MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • PM Kisan : పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ బిగ్ అలర్ట్.. రైతులందరూ వెంటనే ఇలా చేయండి

PM Kisan : పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ బిగ్ అలర్ట్.. రైతులందరూ వెంటనే ఇలా చేయండి

PM Kisan: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' 24వ విడత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అన్నదాత సుఖీభవ' పథకానికి సంబంధించి లబ్ధిదారులైన రైతులకు ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 03 2026, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పండుగ పూట అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబుల్ డబ్బులు
Image Credit : chatgpt

పండుగ పూట అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబుల్ డబ్బులు

దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాయం సమయం వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం అందించే 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' 24వ విడత డబ్బులతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే 'అన్నదాత సుఖీభవ' పెట్టుబడి సాయం నిధుల విడుదలకు సంబంధించి కసరత్తు వేగవంతమైంది. దసరా, దుర్గా పూజ పండుగల సమయానికే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సారి కొందరు రైతులకు రూ.2,000 బదులు రూ.4,000, మరికొందరికి రూ.6,000 వరకు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అక్టోబర్ మొదట్లోనే ఖాతాల్లోకి నిధులు
Image Credit : Asianet News

అక్టోబర్ మొదట్లోనే ఖాతాల్లోకి నిధులు

సాధారణంగా పీఎం కిసాన్ ద్వారా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున కేంద్రం జమ చేస్తుంది. జూన్‌లో 23వ విడత నిధులు విడుదల కాగా, తదుపరి 24వ విడత సెప్టెంబర్ - డిసెంబర్ కాలానికి విడుదల కావాల్సి ఉంది. ఎల్ నినో పరిస్థితులు, పంటల పెట్టుబడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ మొదటి వారంలోనే ఈ డబ్బులు జమ చేయాలని కేంద్రం భావిస్తోంది.

మరోవైపు ఏపీలో పీఎం కిసాన్ వాటా రూ.6,000కు తోడుగా, రాష్ట్ర ప్రభుత్వ 'అన్నదాత సుఖీభవ' వాటా రూ.14,000 కలిపి ఏటా మొత్తం రూ.20,000ల సాయాన్ని మూడు విడతల్లో అందిస్తున్నారు. కేంద్ర నిధులతో పాటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను విడుదల చేయనున్నందున, అక్టోబర్ మొదటి వారంలో ఏపీ రైతుల ఖాతాల్లో రూ.6,000 వరకు జమ అయ్యే ఛాన్స్ ఉంది.

35
రూ.4,000 ఎవరికి లభిస్తుంది?
Image Credit : Getty

రూ.4,000 ఎవరికి లభిస్తుంది?

ఈ విడతలో కొందరు రైతులకు ఏకంగా రూ.4,000 అందే అవకాశం ఉంది. గత 23వ విడత సమయంలో ఇ-కేవైసీ (e-KYC), ల్యాండ్ సీడింగ్ లేదా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు ఆగిపోయిన రైతులకు ఈ సారి జాక్‌పాట్ తగలనుంది. ఆటంకాలను తొలగించుకుని, ధృవీకరణ పూర్తి చేసిన రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన జాబితాలను ఆమోదిస్తే.. పాత బకాయి రూ.2,000, ప్రస్తుత 24వ విడత రూ.2,000 కలిపి మొత్తం రూ.4,000 ఒకేసారి ఖాతాల్లో పడతాయి. అయితే, గత విడత డబ్బులు క్రమంగా పొందిన రైతులకు మాత్రం సాధారణంగా వచ్చే రూ.2,000 మాత్రమే లభిస్తాయి.

45
మీ సేవా, యాప్‌ ద్వారా సులభంగా e-KYC
Image Credit : our own

మీ సేవా, యాప్‌ ద్వారా సులభంగా e-KYC

పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కావాలంటే ఇ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతులు ఈ ప్రాసెస్ ని మూడు రకాలుగా పూర్తి చేసుకోవచ్చు..

• ఆధార్ OTP విధానం: పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ (pmkisan.gov.in) కు వెళ్లి, 'Farmers Corner' లో ఉన్న 'e-KYC' ఆప్షన్ ఎంచుకోవాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, లింక్ అయిన మొబైల్‌కు వచ్చే OTP సబ్మిట్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది.

• ఫేస్ స్కాన్ : స్మార్ట్‌ఫోన్‌లో 'PMKISAN GoI' యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, ముఖ గుర్తింపు ద్వారా వేగంగా ఇ-కేవైసీ చేయవచ్చు.

• సీఎస్‌సీ/మీసేవా కేంద్రాలు: ఫోన్ నంబర్ ఆధార్‌తో లింక్ లేనివారు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీసేవా కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా స్వల్ప రుసుముతో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

అలాగే ఏపీ రైతులు తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోతే, తమ 1బీ, ఆధార్, ఫోన్ నంబరుతో గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి విఆర్ఓ, తహసీల్దార్ల ఆమోదంతో ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

55
మొబైల్ లోనే చెల్లింపుల స్టేటస్ చెక్ ఎలా చేయాలి?
Image Credit : AI

మొబైల్ లోనే చెల్లింపుల స్టేటస్ చెక్ ఎలా చేయాలి?

మీకు డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవడం చాలా ఈజీ. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోమ్‌పేజీలో కనిపించే 'Farmers Corner' సెక్షన్‌లో 'Know Your Status' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నంబర్, స్క్రీన్‌పై ఉన్న క్యాప్చా కోడ్ నమోదు చేసి, మొబైల్‌కు వచ్చే OTP ని ఎంటర్ చేస్తే చాలు. మీ చెల్లింపు ఏ దశలో ఉంది, ఇ-కేవైసీ, ల్యాండ్ సీడింగ్ స్టేటస్ ఏమిటనేది స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రభుత్వం నుంచి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. సాంకేతిక లోపాల వల్ల సాయం ఆగిపోకుండా ఉండాలంటే వెంటనే అర్హులైన రైతులంతా ఇ-కేవైసీ, బ్యాంక్ ఆధార్ సీడింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవడం మంచిదని అధికారులు తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రభుత్వ పథకాలు
ఆంధ్ర ప్రదేశ్
నరేంద్ర మోదీ
నారా చంద్రబాబు నాయుడు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాల‌న న‌డుస్తోంది: జ‌గ‌న్.. పుంగూరు దాడి నేప‌థ్యంలో హైకోర్ట్ కీల‌క ఆదేశాలు
Recommended image2
Now Playing
Nara Bhuvaneswari Great Words About CM Chandrababu Naidu | Asianet Telugu
Recommended image3
విజయవాడలో దసరా సంబరాలు.. రేపే ‘రాగ దాండియా ఉత్సవ్ 2.0’
Related Stories
Recommended image1
Simple Wave EV: 243 కిలో మీటర్ల మైలేజ్.. సింపుల్‌ ఎనర్జీ నుంచి అదిరిపోయే స్కూటర్ వచ్చేసింది !
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved