MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..

Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..

Babu Mohan: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్స్ బాబుమోహన్ ఒకరు.కోట్లాది అభిమానులను సంపాదించుకున్న బాబు మోహన్ 74 ఏళ్ల వయసులో ఎంతో ఫిట్ గా ఉన్నారు. ఇంతకీ బాబుమోహన్ ఫిట్‌నెస్ రహస్యం ఏంటి, డైట్ ప్లాన్ గురంచి తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 01 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
90s లో బాబు మోహన్ హవా
Image Credit : google

90s లో బాబు మోహన్ హవా

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్యంతో, విలక్షణమైన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు బాబు మోహన్. 90లలో సిల్వర్ స్క్రీన్ పై బాబు మోహన్ హవా నడిచింది. కామెడియన్ గా బాబు మోహన్ మార్క్ తిరుగులేనిది. కొన్ని సినిమాల్లో ఆయన విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. కోట శ్రీనివాసరావుతో బాబు మోహన్ కాంబినేషన్ సూపర్ హిట్. వీరిద్దరూ కలిసి పదుల సంఖ్యలో మూవీస్ చేశారు. మామగారు మూవీలో వీరిద్దరి కామెడీ ఐకానిక్. రాజకీయాల్లోకి వచ్చాక బాబు మోహన్ సినిమాలు తగ్గించారు. ఈ మధ్య అడపాదడపా మాత్రమే నటిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
74 ఏళ్ల వయసులో ఫిట్ గా బాబు మోహన్
Image Credit : our own

74 ఏళ్ల వయసులో ఫిట్ గా బాబు మోహన్

74 ఏళ్ల వయసులో బాబు మోహన్ చాలా ఫిట్ గా, గ్లామర్ గా కనిపిస్తూ.. అందరికి షాక్ ఇస్తున్నాడు. దశాబ్దాలు గడిచినా, వయసు పెరుగుతున్నా ఆయన రూపంలో గానీ, ఉత్సాహంలో గానీ ఎలాంటి మార్పూ రాకపోవడం చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతుంటారు. రోజురోజుకూ ఆయనలో గ్లామర్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని, మరి ఈ వయసులోనూ ఆయన ఎంతో ఎనర్జిటిక్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏమిటి? అని కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈక్రమలో రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన డైట్ చార్ట్ ను బయటపెట్టారు.

35
రెండు సంవత్సరాలుగా అన్నం తినలేదు..
Image Credit : our own

రెండు సంవత్సరాలుగా అన్నం తినలేదు..

సాధారణంగా మన దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరి రోజువారీ ఆహారంలో అన్నం (భోజనం) ప్రధాన భాగం. కానీ బాబు మోహన్ గత రెండు సంవత్సరాలుగా భోజనం చేయడం పూర్తిగా మానేశారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జీర్ణశక్తి తగ్గడం, శరీరంలో కొవ్వు పెరగడం వంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే ఆయన హెవీగా ఉండే అన్నాన్ని పక్కన పెట్టి, తేలిగ్గా జీర్ణమయ్యే సహజమైన ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపారు.

బాబు మోహన్ డైట్ చార్ట్ ఎలా ఉంటుందంటే?

ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన దాని ప్రకారం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఎంతో తేలికైన, ఆరోగ్యకరమైన టిఫిన్‌ను బాబుమోహన్ ఎంచుకుంటారు. ఉదయాన్నే 3 లేదా 4 ఇడ్లీలు మాత్రమే తీసుకుంటారు. దాంతో పాటు పాలలో కొద్దిగా మిరియాల పొడి వేసుకుని, పంచదార (Sugar) లేకుండా తాగుతారు. పంచదారను పూర్తిగా తీసుకోకపోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా, అనవసరమైన క్యాలరీలు చేరకుండా ఉంటాయి.

45
మధ్యాహ్నం భోజనంలో జావ ఉండాల్సిందే..
Image Credit : Asianet News

మధ్యాహ్నం భోజనంలో జావ ఉండాల్సిందే..

ఇక బాబు మోహన్ మధ్యాహ్నం భోజనంలో.. రాగిజావ - మజ్జిగ కాంబినేషన్ రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటారు. ఉదయం కానీ మధ్యాహ్నం కానీ.. ఆయన తీసుకునే వాటిలో 'రాగిజావ' అత్యంత ముఖ్యమైనది. మధ్యాహ్నం సమయంలో రాగిజావలో కమ్మటి మజ్జిగ లేదా పెరుగు కలుపుకుని, కొద్దిగా గ్రైండ్ చేయించి తాగుతారు. రాగిజావ శరీరానికి కావలసిన క్యాల్షియం, పీచు పదార్థం (ఫైబర్) అందిస్తే, మజ్జిగ/పెరుగు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.

పండ్లు - ఫ్రూట్ జ్యూస్‌లు

భోజనానికి ప్రత్యామ్నాయంగా బాబు మోహన్ రోజూ రకరకాల పండ్లు (Fruits) , తాజా పండ్ల రసాలు (Fruit Juices) తీసుకుంటారు. ఇవి శరీరానికి కావలసిన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలను పుష్కలంగా అందిస్తాయి. పండ్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో, శరీరానికి రోగనిరోధక శక్తిని ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బాబు మోహన్ డైట్ నుండి అందరు చాలా నేర్చుకోవాల్సి ఉంది. బాబు మోహన్ డైట్ లో పంచదార లేని పాలు కూడా ఉన్నాయి. పాలలో పంచదారలేకుండా.. మిరియాలు వేసి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది .

55
సంప్రదాయ ఆహారం
Image Credit : Asianet News

సంప్రదాయ ఆహారం

రాగిజావ, మజ్జిగ వంటి పానీయాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పండ్లు, జ్యూస్‌లు తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం, ఎనర్జీ స్థాయిలు పెరుగుతాయి. ఏలాంటి ఆడంబరమైన .. ఖరీదైన హెవీ డైట్‌లు కాకుండా, మన ఇంట్లో లభించే సహజమైన రాగిజావ, మజ్జిగ, ఇడ్లీ, పండ్లు , మిరియాల పాలు తీసుకోవడం ద్వారానే బాబు మోహన్ తన ఆరోగ్యాన్ని, గ్లామర్‌ను కాపాడుకుంటున్నారు. సరైన ఆహార నియమాలు పాటిస్తే వయసును కూడా జయించవచ్చని ఆయన నిరూపిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Amitabh Bachchan Net Worth: 90 కోట్ల అప్పు నుంచి 4 వేల కోట్ల ఆస్తి వరకు బిగ్ బీ జర్నీ
Recommended image2
Allu Arjun: ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు ముగ్గురి వల్లా కాలేదు..భార్య సాయం తీసుకుని చించిపడేసిన అల్లు అర్జున్
Recommended image3
Kannamoochi Web Series: దాగుడుమూతలు ఆడుతూ కూతురు మాయం.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న వెబ్ సిరీస్
Related Stories
Recommended image1
USA: అమెరికాలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? శిక్షలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసా?
Recommended image2
చిరంజీవిని పేరు పెట్టి పిలిచే ఏకైక కమెడియన్, పవన్ కళ్యాణ్ 'అన్నయ్య' అని పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved