నటీనటులు: రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ తదితరులు 
సంగీతం: ఏఆర్ రెహ్మాన్ 
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా 
ఎడిటింగ్: ఆంథోనీ 
వీఎఫ్ఎక్స్ అడ్వైజర్: శ్రీనివాసమోహన్ 
యాక్షన్: సెల్వ 
నిర్మాత: ఏ.సుభాష్ కరణ్, రాజు మహాలింగం 
దర్శకుడు: శంకర్

సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన '2.0' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెండితెరపై అధ్బుతాలను సృష్టించే దర్శకుడు శంకర్ ఈ సినిమాను రూపొందించారు. విడుదలకు ముందు నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తమిళ, తెలుగు భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది వేల థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా వారి అంచనాలను అందుకునే విధంగా ఉందని ఇప్పటికే ప్రీమియర్ షోల ప్రదర్శన ద్వారా సినిమా టాక్ బయటకి వచ్చేసింది.  మీడియా వాళ్లకు ప్రత్యేకంగా వేసిన షోని బట్టి 
కథ ఎలా ఉండబోతుందనే విషయం బయటకి పొక్కింది.. ఆ కథేంటో మనం కూడా తెలుసుకుందాం!

క‌థేంటంటే:

ఉన్నట్టుండి భూమి మీద ఉన్న అందరి సెల్ ఫోన్లు మాయమైపోతుంటాయి. చేతిలో పెట్టుకొని మాట్లాడుతున్న ఫోన్లు సిత గాల్లోకి ఎగిరిపోతుంటాయి. ఈ పరిణామానికి ప్రపంచం మొత్తం షాక్ అయిపోతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకు కూడా అర్ధం కాదు. ఏదో బలమైన శక్తి దీని వెనుక ఉందని భావిస్తారు. ఇంతలో సెల్ ఫోన్ లు అన్నీ అమర్చుకున్న ఓ పక్షి ఆకారపు రూపం నగరంలోకి ప్రవేశించి విధ్వంసాలు సృష్టించడం మొదలుపెడుతుంది.

దీంతో డా.వసీకర్(రజినీకాంత్) రంగంలోకి దిగి చిట్టి(రోబో) మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలడని భావించి రోబో కథలో నాశనం చేసిన చిట్టిని తిరిగి రీబూట్ చేస్తాడు. మరి చిట్టి ది రోబో పక్షిరాజుని ఎదుర్కొని ప్రజలను కాపాడిందా..?వసీకర్ ఈ ప్రయత్నంలో విజయవంతమయ్యాడా..? అసలు ఈ పక్షిరాజు ఎవరు..? సెల్ ఫోన్లను ఎందుకు టార్గెట్ చేశాడు..? అనే విషయాలు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

----పూర్తి రివ్యూ మరికాసేపట్లో   

ఇవి కూడా చదవండి.. 

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?