శంకర్ అధ్బుత సృష్టి '2.0' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని 3డి వెర్షన్ తో పాటు 2డిలో కూడా విడుదల చేస్తున్నారు. అయితే ఇక్కడే ఓ రకమైన కన్ఫ్యూజన్ మొదలైంది.

3డి అన్నీ థియేటర్ లలో ఉండే అవకాశం లేకపోవడంతో 2డి వెర్షన్ కూడా విడుదల చేస్తున్నారు. కొన్ని థియేటర్లలో రెండు వెర్షన్ లను కలిపి విడుదల చేస్తున్నారు. సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు మేకర్స్ 3డిలో చూస్తేనే ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పి ప్రెస్ వాళ్లకి ప్రత్యేకంగా థియేటర్లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు.

ట్రైలర్ 2డిలో చూసిన వారు కొందరు నెగెటివ్ కామెంట్స్ చేయగా.. 3డిలో చూసిన వారు మాత్రం బాగుందని మెచ్చుకున్నారు. సినిమా 3డి వెర్షన్ లోనే బాగుంటుందని తెలిసి కూడా మేకర్స్ 2డిలో విడుదల చేయడం వలన సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చే ఛాన్స్ లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఇండియాలో 3డి ఉన్న థియేటర్లు తక్కువని తెలిసి కూడా సినిమాను 3డిలో చిత్రీకరించి ఎందుకు రిస్క్ చేస్తున్నారనేది అర్ధం కానీ ప్రశ్న. రేపు విడుదల కాబోతున్న సినిమాకు రెండు రకాల టాక్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇవి కూడా చదవండి.. 

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?