సూపర్‌స్టార్ రజనీకాంత్  హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.0’. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ చిత్రం  విడుదల అభిమానులు ఓ ఫెస్టివల్ లా జరుపుకొన్నారు.అందరూ  ముందుగా ఊహించినట్లుగానే ఈ చిత్రం  మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలిరోజు రూ.19 కోట్లు వసూలు చేసినట్లు ఇప్పటికే ట్రేడ్ ఎనాలిసిస్ట్ లు వెల్లడించారు. 

తెలుగులో ఇప్పటివరకు విడుదలైన రజనీ సినిమాల్లో మొదటి రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇవన్ని ప్రక్కన పెడితే ఈ చిత్రం యుఎస్ లో మాత్రం అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టింది.  $1 మిలియన్ మార్క్ ని కూడా రీచ్ కాలేకపోయింది. ఇంతకు ముందు వచ్చిన కబాలి చిత్రం $2.7 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. దాంతో ఇంత తక్కువ వసూలు చేయటం ఏమిటనే టాక్ బయిలుదేరింది.  అక్కడా రజనీ అభిమానులు ఉన్నా..ఎందుకలా జరిగిందని చర్చ మొదలైంది. 

ఈ సినిమా ట్రైలర్స్, పోస్టర్స్ చూసి  వీడియోగేమ్ లా ఉంటుందని భావించి చాలా మంది ఇంట్రస్ట్ చూపలేదని కొందరన్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం...ఈ సినిమా ని లైకా ప్రొడక్షన్స్ వాళ్లు కమీషన్ బేసిస్ మీద సొంతంగా రిలీజ్ చేసారు.  అయితే అక్కడ డిస్ట్రిబ్యూషన్ లెక్కలు అర్దం చేసుకోక, ధియోటర్స్ రిలీజ్ ప్లానింగ్ లేక ...దెబ్బ తిన్నారని తెలుస్తోంది. 

అమెరికాలో ‘2.0’ చిత్రం 265 ప్రదేశాల్లో విడుదలైంది. మొదటి రోజు రాత్రి పది గంటల వరకు ఈ సినిమా రాబట్టిన కలెక్షన్లు 295000 డాలర్లు(రూ.2,05,54,125). న్యూజిలాండ్‌లో 18 ప్రదేశాల్లో విడుదలైన ఈ చిత్రం 23,243 న్యూజిలాండ్‌ డాలర్లు (రూ.11.11 లక్షలు) రాబట్టింది. ఆస్ట్రేలియాలో 114,696 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ.58.46 లక్షలు) రాబట్టింది. అక్కడ ఈ చిత్రం 35 ప్రదేశాల్లో విడుదలైంది.

ఇవి కూడా చదవండి.. 

'2.0' రివ్యూలపై మేధావులు అంటూ 'దిల్ రాజు' వెటకారం

'2.0' ఫస్ట్ డే కలెక్షన్స్!

'2.0' లో అక్షయ్ కుమార్ పాత్రకు ఇన్స్పిరేషన్ ఇతడే!

బాక్సాఫీస్ కి దిగిపోద్ది.. '2.0' పై నాని కామెంట్!

శంకర్ - రాజమౌళి.. మొదలైన ఫ్యాన్స్ వార్!

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?