MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Megastar: 26 సినిమాల్లో రొమాన్స్ చేసిన హీరోయిన్ తో చిరంజీవికి పెద్ద గొడవ, మెగాస్టార్ భార్య సురేఖ ఏం చేసిందంటే?

Megastar: 26 సినిమాల్లో రొమాన్స్ చేసిన హీరోయిన్ తో చిరంజీవికి పెద్ద గొడవ, మెగాస్టార్ భార్య సురేఖ ఏం చేసిందంటే?

Megastar: చిరంజీవి తనతో 26 సినిమాల్లో నటించిన ఓ హీరోయిన్‌తో పెద్ద గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటలు లేవు.. మాట్లాడుకోవడాలు లేవు. సరిగ్గా అదే టైమ్‌లో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ భార్య సురేఖ ఏం చేసిందో తెలుసా? ఇంతకీ ఎవరా హీరోయిన్?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 04 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవితో 26 సినిమాలు చేసిన హీరోయిన్
Image Credit : our own

చిరంజీవితో 26 సినిమాలు చేసిన హీరోయిన్

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, వర్సటైల్ నటి రాధికా శరత్‌కుమార్‌ల కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సుమారు 26కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తెరపైనే కాకుండా తెర వెనుక కూడా వీరిద్దరి మధ్య ఎంతో అనుబంధం, స్నేహబంధం ఉంది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాధిక తమ సినీ ప్రయాణం, షూటింగ్ సమయంలో జరిగిన సరదా గొడవలు, చిరంజీవితో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిన్నపిల్లల్లా గొడవలు
Image Credit : our own

చిన్నపిల్లల్లా గొడవలు

మెగాస్టార్ చిరంజీవి, రాధిక చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉంటారు. చీటికిమాటికి తగవులాడుకుంటారు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు కూడా. ఈ క్రమంలో 'అభిలాష' సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సరదా సంఘటనను రాధిక గుర్తుచేసుకున్నారు. "యురేకా" పాట చిత్రీకరిస్తున్నప్పుడు చిరంజీవికి, తనకు మధ్య చిన్నపాటి వివాదం జరిగి కొన్ని రోజుల పాటు మాటలు బంద్ అయ్యాయని రాధిక అన్నారు. ఆ సమయంలో స్కూల్ పిల్లల్లా ఇద్దరం చిన్న చిన్న విషయాలకే గొడవ పడేవాళ్లమని నవ్వుతూ చెప్పారు.

35
సరేఖ సపోర్ట్ ఎవరికి?
Image Credit : Asianet News

సరేఖ సపోర్ట్ ఎవరికి?

సరిగ్గా అప్పుడే షూటింగ్ సెట్‌కి వచ్చిన సురేఖ (చిరంజీవి భార్య) మధ్యలో రెఫరీగా వ్యవహరిస్తూ, "రాధిక చాలా చిన్నపిల్ల, తనతో ఎందుకు గొడవపడతారు?" అని చిరంజీవికి నచ్చజెప్పేవారట. గొడవ పడిన రెండు మూడు రోజులకే మళ్లీ ఏమీ జరగనట్లు సాధారణంగా మాట్లాడుకుని ఫ్రెండ్స్ అయిపోయేవాళ్లమని రాధిక అన్నారు.

45
మెగా ఫ్యామిలీతో ప్రత్యేకమైన బాండింగ్
Image Credit : instagran /Radhika Sarathkumar

మెగా ఫ్యామిలీతో ప్రత్యేకమైన బాండింగ్

రాధిక మాట్లాడుతూ.. ''మేమిద్దరం ఒకే సమయంలో పరిశ్రమలోకి వచ్చి ఎదిగాము, అందుకే మా మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. ఈ ఫ్రెండ్‌షిప్ వల్లే ఎక్కడ కలిసినా, వేడుకల్లో, పబ్లిక్ ఈవెంట్లలో చాలా క్లోజ్‌గా ఉంటాము.. మా ఇద్దరి లాంగ్వేజ్ మాకే అర్థమవుతుంది. చిరంజీవి నన్ను ఎప్పుడూ సరదాగా రౌడీ అని ఆటపట్టిస్తుంటారు, కానీ నేను చాలా మంచి అమ్మాయిని'' అని రాధిక సరదాగా వ్యాఖ్యానించారు.

55
చిరంజీవి ఎదుగుదలపై గర్వం
Image Credit : our own

చిరంజీవి ఎదుగుదలపై గర్వం

చిరంజీవి స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్‌గా మారిన విధానం పట్ల రాధిక అపారమైనఅభిమానం, గర్వం వ్యక్తం చేశారు. "చిరంజీవి చేసినంత కష్టపడే స్వభావం, అంకితభావం ఉన్న నటుడిని నేను ఇంతవరకు చూడలేదు. ఆయన పడే కష్టమే ఆయన్ను ఈ స్థాయికి తీసుకెళ్లింది" అని రాధిక కొనియాడారు. ఇప్పటికీ చిరంజీవి నటించిన ఏదైనా సినిమా నచ్చితే వెంటనే ఫోన్ చేసి తన ఆనందాన్ని, గర్వాన్ని పంచుకుంటానని చెప్పారు. అంతేకాకుండా, రామ్ చరణ్ నటించిన 'RRR' సినిమా చూసిన తర్వాత కూడా ఎంతగానో ముచ్చటపడ్డానని, తాము చూస్తూ పెంచిన చిన్నపిల్లలు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఎంతో గర్వకారణంగా ఉందంటూ రాధిక ఆనందం వ్యక్తం చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Trigun: సొంత టీంకే వెన్నుపోటు, త్రిగుణ్ దెబ్బకు మారిపోయిన ఆట..కెప్టెన్ గా అవతరించిన రామ్ ప్రసాద్
Recommended image2
Ramayana:హైదరాబాద్ లో రామాయణ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్..రణబీర్, యశ్ తోపాటు టీమ్ మొత్తం రెడీ
Recommended image3
Yash: సంచలనం సృష్టిస్తున్న సినిమాకు రాకింగ్ స్టార్ యశ్ సపోర్ట్.. ఫొటోలు చూసేయండి!
Related Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Ram Charan: 30 ఏళ్ల వయసులో రామ్ చరణ్ చేసిన పనికి.. నిర్మాత బండ్ల గణేష్ కు కన్నీళ్లు ఆగలేదు.. ఏం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved