MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Allu Arjun: దేనికి పనికిరాడని అల్లు అర్జున్ కి 10 లక్షలు ఇన్సురెన్స్ చేయించింది ఎవరు? 4th క్లాస్ లోనే తేలిపోయిందా?

Allu Arjun: దేనికి పనికిరాడని అల్లు అర్జున్ కి 10 లక్షలు ఇన్సురెన్స్ చేయించింది ఎవరు? 4th క్లాస్ లోనే తేలిపోయిందా?

Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం దేశం మెచ్చిన స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు. కానీ అసలు బన్నీ దేనికిపనికిరాడు అని 10 లక్షలు ఇన్సురెన్స్ చేయించింది ఎవరో తెలుసా? ఐకాన్ స్టార్ స్వయంగా వెల్లడించిన నిజం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 03 2026, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఐకాన్ స్టార్ గా ప్రపంచవ్యాప్త గుర్తింపు..
Image Credit : stockPhoto

ఐకాన్ స్టార్ గా ప్రపంచవ్యాప్త గుర్తింపు..

తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. పుష్ప సినిమాల ద్వారా దేశ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. సినిమా వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అల్లు అర్జున్.. తన సొంత ట్యాలెంట్ తో.. డ్యాన్స్ , యాక్షన్, గ్లామర్ తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే అల్లు అర్జున్ చిన్నప్పుడు ఇలా ఉండేవాడు కాదట. ఆయన తీరు చూసి.. ఇంట్లో వాళ్లు భయపడేవారట. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ దేనికి పనికిరాడు అని ఫిక్స్ అయిపోయి 4th క్లాస్ లోనే 10 లక్షలు ఇన్సురెన్స్ చేయించారట ఆయన తాత, స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అల్లు అర్జున్ పేరుమీదనే ఎందుకు?
Image Credit : our own

అల్లు అర్జున్ పేరుమీదనే ఎందుకు?

అల్లు అర్జున్ చిన్నతనంలో తాతగారు, దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్యకి ఆయనపై ఉన్న ఒక విచిత్రమైన 'నమ్మకం' గురించి అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లో సరదా కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు రామలింగయ్య చనిపోయిన తర్వాత ఆయన రాసిన ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా అల్లు అర్జున్‌కు 10 లక్షల రూపాయలు వచ్చాయి. అసలు తన తాతగారు మొత్తం ఎనిమిది మంది మనవలు, మనవరాళ్లలో ఎవరికీ ఇవ్వకుండా కేవలం తన పేరు మీద మాత్రమే ఆ ఇన్సూరెన్స్ ఎందుకు చేయించారా అని అల్లు అర్జున్ కు పెద్ద డౌట్ వచ్చిందట.

34
వేస్ట్ ఫెలో అవుతాడని అనుకున్నాడట.
Image Credit : our own

వేస్ట్ ఫెలో అవుతాడని అనుకున్నాడట.

అయితే అసలు విషయం తెలుసుకోవడానికి అల్లు అర్జున్ ఆ పాలసీకి సంబంధించిన వివరాలను, తేదీలను పరిశీలించారు.అప్పుడు ఆయనకు తెలిసిన నిజం ఏంటంటే, అల్లు అర్జున్ నాల్గో తరగతి (Fourth Standard) చదువుతున్న సమయంలోనే రామలింగయ్య ఆ ఇన్సూరెన్స్ బాండ్ తీసుకున్నారు. ఆ పాలసీ తీసే సమయంలో తన తాతగారి మనసులో ఉన్న అభిప్రాయాన్ని అల్లు అర్జున్ సరదాగా వివరిస్తూ – "మా తాతయ్య నన్ను ఫోర్త్ క్లాస్‌లోనే పసిగట్టేశారు. 'వీడు జీవితంలో దేనికి పనికిరాడు, పరమ వేస్ట్ ఫెలో అవుతాడు. నేను పోయిన తర్వాత, వీడికి 18 ఏళ్లు వచ్చాక ఈ 10 లక్షల రూపాయలైనా ఉపయోగపడతాయి, దాంతోనైనా ఏదో ఒక రకంగా జీవితాన్ని నెట్టుకొస్తాడు' అనే అంత గొప్ప నమ్మకంతో నా పేరు మీద ఆ 10 లక్షల ఇన్సూరెన్స్ రాసి వెళ్లిపోయారు" అని నవ్వుతూ చెప్పారు.

44
భవిష్యత్తు గురించి భయపడి
Image Credit : Asianet News

భవిష్యత్తు గురించి భయపడి

తాతగారు తన భవిష్యత్తు గురించి భయపడి, ప్రేమతో చేసిన ఆ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి అల్లు అర్జున్ చాలా సరదాగా పంచుకున్నారు. చిన్నతనంలో అల్లరిగా, చదువులో వెనుకబడి ఉన్న అర్జున్‌ను చూసి రామలింగయ్య గారు అలా భావించినప్పటికీ, కాలక్రమేణా అల్లు అర్జున్ తన కష్టంతో, ప్రతిభతో భారతీయ చిత్రసీమలోనే అగ్ర నటుడిగా ఎదిగారు. తాతగారు అనుకున్న దానికి భిన్నంగా, కోట్ల మంది అభిమానులను సంపాదించుకుని కుటుంబానికి గొప్ప పేరు తెచ్చారు. ఈ చిన్నపాటి సంఘటన అల్లు రామలింగయ్య కి మనవడిపై ఉన్న ప్రేమ, బాధ్యతను, తెలియజేసింది. అల్లు అర్జున్ ఈ విషయం చెప్పడంతో అంతా షాక్ అయ్యారు కూడా.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image2
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Recommended image3
The Paradise: ది ప్యారడైజ్ మూవీకి ట్రైలర్ లేదు.. బాంబు పేల్చిన నాని, ఏం జరుగుతోంది
Related Stories
Recommended image1
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image2
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved