తమిళ హీరో విశాల్ కి తమ పక్కింటి అమ్మాయితో ఎఫైర్ ఉందని ఓ మహిళ చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ మారాయి. ఓ పక్క మీటూ ఉద్యమానికి తనవంతు సపోర్ట్ అందించిన విశాల్ పై ఇలాంటి ఆరోపణలు రావడం ఏంటని అందరూ షాక్ అయ్యారు. 

అసలు విషయంలోకి వస్తే.. చెన్నైకి చెందిన విశ్వదర్శిని అనే మహిళ గోపాలపురంలోని జీవిస్తోంది. ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఓ వీదియోని విడుదల చేసింది. అందులో ఆమె హీరో విశాల్ పై ఆరోపణలు చేయడం షాకింగ్ గా మారింది. 

ఆమె ఏం చెప్పిందంటే.. ''విశాల్ కి మా పక్కింట్లో ఉండే 16 ఏళ్ల అమ్మాయితో ఎఫైర్ ఉంది. గోడ దూకి మరి అర్ధరాత్రి పూట ఆమె కోసం వస్తుంటాడు. రెండు, మూడు గంటలు గడిపి వెళ్లిపోతుంటాడు. దానికి ఎవిడెన్స్ కూడా ఉందని, సీసీటీవీ ఫుటేజ్ చూడాలని'' వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో విశ్వదర్శిని వీడియో వైరల్ అయింది.

ఈ క్రమంలో ఆమె పక్కింట్లో ఉండే 16 ఏళ్ల అమ్మాయి ఈ విషయంపై స్పందించింది. తనపై ఇలాంటి సెక్సువల్ ఆరోపణలు చేసిన విశ్వదర్శినిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు విశ్వదర్శిని చేసిన ఆరోపణల్లో నిజంలేదని తేల్చారు. ఆమెపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.