దర్శకుడు శంకర్ రూపొందించిన '2.0' సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూశారు. బాహుబలి తరువాత ఆ రేంజ్ లో ఈ సినిమా కోసం  ఎదురుచూశారు. 

దర్శకుడు శంకర్ రూపొందించిన '2.0' సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూశారు. బాహుబలి తరువాత ఆ రేంజ్ లో ఈ సినిమా కోసం ఎదురుచూశారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తమిళనాడులో చాలా చోట్ల ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. సినిమాను చూసిన అభిమానులను ఆనందంతో ఊగిపోతున్నారు. తమ బాస్ రజినీకాంత్ హిట్ కొట్టేశాడని సంబరాలు చేసుకుంటున్నారు. తమ అభిప్రాయాలను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. 

చిట్టి ఎంట్రీ అదిరిపోయిందని, ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరచలేదని, రజిని-అక్షయ్ ల నటన ఎన్నో ఏళ్లు గుర్తుండిపోతుందని అంటున్నారు. రెహ్మాన్ సంగీతం సినిమా స్థాయిని పెంచిందని కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమా క్లైమాక్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందని, వీఎఫ్ఎక్స్ వర్క్ అధ్బుతమని కొనియాడుతున్నారు.

ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించిన ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. శంకర్ హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తీశారని, హాలీవుడ్ మీకోసం ఎదురుచూస్తోందని దర్శకుడు శంకర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…