మరికొద్ది గంటల్లోనే దర్శకుడు శంకర్ రూపొందించిన '2.0' సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ రూపొందించే సినిమాలపై ప్రేక్షకులకు నమ్మకం ఉంటుంది.

మధ్యలో 'ఐ' లాంటి సినిమా తీసినా ప్రేక్షకులకు ఆయనపై నమ్మకం మాత్రం తగ్గలేదు. 2.0 సినిమా ట్రైలర్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయిందనే కామెంట్లు వినిపించాయి. శంకర్ స్వయంగా ట్రైలర్ లో చెప్పింది చాలా తక్కువ అని చాలా దాచామని అన్నాడు.

మరోపక్క ఈ సినిమా సెల్ ఫోన్ రేడియేషన్ వంటి పాయింట్ తో రూపొందిందని దీనికారణంగా తమకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని టెలికాం కంపెనీలు గొడవ చేస్తున్నాయి. అక్షయ్ కుమార్ క్యారెక్టర్ ని విలన్ గా చూపిస్తున్నప్పటికీ ఆయన పాత్రకి పాజిటివ్ నెస్ ఉండేలా డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం.. అక్షయ్ కుమార్ ఆకాశం నుండి దిగివచ్చే శక్తి కాదని, దర్శకుడు శంకర్ సూపర్ నేచురల్ పవర్స్ గురించి డీల్ చేశాడని టాక్. ఇప్పటివరకు చాలా మంది దర్శకుడు సూపర్ నేచురల్ పవర్స్ గురించి డీల్ చేశారు కానీ శంకర్ లాంటి పెద్ద దర్శకుడు కాదు.. మరి ఆయన ఎలా తీశారో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?