దక్షిణాది అగ్ర దర్శకుల్లో శంకర్ ఒకరు.. ఆయన రూపొందించిన 'రోబో' సినిమా ఘన విజయాన్ని అందుకొని వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా '2.0' సినిమాను రూపొందించాడు శంకర్. రజినీకాంత్, అక్షయ్ కుమార్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సినిమా టీజర్, ట్రైలర్ లు ఆ అంచనాలను మరింతగా పెంచేశాయి. రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఎలా ఉందో  ముందో  సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు.

దుబాయి సెన్సార్ బోర్డ్ లో మెంబర్ అని చెప్పుకునే ఉమైర్ సంధు ఈ సినిమాకు ఇచ్చిన రివ్యూ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది. దేశం గర్వించేలా దర్శకుడు శంకర్ ఈ సినిమాను రూపొందించాదని ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.

సినిమా ప్లాట్, స్క్రీన్ ప్లే, యాక్షన్, ఎఫెక్ట్స్ అధ్బుతంగా ఉన్నాయని.. రజినీకాంత్, అక్షయ్ కుమార్ లు తన నటనతో సినిమాకు ప్రాణం పోసారని అన్నాడు. సినిమా మొదలైన దగ్గర నుండి చివరి వరకు ప్రతి ఒక్క ఫ్రేమ్ అధ్బుతంగా ఉందని, రజినీకాంత్ హార్డ్ కోర్ అభిమానులు ఈ సినిమాతో సంబరాలు చేసుకోవడం ఖాయమని అంటున్నారు. భారత సినీ చరిత్రలో బెస్ట్ సైంటిఫిక్ త్రిల్లర్ గా ఈ సినిమా నిలిచిపోతుందని అన్నారు. 

సంబంధిత వార్తలు 

2.0ను అడ్డుకోవాలని ఆందోళనలు.. మొదలైన పిర్యాదులు!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

అడ్వాన్స్ బుకింగ్స్ తో షాకిస్తున్న 2.0!

యూఎస్ రిలీజ్: బాహుబలి ని కొట్టేసిన 2.0!

'2.0' రిజల్ట్ పై సందేహాలా..?

రోబో 2.0లో అదిరిపోయే స్టంట్స్ చేసిన ఎమీ జాక్సన్ (వీడియో)

2.0 ఆలస్యానికి అసలు కారణం చెప్పిన శంకర్!

2.O లో మళ్ళీ ఆ సీన్స్ ఉండవు..కొత్త విషయాలేన్నో.. : శంకర్

తెలుగు 2.0 ప్రమోషన్స్ కోసం డబ్బు వృధా చేస్తున్నారు: రజినీకాంత్

రోబో సీక్వెల్స్: శంకర్ కొరిక గట్టిగానే ఉంది.. కానీ?