దర్శకుడు శంకర్ తెరకెక్కించిన '2.0' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం తెలుగు, తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు 
జక్కన్న సైతం ఈ సినిమా విడుదల కూడా వెయిట్ చేస్తున్నారట.

ఈ సంధర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. రజినీకాంత్ నటించిన 2.0 చూడడానికి చాలా ఆతృతగా ఉన్నట్లు రాజమౌళి చెప్పారు. రజినీకాంత్, అక్షయ్ కుమార్ చాలా అవతారాలను చూసేందుకు ఇంకా ఒకరోజే ఉందని చెబుతూ చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. 

అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలు భారీ ఎత్తున ప్రదర్శించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మూడు భాషల్లో పదివేల థియేటర్స్ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతూ బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేయబోతుంది ఈ సినిమా. 

ఇవి కూడా చదవండి.. 

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?