MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Tamanna: రాజకీయాల్లోకి తమన్నా, మనసులో మాట.. మైసూర్‌ సాండల్‌ వివాదం వేళ మిల్కీ బ్యూటీ కామెంట్స్ వైరల్‌

Tamanna: రాజకీయాల్లోకి తమన్నా, మనసులో మాట.. మైసూర్‌ సాండల్‌ వివాదం వేళ మిల్కీ బ్యూటీ కామెంట్స్ వైరల్‌

Tamannaah: కర్నాటకలోని మైసూర్‌ సాండల్‌ సోప్‌ వివాదంలో తమన్నా పేరు వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు ఆమె రాజకీయ ఎంట్రీకి సంబంధించిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.  మిల్కీ బ్యూటీ తన మనసులో మాటని బయటపెట్టింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 28 2026, 09:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బోల్డ్ రోల్స్ కి రెడీగా ఉన్న తమన్నా
Image Credit : youtbe/@aha

బోల్డ్ రోల్స్ కి రెడీగా ఉన్న తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల సినిమాలు చాలా సెలక్టీవ్‌గా చేస్తోంది. అదే సమయంలో బోల్డ్ రోల్స్ కి రెడీ అవుతుంది. స్పెషల్‌ సాంగ్స్ తో మెరుస్తుంది. తెలుగులో కంటే హిందీలో బిజీగా ఉంది తమన్నా. కంటెంట్‌ ఉన్న చిత్రాలు, తన పాత్రకి ప్రయారిటీ ఉన్న మూవీస్‌ ఎక్కువగా చేస్తోంది. నటిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తమన్నాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కర్నాటక మైసూర్‌ సాండల్‌ సోప్‌ వివాదంలో తమన్నా
Image Credit : MB Patil X Account

కర్నాటక మైసూర్‌ సాండల్‌ సోప్‌ వివాదంలో తమన్నా

తమన్నా ఇటీవల కర్నాటక రాజకీయా వివాదంలో ఇరుక్కొంది. ఆమె కర్నాటక ప్రభుత్వానికి చెందిన మైసూర్‌ సాండల్‌ సోప్‌ కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యింది. ఈ సోప్‌ని నార్త్ జనాలకు కూడా రీచ్‌ అయ్యేందుకు, దీని మార్కెట్‌ని విస్తరించేందుకు తమన్నాని బ్రాండ్ అంబాసిడర్‌ని చేసింది అక్కడి ప్రభుత్వం. కానీ దీనిపై విమర్శలు వచ్చాయి. కన్నడ హీరోయిన్లు ఉండగా, నార్త్ అమ్మాయిని ఎందుకు తీసుకున్నానే విమర్శలు వచ్చాయి. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. కానీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు.

Related Articles

Related image1
Allu Arjun ఎప్పుడు ఏడుస్తాడో తెలుసా? ఇంటి రహస్యాలు బయటపెట్టిన అల్లు అరవింద్‌
Related image2
Samantha: నాగచైతన్య నుంచి విడిపోవడానికి సమంత ఎన్నికోట్ల భరణం తీసుకుందో తెలుసా? ఆమె గట్స్ కి సెల్యూట్‌ చేయాల్సిందే
36
భారీ పారితోషికం తీసుకున్న తమన్నా
Image Credit : youtbe/@aha

భారీ పారితోషికం తీసుకున్న తమన్నా

దీంతో కన్నడ రాజకీయ వివాదంలో తమన్నా ఇరుక్కుంది. అయితే దీనిపై ఆమె మౌనంగానే ఉంది. తన పని తాను చేసుకుపోయింది. తమన్నా ఈ సోప్‌ కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా రెండేళ్లపాటు ఉంటుంది. అందుకుగానూ ఆరున్నర కోట్ల పారితోషికం తీసుకుందట. ఇది కూడా వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో తమన్నాకి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆసక్తిని రేకెత్తిస్తుంది.

46
రాజకీయాల్లోకి తమన్నా
Image Credit : youtbe/@aha

రాజకీయాల్లోకి తమన్నా

తమన్నా రాజకీయాలపై ఆసక్తిని చూపిస్తోంది. ఆరేళ్ల క్రితమే తన మనసులో మాటని బయటపెట్టింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని, అవేంటో తెలియదని, రాజకీయాల్లోకి రావాలంటే చాలా బాధ్యత ఉండాలని చెప్పింది. అయితే భవిష్యత్‌లో రాజకీయాల గురించి తెలుసుకొని వస్తానేమో అని ఏడేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ తర్వాత సమంతతో మాట్లాడుతూ, మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తాను రాజకీయాల్లోకి వస్తుందనే రూమర్‌ నిజమైతే బాగుండు అని చెప్పింది.

56
రాజకీయాల్లోకి వస్తుందనేది నిజమైతే బాగుండు
Image Credit : youtbe/@aha

రాజకీయాల్లోకి వస్తుందనేది నిజమైతే బాగుండు

తమన్నా.. సమంత నిర్వహించిన సామ్‌ జామ్‌ షోకి వెళ్లింది. ఇందులో సామ్‌.. ఈ రూమర్లలో ఏది నిజమైతే బాగుండు అని నువ్వు ఫీలవుతావని అడిగింది. అందులో.. 1.తమన్నా కోస్టార్‌తో గొడవ పడింది, 2,తమన్నా రాజకీయాల్లోకి వస్తుంది. 3,తమన్నా రిపోర్టర్స్ తో రూడ్‌గా మాట్లాడింది. ఈ మూడింటిలో ఏది నిజమైతే బాగుండు అని సమంత ప్రశ్నించగా, తాను రాజకీయాల్లోకి వస్తుందనేది నిజమైతే బాగుంటుందని, ఏదైనా సేవ చేయడానికి పవర్‌ ఉంటుందని చెప్పింది తమన్నా. మొత్తంగా తన మనసులో మాటని బయటపెట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇది ఆమెకి మనసులో హ్యాపీ అయ్యే విషయమనే చెప్పొచ్చు.

66
తమన్నా సినిమాలు
Image Credit : Instagram/Tamannaah Bhatia

తమన్నా సినిమాలు

తమన్నా.. చివరగా `ఓ రోమియో` అనే హిందీ మూవీలో మెరిసింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టుకుంది. అంతకు ముందు `ఓడెల 2`లో ప్రధాన పాత్రలో నటించింది. ఇది కూడా ఆడలేదు. ఇప్పుడు `బోల్‌ చుడియన్‌` అనే చిత్రంలో నటిస్తుంది. స్పెషల్‌ సాంగ్స్, బోల్డ్ రోల్స్ కి రెడీగా ఉంటోంది మిల్కీ బ్యూటీ.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Related Stories
Recommended image1
Allu Arjun ఎప్పుడు ఏడుస్తాడో తెలుసా? ఇంటి రహస్యాలు బయటపెట్టిన అల్లు అరవింద్‌
Recommended image2
Samantha: నాగచైతన్య నుంచి విడిపోవడానికి సమంత ఎన్నికోట్ల భరణం తీసుకుందో తెలుసా? ఆమె గట్స్ కి సెల్యూట్‌ చేయాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved