MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Mokshagna: నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా కాలంగా సస్పెన్స్ కొనసాగుతున్న టైమ్ లో.. రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈక్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఇందులో నిజమెంత?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 03 2026, 08:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తండ్రికి తగ్గ తనయుడిగా
Image Credit : facebook.com/moksha9999

తండ్రికి తగ్గ తనయుడిగా

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపును సంపాదించుకున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. తన నటనతో, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో, మాస్ ఇమేజ్‌తో బి, సీ సెంటర్ల ప్రేక్షకులనే కాకుండా అందరినీ అలరిస్తూ విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్నారు. అలాంటి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి గత కొన్నేళ్లుగా రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ, ఇప్పటివరకు అసలు విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రశాంత్ వర్మతో సినిమా ఏమయ్యింది.
Image Credit : our own

ప్రశాంత్ వర్మతో సినిమా ఏమయ్యింది.

గతంలో ప్రశాంత్ వర్మ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండబోతోందని ప్రచారం జరిగినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. దాంతో ఈ సారి బాలయ్య బాబు తన కొడుకు ఎంట్రీని చాలా గట్టిగా, పర్ఫెక్ట్ ప్రణాళికతో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ వర్గాల సమాచారం ప్రకారం, రాబోయే దసరా పండుగ సందర్భంగా మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను అధికారికంగా లాంచ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారని సమాచారం.

34
పక్కా ప్లాన్ తో షూటింగ్ లోకి
Image Credit : social media

పక్కా ప్లాన్ తో షూటింగ్ లోకి

ఈ సినిమా లాంచింగ్ విషయం మాత్రమే కాకుండా, చిత్ర యూనిట్ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. పూజా కార్యక్రమాలు జరుపుకునే ఓపెనింగ్ రోజే ఈ సినిమా రిలీజ్ కు సంబంధించిన రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవి (సమ్మర్) కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పక్కా ప్లాన్ తో షూటింగ్ లోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.

44
మొదటి సినిమాతోనే గట్టిగా ప్లాన్ చేస్తున్న మోక్షజ్ఞ
Image Credit : X/Nandamuri balakrishna fans

మొదటి సినిమాతోనే గట్టిగా ప్లాన్ చేస్తున్న మోక్షజ్ఞ

ఇక మొదటి సినిమాతోనే నదమూరి అభిమానులను ఆకట్టుకోవాలని, ప్రేక్షకులపై చెరగని ముద్ర వేయాలనే పట్టుదలతో మోక్షజ్ఞ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హీరోగా నిలబడటానికి అన్ని రకాలుగా ట్రైయింగ్ కూడా తీసుకున్నాడట మోక్షజ్ఞ. నటనలోని విభిన్నమైన మెలుకువలు నేర్చుకోవడమే కాకుండా, డ్యాన్స్ లో కూడా కఠినమైన ప్రాక్టీస్ చేశారట. మొదటి సినిమాతోనే తనలోని పూర్తిస్థాయి నటుడిని బయటకు తీసి, నందమూరి అభిమానులను, సగటు సినీ ప్రేక్షకులను మెప్పించాలని భావిస్తున్నారు. నందమూరి వంశం నుంచి వస్తున్న మరో వారసుడిగా మోక్షజ్ఞపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని, ఈ సినిమాతో మోక్షజ్ఞ ఏ స్థాయి విజయాన్ని అందుకోబోతున్నారు, తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ ఫుల్ హీరోగా నిలబడతారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే!

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్
Recommended image2
AggiPetti Macha: అగ్గి పెట్టి మచ్చ కిరణ్ మృతి.. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సోషల్ మీడియా కమెడియన్
Recommended image3
Jailer 2 Censor: జైలర్ 2 సెన్సార్ రివ్యూ.. రజనీకాంత్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్, సూపర్ హిట్ కొట్టేసినట్లే
Related Stories
Recommended image1
Allu Arjun: దేనికి పనికిరాడని అల్లు అర్జున్ కి 10 లక్షలు ఇన్సురెన్స్ చేయించింది ఎవరు? 4th క్లాస్ లోనే తేలిపోయిందా?
Recommended image2
Ram Charan: 30 ఏళ్ల వయసులో రామ్ చరణ్ చేసిన పనికి.. నిర్మాత బండ్ల గణేష్ కు కన్నీళ్లు ఆగలేదు.. ఏం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved