MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?

Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?

మమితా బైజు, నివిన్‌ పౌలీ జంటగా, ఫహద్‌ ఫాజిల్‌ నిర్మాణంలో తెరకెక్కిన `బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌` మూవీ మలయాళంలో బ్లాక్‌ బస్టర్ అయ్యింది. మరి తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా?

4 Min read
Author : Aithagoni Raju
Published : Sep 04 2026, 01:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ
Image Credit : Asianet News

బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ

మమితా బైజు.. తెలుగు ఆడియెన్స్ కి ఇప్పటికే పరిచయమైంది. `ప్రేమలు` చిత్రంతో ఆకట్టుకుంది. ఇటీవల `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` మూవీతో తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యింది. ఇప్పుడు ఆమె మలయాళం `బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌` చిత్రంతో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం ఆగస్ట్ 21న మలయాళంలో విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. ఇందులో నివిన్‌ పౌలీ హీరో కావడం విశేషం. గిరిష్‌ ఏడీ దర్శకత్వం వహించారు. ఫహద్‌ ఫాజిల్‌, దిలేష్‌ పోతన్‌, శ్యామ్‌ పుష్కరన్‌ నిర్మించారు. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ఈ మూవీని నేడు శుక్రవారం(సెప్టెంబర్‌ 4) తెలుగు రాష్ట్రాల్లో డబ్‌ చేసి రిలీజ్‌ చేశారు. మరి అక్కడ హిట్‌ అయిన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ కథ
Image Credit : Asianet News

బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ కథ

ఆష్లే (మమితా బైజు) కాలేజీ స్టూడెంట్. గిటార్ ప్లే చేయడం తన హాబీ. ఆష్లే కుటుంబం ఇల్లు మారడంతో పక్క ఇంట్లో జస్టిన్ (నివిన్ పౌలీ) ఫ్యామిలీ ఉంటుంది. వయసుపైబడినా గానీ జస్టిన్‌కు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉంటూ.. క్యాటరింగ్ బిజినెస్ చేస్తుంటాడు. అలాంటి జస్టిన్‌తో అష్లేకి పరిచయం ఏర్పడి తొలుత స్నేహంగాను, ప్రేమగాను మారుతుంది. అయితే ఏజ్ గ్యాప్ కారణంగా పెళ్లికి ఆష్లే, బెత్లెహెమ్‌ కుటుంబం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వారి లవ్ బ్రేకప్ జరిగి పై చదువులకు విదేశాలకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఓ పెళ్లి కోసం మళ్లీ తన ఊరికి రావడంతో జస్టిన్‌కు చేరువ అవుతుంది. మరి వీరిద్దరు లవ్‌ ట్రాక్ మళ్లీ మొదలైందా? అది ఎలాంటి పరిణామాలకు దారితీసింది. ఆష్లే ఫ్యామిలీ కట్టుబాట్లు ఎలా ఉన్నాయి? ఆమె కాలేజ్ లైఫ్ ఎలా సాగింది? జస్టిన్ ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాడు? ఆష్లే, జస్టిన్ మధ్య పరిచయం, ప్రేమ ఎలా స్టార్ట్ అయ్యింది? లేటు వయసులో ప్రేమలో పడిన జస్టిన్ ఫీలింగ్స్ ఏమిటి? వీరి ప్రేమకు అసలు అడ్డంకి ఏంటి? విదేశాలకు వెళ్లి పెళ్లి కోసం వచ్చిన ఆష్లే లైఫ్‌లో మళ్లీ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి? బెత్లెహోం కుటుంబ యూనిట్ అంటే ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

36
బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ విశ్లేషణ
Image Credit : Asianet News

బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ విశ్లేషణ

ఏజ్‌ గ్యాప్‌ లవ్‌ స్టోరీ, ఫన్‌ ప్రధానంగా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. హీరోయిన్‌ విదేశాల నుంచి ఇంటికి వచ్చాక గతాన్ని గుర్తు చేసుకోవడంతో కథ స్టార్ట్ అవుతుంది. ప్రారంభంలో అష్లే పాత్ర తీరుతెన్నులు, వారి ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ని పరిచయం చేశారు. ఆ తర్వాత జస్టిన్‌ క్యారెక్టర్‌ని, అతను చేసే పనులను చూపించారు. అనంతరం జస్టిన్‌ ఇంటి పక్కనే అష్లే ఫ్యామిలీ షిఫ్ట్ కావడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. ప్రారంభంలోనే జస్టిన్‌ని చూసి అష్లే ఆశ్చర్యపోవడం, షాక్‌ గురి కావడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిన సన్నివేశాలతో సాగుతుంది. అయితే ఇది రెగ్యూలర్‌ లవ్‌ స్టోరీ కాదు, ఆ లవ్‌ ట్రాక్‌ విభిన్నంగా ప్రారంభమవుతుంది. హీరో తమ్ముడు తీసే షార్ట్ ఫిల్మ్ హడావుడి కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. ఓ వైపు జస్టిన్‌ తమ్ముడు చేసే రచ్చ నవ్విస్తుంది. మరోవైపు అష్లే, జస్టిన్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ దోబూచులాడుతుంది. ఫీల్‌ గుడ్‌గా ఫన్నీగా సాగుతుంది. ఇలా మొదటి భాగం వరకు లవ్‌ ట్రాకులు, కామెడీ, పంచ్‌ డైలాగ్‌లతో నవ్విస్తూ అలరిస్తుంది. సెకండాఫ్‌ తర్వాత సినిమా ఎమోషనల్ సైడ్‌ వెళ్తుంది. హీరోహీరోయిన్లు ప్రేమని ఎక్స్ ప్రెస్‌ చేసుకోవడం ఫీల్‌గుడ్‌గా సాగుతుంది. ఉత్కంఠభరితంగా ఉంటుంది. అయితే వీరి ప్రేమ పెద్దలకు తెలిశాక చోటు చేసుకునే సన్నివేశాలు ఎంగేజింగ్‌గా ఉంటాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఉత్కంఠని పెంచుతాయి. అందులోనూ జస్టిన్‌ తమ్ముడి లవ్‌ ట్రాక్‌ పంచాయితీ నవ్వులు పూయిస్తుంది. మరోవైపు అమ్మాయి విషయంలో హీరో చేసే పనులు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సెకండాఫ్‌లో కొంత ఫన్, ఇంకొంత ఎమోషనల్‌గా, అలాగే ఫీల్‌ గుడ్‌ లవ్‌ ట్రాక్‌ మేళవింపుగా రన్‌ అవుతుంది. లవ్‌ బ్రేకప్‌ సీన్లు హార్ట్ ని టచ్‌ చేస్తాయి. ఏజ్‌ గ్యాప్‌ సీన్లు నవ్విస్తాయి. దీనిపై కుర్రాళ్లు వేసే పంచ్‌లు నవ్విస్తాయి. ఓవరాల్‌గా ఎమోషనల్‌ వైపు తీసుకెళ్లి ముగించిన తీరు బాగుంది. సినిమాలో కామెడీ, లవ్‌ ట్రాక్‌లు, ట్రెండీ, పంచ్‌ డైలాగ్‌లు, జెంజీ, ఓల్డ్ కి సంబంధించిన సీన్లు హైలైట్‌గా నిలుస్తాయి. పాటలు అదిరిపోయాయి. ఆర్‌ఆర్‌ ఆకట్టుకుంది. విజువల్‌గా బాగుంది. కానీ సినిమా చాలా ల్యాగ్‌ అనిపిస్తుంది. లెన్తీ ఫీలింగ్‌ కలుగుతుంది. కొంత ట్రిమ్‌ చేయోచ్చు. కామెడీ అన్ని చోట్ల ఆశించిన స్థాయిలో పండలేదు. కాకపోతే కామెడీ సహజంగా ఉండటం విశేషం. ఇదే సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఇదొక క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కావడం మరో విశేషం.

46
బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

జస్టిన్‌ పాత్రలో నివిన్ పౌలీ ఇరగదీశాడు. సెటిల్డ్ గా చేసి మెప్పించాడు. ఏజ్డ్ పర్సన్‌ అనిపిస్తూనే ట్రెండ్‌ని ఫాలో కావడం, బాధ్యతగా వ్యవహరించే తీరు ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌ సీన్లలో దుమ్ములేపాడు. ఇంకా చెప్పాలంటే పాత్రలో నివిన్‌ జీవించేశాడు. ఎక్కడా నివిన్‌ కనిపించడు జస్టిన్‌ పాత్రనే కనిపిస్తుంది. అంత బాగా చేశాడు. అష్లే పాత్రలో మమితా బైజు పోటీ పడి నటించింది. కొంత ఫన్నీగా, మంచి అమ్మాయిగా, ప్రేమికురాలిగా, డేరింగ్‌ పర్సన్‌గా ఆకట్టుకుంది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. నివిన్‌, మమితా బైజు మధ్య కెమిస్ట్రీ సూపర్‌గా వర్కవుట్ అయింది. గిరీష్ రాసిన డైలాగ్స్ ఇద్దరి పాత్రలను బాగా పండించేలా చేసింది. తమ్ముడి పాత్రలో సంగీత్ ప్రతాప్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో మంచి హ్యుమర్‌ను సినిమాకు అందించాడు. సినిమాకి మరో హైలైట్‌గా నిలిచాడు. అలాగే హీరోయిన్‌ మేనమామ, హీరోయిన్‌కి లైన్‌ వేసే కుర్రాడు, హీరో తండ్రి, హీరోయిన్‌ తండ్రి పాత్రలు చేసిన వారు కూడా నవ్వించారు. వారి పాత్రలు ఆకట్టుకుంటాయి. మిగిలిన వారు ఓకే అనిపించారు.

56
బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ హైలైట్స్ గా నిలిచాయి. విష్ణు విజయ్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌ను పెంచింది. ఆడియెన్స్ ని కట్టిపడేసేలా ఉన్నాయి. కెమెరామెన్‌ అజ్మల్ సాబు సినిమాను విజువల్‌ ట్రీట్‌గా మార్చారు. ఎడిటింగ్‌ పరంగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సింది. ఫాహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్, భవన్ స్టూడియోస్ నిర్మాణ విలువలు టాప్ క్లాస్‌గా ఉన్నాయి. దర్శకుడు గిరీష్‌ ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని అంతే బాగా తెరపై ఆవిష్కరించారు. కొంత డిటెయిలింగ్‌ పోయే క్రమంలో ల్యాగ్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. తెలుగు డైలాగ్‌లు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. ఓవరాల్‌గా మూవీ అన్ని వర్గాల వారికి నచ్చే మూవీ అవుతుంది. ఫన్‌ని ఎంజాయ్‌ చేస్తారు. లవ్‌ని, ఎమోషన్స్ ని ఫీలవుతారు.

66
ఫైనల్‌ నోట్‌, రేటింగ్‌
Image Credit : Asianet News

ఫైనల్‌ నోట్‌, రేటింగ్‌

ఆద్యంతం నవ్విస్తూ, హృదయాన్ని కదిలిస్తూ, కట్టిపడేసే ఫీల్‌గుడ్‌ లవ్‌, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎంజాయ్‌ చేస్తారు.

రేటింగ్‌: 3

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Day 1 Collections: రణబాలికి షాకింగ్‌ కలెక్షన్లు.. విజయ్‌, రష్మిక మూవీకి మొదటి రోజు వచ్చింది ఇంతేనా?
Recommended image2
Garividi Lakshmi Movie Review: గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ, బుర్రకథ కళాకారిణి జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Recommended image3
Ranabaali Movie Review: రణబాలి మూవీ రివ్యూ రేటింగ్‌.. విజయ్‌ దేవరకొండ రష్మిక హిట్‌ కొట్టారా? డీలా పడ్డారా ?
Related Stories
Recommended image1
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved