శంకర్ డైరెక్ట్ చేసిన విజువల్ వండర్ 2.0 రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కినట్లు చెబుతున్న ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ఫస్ట్ డే 50 కోట్లను కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

ఇక బాహుబలి 9000 వేలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ కాగా 2.0 10 వేల స్క్రీన్స్ లలో రిలీజ్ కానుంది. మొత్తంగా 15 భాషల్లో రానున్న ఈ 3డి మూవీ అన్ని అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. ఫస్ట్ డే ఇండియాలో అయితే హౌస్ ఫుల్ బోర్డులు దర్శమిస్తాయని చెప్పవచ్చు. బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1 మిలియన్ టికెట్స్ సెల్ అయ్యి సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది.

ఇక ఫస్ట్ డేట్ ఇండియాలో 70 కోట్ల వరకు భారీ వసూళ్లను అందుకోవచ్చని తెలుస్తోంది, ఇక వరల్డ్ వైడ్ గా 120 కోట్ల కలెక్షన్స్ అందే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాదాపు అన్ని సెన్సార్ బోర్డు నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. గ్లోబల్ మెస్సేజ్ తో వస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.