు, అంతే సహజమైన అందానికి కేరాఫ్‌ సౌందర్య. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోవడం ఆమె ప్రత్యేకత. మన పక్కింటి అమ్మాయిగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అద్భుతమైన నటనతో మెప్పిస్తుంది. ఆమె మరణించి 22 ఏళ్లు అయిపోయినా ఇంకా సౌందర్య మన మదిలో తిరుగుతూనే ఉంది. తన సినిమాలతో మన మధ్యనే ఉన్నట్టుగా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చీరకే అందం తెచ్చిన నటి సౌందర్య
Image Credit : MAA TV

చీరకే అందం తెచ్చిన నటి సౌందర్య

సౌందర్య చీరకట్టులో కనిపించి ఆకట్టుకుంది. గ్లామర్‌ ప్రపంచంలో, మిగిలిన హీరోయిన్లు అందాల ఆరబోతలో పోటీపడుతుంటే, తాను మాత్రం ఎలాంటి ఎక్స్ పోజింగ్‌కి తావు లేకుండా చీరకట్టులోనే కనిపిస్తూ ఆకట్టుకుంది. చీరకే అందాన్ని తీసుకొచ్చేది. అందం అనే ఆలోచనే రాకుండా చేసింది. అది సౌందర్య స్పెషాలిటీ. అయితే అప్పట్లో సౌందర్యకి వీరాభిమానులు ఉండేవారు. ఆమె స్టార్‌గా రాణించే సమయంలో ఆమె ఇంటికి వచ్చి పోతుండేవారట. ఆమెని చూడాలని తపిస్తుండేవారట. కానీ సౌందర్య చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేక వాళ్లు దాదాపు రెండేళ్లపాటు తన ఇంటి చుట్టూ తిరిగేవారట.

35
రెండేళ్లపాటు సౌందర్య ఇంటి చుట్టూ తిరిగిన అభిమానులు
Image Credit : MAA TV

రెండేళ్లపాటు సౌందర్య ఇంటి చుట్టూ తిరిగిన అభిమానులు

సౌందర్య అమ్మ మంజుల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఈ మధ్య వెల్లడించారు. `సౌందర్య మరణించిన తర్వాత కూడా దాదాపు రెండేళ్లపాటు వివిధ రాష్ట్రాల నుంచి అభిమానులు బెంగళూరులోని తన ఇంటికి వచ్చేవారు. సౌందర్య లేరనే విషయాన్ని నమ్మలేక ఆమెని ఒక్కసారైనా చూడాలనే కోరికతో, ఆమె లేరని తెలిసినా కూడా ఇంటి గేటు బయట నిలబడేవారు. అది నా కూతురు సంపాదించుకున్న ప్రేమ` అని ఆమె ఎంతో భావోద్వేగంగా వెల్లడించారు. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

45
హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సౌందర్య
Image Credit : MAA TV

హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సౌందర్య

సౌందర్య.. 2004లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం వెళ్లింది. ఈ క్రమంలోనే హెలికాఫ్టర్‌ ప్రమాదానికి గురైంది. కిందపడిపోయి కాలిపోయింది. అందులోనే సౌందర్య, ఆమె సోదరుడు అమర్‌ కూడా కన్నుమూశారు. వీరి మరణం అప్పట్లో టాలీవుడ్‌ ఇండస్ట్రీని కలిచివేసింది. ఇండస్ట్రీ వర్గాలే జీర్ణించుకోలేకపోయారు. ఇక అభిమానుల గురించి ఏం చెబుతాం. చాలా రోజుల వరకు వాళ్లు సౌందర్య లేరనే నిజాన్ని నమ్మలేకపోయారు. అందుకే ఇలా సౌందర్యని ఒక్కసారైనా చూద్దామని వారి ఇంటికి వెళ్లేవారట. అలా రెండేళ్లు తిరిగారట. ఆ తర్వాత రావడం మానేశారని సౌందర్య తల్లి వెల్లడించారు. ఆమె మాటలు ఇప్పుడు అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తుండటం విశేషం.

55
సౌందర్య నటించిన తెలుగు సినిమాలు
Image Credit : MAA TV

సౌందర్య నటించిన తెలుగు సినిమాలు

సౌందర్య తెలుగులో అనేక సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. మొదటగా తెలుగులో ఆమె `మనవరాలి పెళ్ళి` చిత్రంలో నటించారు. టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. ఆ తర్వాత `రాజేంద్రుడు గజేంద్రుడు`, `మాయలోడు`, `నెంబర్‌ వన్‌`, `హలో బ్రదర్‌`, `అల్లరి ప్రేమికుడు`, `సూపర్‌ పోలీస్‌`, `మా వూరి మారాజు`, `మేడం`, `అమ్మదొంగ`, `టాప్‌ హీరో`, `చిలకపచ్చ కాపురం`, `పెదరాయుడు`, `భలే బుల్లోడు`, `అమ్మోరు`, `రిక్షావోడు`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `పవిత్రబంధం`, `పెళ్లి చేసుకుందాం`, `ఆరో ప్రాణం`, `రాయుడు`, `చూడాలని వుండి`, `శ్రీరాములయ్య`, `శుభవార్త`, `అంతపురం`, `రాజా`, `అనగనగా ఒక అమ్మాయి`, `అన్నయ్య`, `రవన్న`, `పోస్ట్ మ్యాన్‌`, `మూడు ముక్కలాట`, `నిన్నే ప్రేమిస్తా`, `అజాద్‌`, `జయం మనదేరా`, `దేవిపుత్రుడు`, `ఎదురులేని మనిషి`, `శ్రీమంజునాథ`, `అధిపతి`, `కొండవీటి సింహాసనం`, `సీతయ్య`, `స్వేతనాగు` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది సౌందర్య. తెలుగులోనే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది సౌందర్య.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సౌందర్య
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు
Recommended image2
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Recommended image3
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Related Stories
Recommended image1
Krishnam Raju: ఇండస్ట్రీకి కృష్ణంరాజు పెట్టిన రూల్‌ ఏంటో తెలుసా? ఆ నెల రోజులు ఎవరూ ఆయన్ని టచ్‌ చేయలేరు
Recommended image2
Suriya Jyothika Wedding: స్కాట్లాండ్ కోటలో సూర్య-జ్యోతిక మళ్లీ పెళ్లి.. ఖర్చు మాత్రం అస్సలు ఊహించరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved