దర్శకుడు శంకర్ రూపొందించిన '2.0' సినిమాలో అక్షయ్ కుమార్ పక్షిరాజు పాత్రలో ఒదిగిపోయాడు. రేడియేషన్ కారణంగా పక్షులు చనిపోతున్నాయని వాటిని కాపాడండి అంటూ అక్షయ్ కుమార్ పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ పాత్రను ఓ వ్యక్తి స్ఫూర్తితో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఆయన మరెవరో కాదు.. ఆర్నిథాలజీ నిపుణుడు, పర్యావరణ వేత్త సలీం అలీ. ఆయన జీవితంలో కొన్ని అంశాల ఆధారంగా అక్షయ్ కుమార్ పాత్రను ఆవిష్కరించారు. 'బర్డ్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా' పేరుతో ప్రఖ్యాతి గాంచిన సలీం అలీ పక్షుల కోసం ఎంతగానో పాటుపడ్డారు.

పక్షుల గురించి ఆయన రాసినన్ని పుస్తకాలు మరెవరూ రాసి ఉండరు. సలీం అందించిన సేవలను గుర్తించిన ప్రభుత్వం అతడిని పద్మవిభూషణ్ అవార్డు ని అందించింది. 1987లో ఆయన మరణించారు.

శంకర్ తన సినిమాలో పక్షిరాజు పాత్రకు సలీం అలీనే స్పూర్తిగా తీసుకొని డిజైన్ చేశారట. ఈ విషయాన్ని కథా రచయిత జయమోహన్ చెబుతూ.. 'మన సాంకేతిక వినియోగ సంస్కృతి కారణంగా ప్రకృతికి జరుగుతున్న కీడుని చూస్తే ఎంత ఆవేశానికి గురవుతారో చూపాలనే పక్షిరాజు పాత్రను సృష్టించామని' అన్నారు. 

ఇవి కూడా చదవండి.. 

బాక్సాఫీస్ కి దిగిపోద్ది.. '2.0' పై నాని కామెంట్!

శంకర్ - రాజమౌళి.. మొదలైన ఫ్యాన్స్ వార్!

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?