దర్శకుడు శంకర్ రూపొందించిన '2.0' సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కోసం రజినీకాంత్ అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఎదురుచూశారు.
దర్శకుడు శంకర్ రూపొందించిన '2.0' సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కోసం రజినీకాంత్ అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఎదురుచూశారు. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అందరూ ఆశ పడ్డారు కానీ కొందరికి మాత్రం కుదరలేదు.
అఖిల్ నటించిన 'హలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఈ సినిమాను ఫస్ట్ డే చూడాలనుకుందట. కానీ దర్శకుడు మాత్రం తనకు పర్మిషన్ ఇవ్వలేదని అంటోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరం తేజ్ హీరోగా 'చిత్రలహరి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో కళ్యాణిని '2.0' సినిమా చూడడానికి డైరెక్టర్ పర్మిషన్ ఇవ్వలేదట. ఆ మ్యాజిక్ ని తెరపై చూడాలని నాకెంతో ఆతురతగా ఉందని, ఈరోజు సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే '2.0' చూస్తానని కళ్యాణి సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
Director Garu is not allowing me to skip work and watch @2Point0movie! 😝
— Kalyani Priyadarshan (@kalyanipriyan) November 29, 2018
Can’t wait to watch the magic once we wrap! 🤩#2Point0FromToday pic.twitter.com/vgieETYuR7
ఇవి కూడా చదవండి..
శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!
రెండు రెట్లు గ్రాఫిక్స్..జీరో గ్రావిటి కథ (‘2.0’మూవీ రివ్యూ)
'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!
శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!
'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!
'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?
'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!
2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!
2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 29, 2018, 2:53 PM IST