Asianet News TeluguAsianet News Telugu

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

భారీ బడ్జెట్ సినిమాలు తీయడం మాత్రమే గొప్ప కాదు అందులో మనుషుల్ని ఆలోచింపజేసే ఏదైనా కంటెంట్ ఉంటే అది అసలైన గొప్పతనం. సినిమా అనేది సినిమాగానే చూడాలి అనే కామెంట్ ఎప్పుడు వినిపించేదే కానీ శంకర్ చేసిన దాదాపు అన్ని సినిమాలు ఆ కామెంట్ కు తావివ్వవు. 

shankar given good global message
Author
Hyderabad, First Published Nov 29, 2018, 2:44 PM IST

భారీ బడ్జెట్ సినిమాలు తీయడం మాత్రమే గొప్ప కాదు అందులో మనుషుల్ని ఆలోచింపజేసే ఏదైనా కంటెంట్ ఉంటే అది అసలైన గొప్పతనం. సినిమా అనేది సినిమాగానే చూడాలి అనే కామెంట్ ఎప్పుడు వినిపించేదే కానీ శంకర్ చేసిన దాదాపు అన్ని సినిమాలు ఆ కామెంట్ కు తావివ్వవు. ఇప్పుడు 2.0 కూడా ఒక్కసారిగా మనసులో ఒక ఆలోచనను కదిలిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ప్రపంచంలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. కానీ మనుషుల అవసరాలకు ఇతర జీవాల ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ప్రపంచానికి మనుషుల జీవన విధానానికి పక్షులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని శంకర్ చెప్పిన విధానం ప్రశసించాల్సిన విషయం. పచ్చగా ఉండే ప్రకృతిని పురుగులు నాశనం చేస్తాయి. వాటిని అదుపుచేయడానికి పక్షులు వాటిని తింటాయి. ఇక కొన్ని రకాల పక్షులు వాతావరణంలో మార్పులు తెస్తాయని వర్షాలు కురవడానికి కారణమవుతాయనే లోగుట్టును అందరికి తెలిసేలా చేశారు. 

ఇక మరో దేశం నుంచి వేలాది కిలమీటర్ల నుంచి వచ్చే పక్షులు భారతదేశంలోని ఓ గ్రామానికి రావడం.. కేవలం ప్రకృతిలో భాగంగా అవి వాటి మెదడుతో దారులను గుర్తుపెట్టుకొని అన్ని వేలాది కిలోమీటర్లు వస్తాయని శంకర్ కొన్ని మరచిపోతున్న విషయాల్ని అర్థమయ్యేలా చెప్పాడు. అక్షయ్ కుమార్ పాత్ర చుట్టూ పక్షుల విషయాలను మమేకం చేయడం హృదయానికి తాకుతుంది. 

అయితే పక్షులు కేవలం అధిక రేడియేషన్ కారణంగా చనిపోతుండడం మానవాళికి ఎంత ప్రమోదమో చెప్పకనే చెప్పాడు. మొబైల్స్ వాడకంలో పక్షుల రక్తపు బొట్టు ఉందని అవి అంతమైతే మానవాళి మనుగడం మరింత ప్రమాదమని హెచ్చరించాడు. సినిమాటిక్ గా వెళుతూ యాక్షన్ సన్నివేశాలు ఎన్ని చూపించినా కూడా తాను చెప్పాలనుకున్న అంశాన్ని మాత్రం చాలా కరెక్ట్ గా చెప్పాడు. పక్షుల గొప్పతనాన్ని - రేడియేషన్ కారణంగా అవి పడే నరకాయతనను హెచ్చరిక అని తెరపై ఆలోచింపజేసేలా చూపించాడు. అందుకు శంకర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 

 

ఇవి కూడా చదవండి.. 

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Follow Us:
Download App:
  • android
  • ios