MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishnam Raju: ఇండస్ట్రీకి కృష్ణంరాజు పెట్టిన రూల్‌ ఏంటో తెలుసా? ఆ నెల రోజులు ఎవరూ ఆయన్ని టచ్‌ చేయలేరు

Krishnam Raju: ఇండస్ట్రీకి కృష్ణంరాజు పెట్టిన రూల్‌ ఏంటో తెలుసా? ఆ నెల రోజులు ఎవరూ ఆయన్ని టచ్‌ చేయలేరు

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చారు. తన ప్రవర్తన మొత్తం అలానే ఉండేదట. అయితే ఓ దశలో ఆయన ఇండస్ట్రీకే రూల్‌ పెట్టాడట. నెల రోజులు మాత్రం తనని ఎవరూ టచ్‌ చేసేవారు కాదట.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 19 2026, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రెబల్‌ స్టార్‌గా రాణించిన కృష్ణంరాజు
Image Credit : Asianet News

రెబల్‌ స్టార్‌గా రాణించిన కృష్ణంరాజు

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు మాస్‌, యాక్షన్‌, రెబల్‌ సినిమాలతో నటించి మెప్పించారు. ఆయన తిరుగుబాటు నేపథ్యంలోని సినిమాలే కాదు, మహిళా ప్రధానమైన చిత్రాలు కూడా చేసి ఆకట్టుకున్నారు. తిరుగులేని రెబల్‌ స్టార్‌గా ఎదిగిన కృష్ణంరాజు తన లైఫ్‌లో ఒక నియమం పెట్టుకున్నారు. ఇండస్ట్రీకి కూడా అదే రూల్‌ని పెట్టాడు. ఒక నెల రోజులు మాత్రం ఆయన్ని టచ్‌ చేయడానికి లేదు. ఆ నెల రోజులు షూటింగ్‌లు బంద్‌. మరి ఇంతకి ఆ నియమం ఏంటి? ఎందుకు పెట్టుకున్నారనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నెల రోజులు షూటింగ్‌లు బంద్‌
Image Credit : Facebook/KrishnamRaju

నెల రోజులు షూటింగ్‌లు బంద్‌

కృష్ణంరాజు తనకు, ఇండస్ట్రీకి పెట్టిన నియమం నెల రోజులు షూటింగ్‌లు బంద్‌ పెట్టడం. ప్రతి ఏడాది ఆ నెల రోజులు షూటింగ్‌లకు దూరంగా ఉంటాడట. అది సమ్మర్‌లో కావడం విశేషం. సమ్మర్‌లో మే నెలలో రెబల్‌ స్టార్‌ సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండేవారట. ఆయా సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. దీంతో షూటింగ్‌లకు వెళ్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. తన గ్లామర్‌ దెబ్బతింటుందనే ఉద్దేశ్యంతో ఆయన సినిమాలకు దూరంగా ఉండేవారట. ఆయనతో ఎవరు సినిమాలు చేసినా ఆ సమయంలో మాత్రం షూటింగ్‌లు బంద్‌ పెట్టుకోవాల్సిందేనట. కొత్తవి అయితే మే తర్వాత ప్రారంభించడం, ఆల్‌రెడీ షూటింగ్‌ జరుగుతున్నవి అయితే నెల రోజులు గ్యాప్‌ ఇవ్వడం చేసేవారట.

34
మైసూర్‌లో గుమ్మడితో కృష్ణంరాజు గొడవ
Image Credit : our own

మైసూర్‌లో గుమ్మడితో కృష్ణంరాజు గొడవ

కృష్ణంరాజు ఒక స్టేజ్‌కి వచ్చాక ఈ నియమాన్ని పెట్టుకున్నారని, చివరి వరకు దాన్ని ఫాలో అయ్యారని ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. నెల రోజులపాటు సినిమాలకు దూరంగా ఉండేవారట. కూల్‌గా ఉండే గెస్ట్ హౌజ్‌లోనే ఉండి రెస్ట్ తీసుకునేవారని తెలిపారు. అయితే దాన్ని బ్రేక్‌ చేసి తాము ఒకసారి సినిమా తీసినట్టు తెలిపారు. తప్పదని రిక్వెస్ట్ చేయగా, మైసూర్‌లో షూటింగ్‌ పెట్టుకోమని చెప్పారట. అక్కడ అయితే కూల్‌గా ఉంటుంది, షూటింగ్‌ చేస్తానని చెప్పారట. దీంతో అక్కడే షూటింగ్‌ చేశారట. కానీ అందులో గుమ్మడి కీలక పాత్రలో నటించారు. కృష్ణంరాజు, గుమ్మడి మధ్య సన్నివేశాలున్నాయి. ఓ సీన్‌లో గుమ్మడికి కృష్ణంరాజు ఇలా నటించాలని సలహా ఇచ్చారట. దీంతో ఆయనకు మండిందట. నాకు చెప్పేంత నటుడివా అంటూ మండి పడ్డారట.

44
కేవీ చలం ఎంట్రీతో గొడవ సాల్వ్
Image Credit : our own

కేవీ చలం ఎంట్రీతో గొడవ సాల్వ్

దీంతో ఇద్దరి మధ్య గొడవ అయ్యిందని, షూటింగ్‌ ఆగిపోయిందని తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ అన్నయ్య దీనికి దర్శకుడు. ఆయన సాల్వ్ చేయాలని చూసినా వర్కౌట్‌ కాలేదు. దీంతో బయట కూర్చున్నాడట. అదే సమయంలో తాను వచ్చాడట. ఏం చేయాలని తాను కూడా ఆలోచిస్తున్న సమయంలోనే నటుడు కేవీ చలం వచ్చాడట. ఆయనకు జరిగిన విషయం చెప్పారట. ఓసి ఇంతేనా.. అని తాను సాల్వ్ చేస్తానని చెప్పి గుమ్మడి వద్దకు వెళ్లాడట. ఏమైందని అడగ్గా, ఆయన జరిగింది చెప్పాడు. ఓసీ ఇంతేనా.. వాడు నాకు రోజూ యాక్టింగ్‌ నేర్పిస్తాడని పంచ్‌ వేశాడట. దెబ్బకి గుమ్మడితోపాటు కృష్ణంరాజు నవ్వులు చిందించారు. సెట్‌ మొత్తం నవ్వింది, గొడవ సాల్వ్ అయ్యిందట. అలా ఆ ఒక్కసారి మాత్రమే కృష్ణంరాజు మేలో షూటింగ్‌ చేసినట్టు తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ. కృష్ణంరాజు రాజుల ఫ్యామిలీ కదా, ఆయన వ్యవహారం మొత్తం అలానే ఉంటుందని, రాజులానే ఉండేవారని తెలిపారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
కృష్ణంరాజు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
Hitler Movie Review: మోహన్ బాబు వల్ల డిజాస్టర్స్ నుంచి బయటపడ్డ చిరంజీవి, డైరెక్టర్ ను భయపెట్టిన మెగా ఫ్యాన్స్.. హిట్లర్ మూవీ రివ్యూ
Recommended image2
Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved