MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bikes
  • Simple Wave EV: 243 కిలో మీటర్ల మైలేజ్.. సింపుల్‌ ఎనర్జీ నుంచి అదిరిపోయే స్కూటర్ వచ్చేసింది !

Simple Wave EV: 243 కిలో మీటర్ల మైలేజ్.. సింపుల్‌ ఎనర్జీ నుంచి అదిరిపోయే స్కూటర్ వచ్చేసింది !

Simple Wave EV: సింపుల్ ఎనర్జీ రూ.1.09 లక్షల ప్రారంభ ధరతో 'సింపుల్ వేవ్' ఫ్యామిలీ ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. 243 కిమీ రేంజ్, 70 లీటర్ల స్టోరేజ్‌ సహా అద్భుతమైన ఫీచర్లతో ఇది అందుబాటులోకి వచ్చింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 03 2026, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 243 కిమీ రైడ్.. రూ. 1.09 లక్షలకే మైండ్ బ్లాకింగ్ ఫ్యామిలీ ఈవీ స్కూటర్
Image Credit : Facebook/Simple Energy

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 243 కిమీ రైడ్.. రూ. 1.09 లక్షలకే మైండ్ బ్లాకింగ్ ఫ్యామిలీ ఈవీ స్కూటర్

ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ భారత మార్కెట్లోకి తన కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ 'సింపుల్ వేవ్'ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. బెంగళూరుకు చెందిన ఈ ఈవీ స్టార్టప్, రోజువారీ కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసింది. బెంగళూరు ఎక్స్‌షోరూమ్ ప్రకారం ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1,09,999గా నిర్ణయించారు. ఈ స్కూటర్‌కు సంబంధించి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమవ్వగా, సెప్టెంబర్ 25 నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

బ్యాటరీ ఆప్షన్లు, రేంజ్, డిజైన్ పరంగా సింపుల్ వేవ్ తన ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తోంది. కుటుంబ సభ్యులందరికీ కంఫర్ట్‌గా ఉండేలా, మంచి ప్రాక్టికాలిటీతో దీనిని తీసుకొచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాలుగు బ్యాటరీ వేరియంట్లు.. 243 కిమీ రేంజ్
Image Credit : Facebook/Simple Energy

నాలుగు బ్యాటరీ వేరియంట్లు.. 243 కిమీ రేంజ్

సింపుల్ వేవ్ స్కూటర్ నాలుగు విభిన్న బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. కస్టమర్లు తమ రోజువారీ వినియోగాన్ని బట్టి కావలసిన మోడల్‌ను ఎంచుకోవచ్చు. ఎంట్రీ లెవెల్ మోడల్ 2.2 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది ఐడీసీ (IDC) సర్టిఫైడ్ ప్రకారం 110 కిమీ రేంజ్ ఇస్తుంది. అలాగే 2.7 kWh బ్యాటరీ వేరియంట్ 132 కిమీ రేంజ్, 3.7 kWh వర్షన్ 171 కిమీ రేంజ్ అందిస్తాయి.

వీటన్నింటిలో టాప్ వేరియంట్ అయిన 'వేవ్+' మోడల్‌లో భారీ 5 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 243 కిమీల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. చిన్న బ్యాటరీ మోడల్స్ (2.2 kWh, 2.7 kWh) ఎల్‌ఎఫ్‌పీ టెక్నాలజీతో పనిచేస్తే, టాప్ ఎండ్ 5 kWh వేరియంట్ మాత్రం ఎక్కువ డెన్సిటీ ఉండే ఎన్సీఏ కెమిస్ట్రీ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీ, మోటార్ రెండింటికీ ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ ఇచ్చారు.

35
హెవీ రేర్-ఎర్త్ ఫ్రీ మోటార్ అండ్ పర్‌ఫార్మెన్స్
Image Credit : Facebook/Simple Energy

హెవీ రేర్-ఎర్త్ ఫ్రీ మోటార్ అండ్ పర్‌ఫార్మెన్స్

సాంకేతిక పరంగా సింపుల్ వేవ్‌లో మరొక ముఖ్యమైన విశేషం ఉంది. ఇందులో 6.4 kW పీఎమ్‌ఎస్ఎమ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను వాడారు. విదేశీ విడిభాగాలపై ఆధారాన్ని తగ్గించేలా, పూర్తి స్వదేశీ సాంకేతికతతో 'హెవీ రేర్-ఎర్త్ ఫ్రీ' మోటార్‌ను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ ఈవీ కంపెనీ తమదేనని సింపుల్ ఎనర్జీ పేర్కొంది. ఈ మోటార్ గరిష్ఠంగా 179 Nm వీల్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సింపుల్ వేవ్ S వేరియంట్‌లో ఈకో ఎక్స్, ఈకో, రైడ్ మోడ్లు ఉన్నాయి. ఇది గరిష్ఠంగా గంటకు 75 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. హైయర్ వర్షన్లు అయిన వేవ్, వేవ్+ మోడళ్లలో స్పోర్ట్స్ మోడ్ అదనంగా లభిస్తుంది. ఇవి గంటకు 90 కిమీ టాప్ స్పీడ్‌ను అందుకుంటాయి. ప్రయాణం సైలెంట్ గా కొనసాగేందుకు 'హుష్‌డ్రైవ్', మెరుగైన సేఫ్టీ కోసం 'గ్రిప్‌సెన్స్' టెక్నాలజీలను పరిచయం చేశారు. వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌తో వేవ్+ మోడల్‌ను కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

45
70 లీటర్ల భారీ స్టోరేజ్ అండ్ కంఫర్ట్ డిజైన్
Image Credit : Facebook/Simple Energy

70 లీటర్ల భారీ స్టోరేజ్ అండ్ కంఫర్ట్ డిజైన్

ఫ్యామిలీ రైడర్లను ఆకట్టుకునేందుకు ఈ స్కూటర్‌లో ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేశారు. భారతీయ స్కూటర్లలోనే అత్యంత పొడవైన 920 ఎంఎం సీటును ఇందులో అందించారు. స్కూటర్ మొత్తం స్టోరేజ్ కెపాసిటీ ఏకంగా 70 లీటర్లుగా ఉంది. ఇందులో సీటు కింద 63 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది. దీనివల్ల నిత్యం హెల్మెట్లు, కిరాణా సామగ్రి లాంటివి పెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది.

దీనికి తోడు 3 లీటర్ల గ్లోవ్ బాక్స్, సైడ్ ప్యానెల్‌లో 4 లీటర్ల 'పిల్ స్టోరేజ్' డబ్బా కూడా ఇచ్చారు. స్కూటర్ దిగకుండానే చిన్న చిన్న వస్తువులను ఇందులో సులభంగా పెట్టుకోవచ్చు. డిజైన్ విషయానికి వస్తే ఇది ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, వెనుక వైపు గ్రాబ్ రైల్‌తో క్లీన్ లుక్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ సీట్ హైట్ 775 ఎంఎం కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 175 ఎంఎంగా ఉంది. అలాగే 300 ఎంఎం వరకు నీటిలో నడిచే వాటర్ వేడింగ్ కెపాసిటీ దీనికి ఉంది. పెరల్ వైట్, పోలార్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, కోరల్ రెడ్, ట్విలైట్ బ్లాక్, డాల్ఫిన్ గ్రే అనే ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.

55
7-ఇంచ్ స్క్రీన్, ఫీచర్లు అండ్ మార్కెట్ కాంపిటీషన్
Image Credit : Facebook/Simple Energy

7-ఇంచ్ స్క్రీన్, ఫీచర్లు అండ్ మార్కెట్ కాంపిటీషన్

సింపుల్ వేవ్ స్కూటర్‌లో వర్షన్ బట్టి 7-ఇంచ్ ఎల్‌సీడీ లేదా 7-ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అందించారు. ఈ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఆర్మ్ కోర్టెక్స్ గ్రాఫిక్స్ మైక్రోకంట్రోలర్‌తో పనిచేస్తుంది. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ అండ్ కాల్ కంట్రోల్స్, జీపీఎస్ ట్రాకింగ్, ఓటీఏ అప్‌డేట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ట్రాక్షన్ కంట్రోల్, రివర్స్ మోడ్, క్రాల్ మోడ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్, పెటల్ డిస్క్ బ్రేక్, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్సార్బర్లు, 12-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించారు. మార్కెట్లో ఇది ఇటీవలే లాంచ్ అయిన ఏథర్ కోనార్క్, బజాజ్ ఛేతక్, టీవీఎస్ ఐక్యూబ్, విడా విఎక్స్2 వంటి ఫ్యామిలీ ఈవీ స్కూటర్లకు బలమైన పోటీదారుగా నిలవనుంది. ప్రస్తుతం 63 నగరాల్లో 75కి పైగా షోరూమ్‌లు కలిగి ఉన్న సింపుల్ ఎనర్జీ, రాబోయే రోజుల్లో ఉత్పత్తిని, షోరూమ్‌ల సంఖ్యను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Honda QC3: హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 145 కి.మీల మైలేజ్‌, క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image2
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Recommended image3
రివ‌ర్స్ మోడ్‌, ఈజీ పార్క్‌.. అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో ఓలా నుంచి కొత్త‌ ఎల‌క్ట్రిక్ స్కూటీ
Related Stories
Recommended image1
Primary School Age In USA: అమెరికాలో పిల్లలు ఏ వయసులో బడికి వెళ్తారో తెలుసా?
Recommended image2
ఆపిల్ కొత్త సీఈఓ జాన్ టర్నస్ vs సుందర్ పిచాయ్: ఎవరి జీతం ఎక్కువ? మైండ్ బ్లాక్ అయ్యే లెక్కలు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved