Trisha Krishnan: హీరో దళపతి విజయ్‌తో మరో నటికి సంబంధం ఉందంటూ ఆయన భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేశారు. దీంతో ఆ నటి త్రిషనే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఆమెని ట్రోల్‌ చేస్తున్నారు. 

దళపతి విజయ్‌కి వరుస ఎదురుదెబ్బలు

కోలీవుడ్‌ స్టార్‌, దళపతి విజయ్ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు ఒకదాని తర్వాత మరోటి ఎదురు దెబ్బలు ప్రారంభమయ్యాయి. ఆయన నటించిన `జన నాయకుడు` సినిమా విడుదల అడ్డుకున్నారు. ఇది ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో క్లారిటీ లేదు. ఈ క్రమంలో ఇప్పుడు సొంత ఫ్యామిలీలోనే ఎదురు దెబ్బ పడింది. ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కింది. ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

విజయ్‌ భార్య సంగీత విడాకుల కోసం పిటిషన్‌

విజయ్‌ రాజకీయ భవిష్యత్తుకు, వ్యక్తిగత జీవితానికి ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ పెద్ద దెబ్బలా మారింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి, సంగీత ఆరోపించిన ఆ నటి ఎవరనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. చాలాకాలంగా విజయ్‌తో పాటు వినిపిస్తున్న త్రిష పేరే ఇప్పుడు కూడా బలంగా ప్రచారంలో ఉంది. దీంతో త్రిషపై సోషల్ మీడియాలో తీవ్రమైన సైబర్ దాడి జరుగుతోంది. ఆమె పాత సోషల్ మీడియా పోస్టుల కింద దారుణమైన కామెంట్లు కనిపిస్తున్నాయి. 

హీరోయిన్‌ త్రిషపై దారుణంగా ట్రోలింగ్‌

'ఒక కుటుంబాన్ని నాశనం చేశావు' అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. `ఆ నటి మీరే. విజయ్ అన్న రాజకీయంగా పీక్స్‌లో ఉన్నప్పుడు ఈ ద్రోహం చేయాల్సింది కాదు`, `విజయ్ అన్న జీవితాన్ని నాశనం చేసినందుకు అభినందనలు`, `అప్పుడు అర్థం కాలేదు.. ఇప్పుడు అవుతోంది` వంటి కామెంట్లు పోటెత్తుతున్నాయి. మరోవైపు, 'జస్టిస్ ఫర్ సంగీత' (#JusticeForSangeetha) అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొందరు ట్రెండ్ చేస్తున్నారు. అయితే, త్రిషకు సపోర్ట్ గా నిలుస్తున్న వారు కూడా చాలామందే ఉన్నారు. సంగీత చెప్పిన నటి త్రిషనే అని ఏ ఆధారం లేకుండా ఎలా అంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇందులో త్రిష తప్పేం లేదని అంటున్నారు. 

త్రిష నా లక్కీ ఛార్మ్- విజయ్‌

గతంలో 'తిరుప్పాచ్చి' సినిమా ప్రమోషన్ సమయంలో త్రిష గురించి విజయ్ చెప్పిన మాటలను కూడా నెటిజన్లు ఇప్పుడు తిరగదోడుతున్నారు. 'సినిమాల్లో త్రిష నా లక్కీ ఛార్మ్ (లక్కీ పెయిర్). మా 'గిల్లి' సినిమా ఆ అభిప్రాయాన్ని క్రియేట్ చేసింది' అని విజయ్ అన్న మాటలను ఇప్పుడు ట్రోల్స్‌లో, విమర్శల్లో వాడుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా సీన్లను ఉపయోగించి మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. త్రిషని బయటకు లాగుతూ నానా రచ్చ చేస్తున్నారు. 

View post on Instagram

గత కొంతకాలంగా విజయ్-త్రిష మధ్య సంబంధం ఉందంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇటీవల విజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ త్రిష పెట్టిన పోస్ట్ కూడా బాగా వైరల్ అయింది. అయితే ఈ పుకార్లపై విజయ్ గానీ, త్రిష గానీ ఎప్పుడూ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సంగీత విడాకులకు దరఖాస్తు చేయడం, అందులో మరో నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించడం కోలీవుడ్‌లో ఇదిప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. 

Asianet News Live | Malayalam Live News | Breaking News l Kerala News Updates | HD News Streaming