రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. 

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రియాలిటీకి చాలా దూరంగా ఉండడంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టిన చిత్రబృందం ఆ సన్నివేశాలను సినిమా నుండి తొలగించింది. 

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను డబ్బింగ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రెండు భాషలకు సంబంధించి థియేట్రికల్ రైట్స్ ని ప్రకాష్ ఫిలిమ్స్ సంస్థ చేజిక్కించుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, ఫిబ్రవరి మొదటివారంలో సినిమాను విడుదల  చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు.

తెలుగులో వస్తోన్న ప్రయోగాత్మక చిత్రాలను తమిళ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. 'బాహుబలి', 'అర్జున్ రెడ్డి' వంటి సినిమాలు వాళ్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఓ కమర్షియల్ సినిమా, పైగా తెలుగులో డిజాస్టర్ టాక్ వచ్చిన 'వినయ విధేయ రామ'ని తమిళంలో విడుదల చేస్తే పరువుపోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ నిర్మాతలు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదని సమాచారం. 

సంబంధిత వార్తలు..

'వినయ విధేయ రామ' ఎఫెక్ట్.. బయ్యర్ నిండా మునిగిపోయాడు!

‘విన‌య విధేయ రామ’ పై రామ్ చరణ్ కామెంట్

'వినయ విధేయ రామ' మూడు రోజుల కలెక్షన్స్!

'వినయ విధేయ రామ'.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్