MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు

Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు

Shafali Verma: ఆసియా కప్ 2026 లో పాకిస్థాన్ ను భారత్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ తో మహిళల టీ20 క్రికెట్‌లో షఫాలీ వర్మ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అతి పిన్న వయసులో, తక్కువ బంతుల్లో అరుదైన రికార్డు వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 06 2026, 07:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాకిస్థాన్‌పై షఫాలీ వర్మ సరికొత్త హిస్టరీ
Image Credit : Getty

పాకిస్థాన్‌పై షఫాలీ వర్మ సరికొత్త హిస్టరీ

మహిళల టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో భారత స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. శనివారం దుబాయ్ లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఆసియా కప్ 2026 గ్రూప్-ఎ మ్యాచ్‌లో ఆమె సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించింది. మహిళల టీ20ల్లో అత్యంత వేగంగా, అలాగే అతి చిన్న వయసులోనే 3,000 పరుగులు మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు 3000 పరుగుల రికార్డుకు కేవలం 7 పరుగుల దూరంలో ఉన్న షఫాలీ, ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఆ మైలురాయిని దాటేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పిన్న వయసులోనే అరుదైన రికార్డ్ సొంతం
Image Credit : X@BCCIWomen

పిన్న వయసులోనే అరుదైన రికార్డ్ సొంతం

షాఫాలీ వర్మ కేవలం 22 సంవత్సరాల 220 రోజుల వయసులోనే ఈ రికార్డు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఈ రికార్డు ఐర్లాండ్‌కు చెందిన గేబీ లూయిస్ పేరిట ఉండేది. గేబీ లూయిస్ 24 సంవత్సరాల 347 రోజుల వయసులో 3,000 పరుగులు సాధించగా, షఫాలీ ఆమె రికార్డును తుడిచిపెట్టేసింది. ఈ జాబితాలో యూఏఈకి చెందిన ఈషా ఓజా (27 ఏళ్ల 139 రోజులు), టీమిండియా స్టార్ స్మృతి మంధాన (27 ఏళ్ల 171 రోజులు), వెస్టిండీస్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ (27 ఏళ్ల 347 రోజులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2019లో 15 ఏళ్ల వయసులోనే భారత్ తరఫున అరంగేట్రం చేసిన షఫాలీ, హర్మాన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన తర్వాత 3000 రన్స్ మైలురాయి దాటిన మూడో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. మొత్తంగా మహిళల టీ20ల్లో ఈ ఘనత సాధించిన 16వ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది.

Related Articles

Related image1
Smriti Mandhana: ఒకే మ్యాచ్‌లో రెండు వరల్డ్ రికార్డ్స్.. మిథాలీ, లానింగ్ రికార్డులను బద్దలుకొట్టిన స్మృతి మంధాన
Related image2
World Highest Railway Bridge: ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన.. భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ అద్భుతం ఇది !
35
తక్కువ బంతుల్లో 3000 రన్స్ సాధించిన ప్లేయర్
Image Credit : Instagram/shafalisverma17

తక్కువ బంతుల్లో 3000 రన్స్ సాధించిన ప్లేయర్

వయసులోనే కాదు, ఎదుర్కొన్న బంతుల పరంగా కూడా షఫాలీ వర్మ ఫాస్టెస్ట్ రికార్డ్ నెలకొల్పింది. ఆమె కేవలం 2,182 బంతుల్లోనే 3,000 పరుగుల ఘనతను అందుకుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలిస్సా హీలీ 2,321 బంతుల్లో సాధించిన పాత రికార్డును షఫాలీ అధిగమించింది. పాకిస్థాన్ విసిరిన టార్గెట్ ఛేజింగ్‌లో షఫాలీ మొదటి బంతి నుంచే ఎటాకింగ్ గేమ్ స్టార్ట్ చేసింది. సాదియా ఇక్బాల్ వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలచి, తదుపరి బంతికి సింగిల్ తీసి 3,000 పరుగుల రికార్డును పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఫాతిమా సనా బౌలింగ్‌లో ఒక ఫోర్ కొట్టి, 6 బంతుల్లో 12 రన్స్ (1 ఫోర్, 1 సిక్స్) చేసి ఫాతిమా సనాకే క్యాచ్ ఇచ్చి అవుటైంది.

45
స్పిన్నర్ల ధాటికి పాకిస్థాన్ ఘోర పతనం
Image Credit : Getty

స్పిన్నర్ల ధాటికి పాకిస్థాన్ ఘోర పతనం

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టును భారత స్పిన్నర్లు తిప్పేశారు. పాక్ జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయి, మహిళల టీ20ల్లో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. వికెట్ నష్టపోకుండా 27 రన్స్ చేసిన దశ నుంచి పాక్ ఇన్నింగ్స్ దారుణంగా కుప్పకూలింది. భారత స్పిన్నర్లు శ్రీ చరణి, ప్రేమ రావత్ చెరో 3 వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్ వెన్నెముక విరిచారు. దీప్తి శర్మ 2 వికెట్లతో రాణించింది. దీంతో పాకిస్థాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే చాపచుట్టేసింది.

55
గ్రూప్-ఎ లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా
Image Credit : Getty

గ్రూప్-ఎ లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా

56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 8.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించగా, దీప్తి శర్మ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఎ లో థాయిలాండ్, హాంగ్ కాంగ్, పాకిస్థాన్‌లపై గెలిచి మొత్తం 6 పాయింట్లతో (+5.471 నెట్ రన్‌రేట్) టేబుల్ టాప్‌లో నిలిచింది. ఇక గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ మధ్య సెమీఫైనల్ బెర్తుల కోసం పోటీ నెలకొంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image2
టీమిండియా దెబ్బ‌కు పాకిస్థాన్ చిత్తు.. ఆసియాక‌ప్‌లో దుమ్మురేపిన అమ్మాయిలు
Recommended image3
భార‌త్ బౌలింగ్ దెబ్బ‌కు పాక్ విల‌విల‌.. 55 ప‌రుగుల‌కే కుప్పకూలిన పాకిస్థాన్ జ‌ట్టు
Related Stories
Recommended image1
Smriti Mandhana: ఒకే మ్యాచ్‌లో రెండు వరల్డ్ రికార్డ్స్.. మిథాలీ, లానింగ్ రికార్డులను బద్దలుకొట్టిన స్మృతి మంధాన
Recommended image2
World Highest Railway Bridge: ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన.. భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ అద్భుతం ఇది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved