MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు

Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు

India vs Pakistan Women: మహిళల ఆసియా కప్ 2026లో తెలుగు అమ్మాయి శ్రీచరణి (3/7) మ్యాజిక్ బౌలింగ్‌తో పాకిస్థాన్ 55 పరుగులకే కుప్పకూలింది. భారత్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో శ్రీచరణి రికార్డుల మోత మోగించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 06 2026, 07:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాక్‌కు సుస్సు పోయించిన తెలుగమ్మాయి శ్రీచరణి.. మ్యాచ్ చూస్తే పూనకాలే భయ్యా
Image Credit : X/BCCIWomen

పాక్‌కు సుస్సు పోయించిన తెలుగమ్మాయి శ్రీచరణి.. మ్యాచ్ చూస్తే పూనకాలే భయ్యా

మహిళల ఆసియా కప్ 2026లో హైవోల్టేజ్ మ్యాచ్ అని ఆశగా ఎదురుచూసిన క్రికెట్ లవర్స్ కు భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ మైండ్ బ్లాంక్ అయ్యే షాకిచ్చింది. దుబాయ్ లో జరిగిన లీగ్ పోరులో భారత్ ఏకపక్ష విజయంతో దుమ్మురేపింది. ముఖ్యంగా మన తెలుగు అమ్మాయి ఎన్. శ్రీచరణి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ మాయాజాలానికి పాకిస్థాన్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేక చేతులెత్తేశారు. స్పిన్ త్రయం శ్రీచరణి, ప్రేమ రావత్, దీప్తి శర్మల ధాటికి పాక్ 55 పరుగులకే ఆలౌటై తన టీ20 చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఆ తర్వాత 56 పరుగుల చిన్న టార్గెట్‌ను భారత్ కేవలం 3 వికెట్లు కోల్పోయి అందుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దాయాది పతనాన్ని శాసించిన డ్రీమ్ స్పెల్
Image Credit : X/BCCIWomen

దాయాది పతనాన్ని శాసించిన డ్రీమ్ స్పెల్

శ్రీచరణి వేసిన వేగానికి, విసిరిన స్పిన్ తిరుగుళ్లకు పాక్ ప్లేయర్లు కంగారెత్తిపోయారు. తన తర్వాతి ఓవర్లోనే ఆయేషా జఫర్ (2)ను క్యాచ్ ఔట్ చేసి పాక్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. కెప్టెన్ ఫాతిమా సనా (0), సదాఫ్ షమాస్ (3), ఉమ్మ్-ఈ-హాని (6) ఇలా ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టు సాధించలేకపోయారు. టీమిండియా ఫీల్డర్ ఫుల్మాలి అద్భుత రన్ అవుట్‌తో ఐమాన్ ఫాతిమా (5) కూడా పెవిలియన్ దారి పట్టింది. చివరికి 18.1 ఓవర్లలో 55 రన్స్‌కే పాకిస్థాన్ ప్యాకప్ చెప్పేసింది. టీమిండియా తరఫున శ్రీచరణి (3/7), ప్రేమ రావత్ (3/9) మూడేసి వికెట్లతో విరుచుకుపడగా, దీప్తి శర్మ 2 వికెట్లు సాధించింది.

36
పాక్ మెరుపు ఆరంభం.. శ్రీచరణి ఎంట్రీతో సీన్ రివర్స్
Image Credit : X/BCCIWomen

పాక్ మెరుపు ఆరంభం.. శ్రీచరణి ఎంట్రీతో సీన్ రివర్స్

దుబాయ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడం తప్ప పాకిస్థాన్‌కు మ్యాచ్‌లో ఏదీ కలసి రాలేదు. ఓపెనర్లు మునీబా అలీ (13), షావాల్ జుల్ఫీకర్ (14) తొలి 4 ఓవర్లలో 23 పరుగులు చేసి కాస్త జోరు చూపిస్తున్నట్టే అనిపించారు. కానీ, షెఫాలీ వర్మ మునీబాను క్లీన్ బౌల్డ్ చేసి బ్రేక్‌త్రూ ఇచ్చింది. ఇక ఆ తర్వాత బాల్ పట్టుకున్న తెలుగు తేజం శ్రీచరణి మ్యాచ్ గతిని పూర్తిగా మార్చేసింది. గుల్ ఫెరోజా (0)ను క్లీన్ బౌల్డ్ చేయడమే కాకుండా, అదే ఓవర్ ఆఖరి బంతికి డేంజర్ బ్యాటర్ జుల్ఫీకర్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపింది.

46
ప్రపంచ రికార్డు కొట్టిన తెలుగమ్మాయి
Image Credit : X/BCCIWomen

ప్రపంచ రికార్డు కొట్టిన తెలుగమ్మాయి

ఈ మ్యాచ్‌లో శ్రీచరణి నమోదు చేసిన 4-0-7-3 గణాంకాలు కేవలం మ్యాచ్‌ను గెలిపించడమే కాదు, రికార్డుల పుస్తకాలను తిరగరాశాయి. ఉమెన్స్ ఆసియా కప్ హిస్టరీలోనే 4 ఓవర్ల కోటాలో అత్యుత్తమ ఎకానమీ సాధించిన భారత బౌలర్‌గా దీప్తి శర్మ (2022లో థాయ్‌లాండ్‌పై 3/7) సరసన నిలిచింది. అంతేకాకుండా, 2026 సంవత్సరంలో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు (34 వికెట్లు) తీసిన ఏకైక బౌలర్‌గా శ్రీచరణి ఆల్‌టైమ్ నేషనల్ రికార్డు సొంతం చేసుకుంది.

56
కెప్టెన్ సనా భయం.. ఫినిషింగ్ టచ్ ఇచ్చిన హర్మన్
Image Credit : X/BCCIWomen

కెప్టెన్ సనా భయం.. ఫినిషింగ్ టచ్ ఇచ్చిన హర్మన్

చాలా చిన్న టార్గెట్ కావడంతో భారత్ ఫస్ట్ ఓవర్ నుంచే అటాక్ మొదలుపెట్టింది. షెఫాలీ వర్మ ఒక మాస్ సిక్సర్‌తో బోణీ కొట్టింది. అయితే పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఒక్కసారిగా మ్యాచ్‌లో ఉత్కంఠ పెంచింది. వరుస ఓవర్లలో షెఫాలీ వర్మ (12), ప్రతికా రావల్ (4), స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (9)లను ఔట్ చేసి 29 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి భారత్‌ను కాస్త భయపెట్టింది. అయితే, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (18 నాటౌట్), దీప్తి శర్మ (12 నాటౌట్) కూల్‌గా ఆడి మ్యాచ్‌ను ముగించారు. హర్మన్ బ్యాక్-టు-బ్యాక్ ఫోర్, సిక్స్ కొట్టి 8.4 ఓవర్లలోనే భారత్ కు విజయాన్ని అందించారు.

66
భారత్ సెమీస్‌కు నయా రూట్.. పాకిస్థాన్ కు కష్టమే
Image Credit : X/BCCIWomen

భారత్ సెమీస్‌కు నయా రూట్.. పాకిస్థాన్ కు కష్టమే

ఈ దెబ్బతో భారత్ ఏకంగా ఆసియా కప్ సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోగా, పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. తమ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఆఖరి మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌పై అత్యంత భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఈ మ్యాచ్ హీరో మాత్రం మన తెలుగమ్మాయి శ్రీచరణి అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన స్పిన్ మ్యాజిక్‌తో దాయాది పాక్ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చి భారత్ గర్వపడేలా చేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Related Stories
Recommended image1
Smriti Mandhana: ఒకే మ్యాచ్‌లో రెండు వరల్డ్ రికార్డ్స్.. మిథాలీ, లానింగ్ రికార్డులను బద్దలుకొట్టిన స్మృతి మంధాన
Recommended image2
World Highest Railway Bridge: ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన.. భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ అద్భుతం ఇది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved