సాధారణంగా ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే అది వచ్చిన రెండు, మూడు వారాలకు గాను కొత్త సినిమాలను విడుదల చేయడానికి సాహసించరు. కానీ '2.0' విషయంలో 
అలా జరగడం లేదు. ఈ సినిమా థియేటర్ లోకి వచ్చే వారం రోజులకే అరడజను సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.

డిసంబర్ 7న చిన్న, పెద్ద మొత్తం కలిపి అరడజనుకి పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సుమంత్ 'సుబ్రమణ్యపురం', సందీప్ కిషన్ 'నెక్స్ట్ ఏంటి..?', రామ్ గోపాల్ వర్మ 'భైరవగీత', బెల్లంకొండ 'కవచం' ఇలా చాలా సినిమాలు ఇప్పటికే కర్చీఫ్ వేసేశాయి. ఎవరైనా వెనక్కి తగ్గుతారా అంటే ఆ ఛాన్స్ కూడా కనిపించడం లేదు.

ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించేశారు. ఇదంతా చూస్తుంటే.. రేపు విడుదల కాబోతున్న '2.0' సినిమా రిజల్ట్ పై వీరికి నమ్మకం లేదనే అనిపిస్తుంది. స్టార్ హీరోల సినిమాలు విడుదలైన రెండు మూడు వారాల వరకు మీడియం రేంజ్ సినిమాలనే విడుదల చేయరు..

ఏవో చిన్న సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ కాస్త బడ్జెట్ పెట్టి తీసిన 'కవచం', 'నెక్ట్స్ ఏంటి..?' సినిమాలు విడుదలవుతున్నాయి. దీంతో '2.0' సినిమా ఆడదనే నమ్మకంతో ఇలా చేస్తున్నారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. సినిమాకి హిట్ టాక్ వస్తే అప్పుడైనా వాయిదా వేస్తారేమో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?